ఆర్15 ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ వెర్షన్ 3.0 లో యమహా ఆర్15

యమహా ఆర్15 అంటే తెలియని యంగస్టర్స్ ఉండరు. ప్రతి యువ కొనుగోలుదారుల్లో ఏదో ఒక దశలో యమహా ఆర్15 తమ ఫేవరెట్ బైక్‌గా స్థానం సంపాదించుకుంటుంది. అందుకే తొలి పరిచయం నుండి మూడవ వెర్షన్ వరకు వచ్చింది.

By Anil

యమహా ఆర్15 అంటే తెలియని యంగస్టర్స్ ఉండరు. ప్రతి యువ కొనుగోలుదారుల్లో ఏదో ఒక దశలో యమహా ఆర్15 తమ ఫేవరెట్ బైక్‌గా స్థానం సంపాదించుకుంటుంది. అందుకే తొలి పరిచయం నుండి మూడవ వెర్షన్ వరకు వచ్చింది.

యమహా వైజడ్ఎఫ్ ఆర్15

ఆర్15 లో ఎప్పటికప్పుడు మార్పులు తీసుకొస్తూ కొనుగోలుదారులను ఆకట్టుకుంటుంది యమహా. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న ఆర్15 వెర్షన్ 2.0 స్థానంలో వెర్షన్ 3.0 మోడల్‌ను విడుదల చేయడానికి యమహా సిద్దమైంది.

యమహాఆర్15 లో ఎప్పటికప్పుడు మార్పులు తీసుకొస్తూ కొనుగోలుదారులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న ఆర్15 వెర్షన్ 2.0 స్థానంలో వెర్షన్ 3.0 మోడల్‌ను విడుదల చేయడానికి యమహా సిద్దమైంది.

Recommended Video

[Telugu] Yamaha Launches Dark Night Variants - DriveSpark
యమహా వైజడ్ఎఫ్ ఆర్15

సరికొత్త థర్డ్ వెర్షన్ ఆర్15 డిజైన్ మొట్టమొదటి ఆర్15 బైకునే పోలి ఉంటుంది. అయితే ఫీచర్లు మరియు డిజైన్ పరంగా స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. యమహా ఇప్పటికే ఆర్15 3.0 వెర్షన్‍‌ను ఇండోనేషియా మరియు ఇతర మార్కెట్లో అమ్మకాల్లో ఉంది.

యమహా వైజడ్ఎఫ్ ఆర్15

ప్రస్తుతం ఇండియన్ రోడ్ల మీద పరీక్షించబడుతున్న 3.0 వెర్షన్ ఫ్రంట్ డిజైన్ మరియు డీకాల్స్ డిజైన్ అచ్చం ఆర్15 2.0 వెర్షన్‌ తరహాలోనే ఉన్నప్పటికీ ఓవరాల్ లుక్ మరియు డిజైన్ అంతర్జాతీయ మోడల్‌ను పోలి ఉంటుంది.

యమహా వైజడ్ఎఫ్ ఆర్15

ఎప్పటి నుండో అనుకుంటున్న అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ ఇందులో మిస్సయ్యాయి. చివరి ఎడిషన్ ఆర్15లో ఉన్న అవే కన్వెన్షనల్ ఫ్రంట్ ఫోర్క్స్‌ను అందించింది. ఎంట్రీ లెవల్ ఫుల్లీ ఫెయిర్ రేసింగ్ స్పోర్ట్స్ బైకు ఆర్15 వెర్షన్ 3.0లో యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ రాకపోవడం విస్మయానికి గురిచేస్తోంది.

యమహా వైజడ్ఎఫ్ ఆర్15

గ్లోబల్ మార్కెట్లో ఉన్న యమహా ఆర్15 వెర్షన్ 3.0 మోటార్ సైకిల్‌లో 155సీసీ కెపాసిటి గల లిక్వి్డ కూల్డ్ సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది 19బిహెచ్‌పి పవర్ మరియు 14.7ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

యమహా వైజడ్ఎఫ్ ఆర్15

ఆర్15 వెర్షన్ 3.0 లోని శక్తివంతమైన ఇంజన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు. అయితే, తక్కువ ధరలో అందించేందుకు ఇందులో స్లిప్పర్ క్లచ్‌ను మిస్ చేసింది. ఇంజన్ కేస్ పరిశీలిస్తే సరికొత్త 155సీసీ ఇంజన్‌ను యమహా అభివృద్ది చేసినట్లు తెలిసింది.

యమహా వైజడ్ఎఫ్ ఆర్15

రెగ్యులర్ మోడల్ ఆర్15 తో పోల్చితే ఈ థర్డ్ వెర్షన్ ఆర్15 లో జరిగిన చిన్న చిన్న మార్పులు మినహాయిస్తే, పెద్దగా చెప్పుకోదగిన మార్పులేమీ రాలేదు. అయితే, వెర్షన్ 3.0 ను సూచించే బ్యాడ్జింగ్, బాడీ డీకాల్స్ అప్‌డేట్స్ జరగనున్నాయి.

యమహా వైజడ్ఎఫ్ ఆర్15

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైకుగా తిరుగులేని సక్సెస్ అందుకున్న ఆర్15 ఇప్పుడు మూడవ వెర్షన్‌లో విడుదలకు సిద్దమైంది. ధరకు తగ్గ విలువలతో బడ్జెట్ శ్రేణిలోని రేసింగ్ స్పోర్ట్ ఫీల్ కలిగించేలా వెర్షన్ 3.0 ఆర్15 ను అభివృద్ది చేసింది.

యమహా ఆర్15 వెర్షన్ 3.0 స్పోర్ట్ బైక్ రూ. 1.20 నుండి 1.30 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్ ధరతో విడుదలయ్యే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Read In Telugu: Yamaha YZF R15 V3.0 Spotted Testing In India
Story first published: Tuesday, November 7, 2017, 11:06 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X