100సీసీ కెపాసిటీతో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్

By Anil Kumar

మోడిఫైడ్ బైకులకు ఉండే ప్రాధాన్యత అందరికీ తెలిసిందే. క్రూయిజర్, బాబర్, స్క్రాంబ్లర్ మరియు చాపర్ ఇలా ఎలాంటి రూపంలోకైనా రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు చక్కగా ఇమిడిపోతాయి. కానీ, 100సీసీ బేబీ బైకు బుల్లెట్ బైకులా మారిపోయేందుకు ప్రయత్నించిందని ఎప్పుడైనా విన్నారా...?

100సీసీ కెపాసిటీతో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్

హ్యార్లీ డేవిడ్సన్, ఇండియన్ మోటార్ సైకిల్స్ బైకులను రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు ఇమిటేట్ చేస్తుంటే... ఇండియన్ రాయల్ బ్లాట్ 100 అనే ఈ చిన్న బైకు రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైకును ఇమిటేట్ చేస్తోంది. కానీ, ఈ ఇండియన్ రాయల్ బైకు గురించి ఎలాంటి సమాచారం లేదు.

100సీసీ కెపాసిటీతో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్

చూడటానికి అచ్చం రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైకును పోలి ఉండే రాయల్ ఇండియన్ బ్లాట్100 బైకును భువనేశ్వర్‌కు చెందిన రాయల్ ఉడో డిజైనింగ్ కంపెనీ మోడిఫైడ్ చేసింది. అయితే, ఇందుకు ఏ బైకును ఉపయోగించారనేది తెలియరాలేదు.

100సీసీ కెపాసిటీతో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్

ఫ్యూయల్ ట్యాంక్ మీద రాయల్ ఎన్ఫీల్డ్ శైలిలో రాయల్ ఇండియన్ అనే పేరును గుర్తించవచ్చు. రాయల్ ఎన్ఫీల్డ్ స్థానంలో రాయల్ ఇండియన్ అచ్చంగా ఒదిగిపోయింది. ట్యాంక్‌కు ఇరువైపులా ఉన్న రబ్బర్ ప్రొటెక్టర్స్ అచ్చం ఒరిజినల్ రాయల్ ఎన్ఫీల్డ్ బైకునే అనుకరించింది.

100సీసీ కెపాసిటీతో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్

బుల్లెట్ ఫీల్ కలిగించేందుకు ఇండియన్ రాయల్ బ్లాట్ 100 బైకులో బుల్లెట్ తరహా సీటు కవర్, బ్యాటరీ కవర్ మరియు టూల్ బాక్స్ కవర్ ఉన్నాయి. రియర్ డిజైన్ గమనిస్తే నిజంగానే బుల్లెట్ బైకు అని నమ్మక తప్పదు.

100సీసీ కెపాసిటీతో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్

వెనుక వైపున సీటు కలర్ మీద బుల్లెట్ పేరును చూడవచ్చు. కాస్త అటు ఇటుగా అసలైన బుల్లెట్ బైకును పోలి ఉండేందుకు స్పోక్స్ గల స్టీల్ వీల్స్ అందివ్వడం జరిగింది. బుల్లెట్ తరహా గుండ్రటి హెడ్‌ల్యాంప్ మరియు ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ కస్టమర్లు ఎక్కువగా ఎంచుకునే మోడిఫైడ్ ఎగ్జాస్ట్ అందివ్వడం జరిగింది.

100సీసీ కెపాసిటీతో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్

వీటన్నింటి జోడింపుతో దీనిని చూసే పాఠకుల కళ్లను ఆశ్చర్యపరచం ఖాయం. కిక్ స్టార్ట్ మినహాయిస్తే ఇంజన్ మొత్తం బ్లాక్ కలర్ ఫినిషింగ్‌లో ఉంది.

100సీసీ కెపాసిటీతో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్

క్రింది వీడియోలో ఇండియన్ రాయల్ బైకు ఇచ్చే శబ్దాన్ని గమనించవచ్చు. కానీ, అసలైన రాయల్ ఎన్ఫీల్డ్ బైకులిచ్చే సౌండ్ రాయల్ ఇండియన్ తరం కాలేదని చెప్పవచ్చు.

ఈ బుల్లెట్ మోడిఫైడ్ ఇండియన్ రాయల్ బైకులో 100సీసీ కెపాసిటి గల సింగల్ సిలిండర్ ఇంజన్ ఉంది. రాయల్ ఉడో కంపెనీ మోడిఫై చేసిన ఇండియన్ రాయల్ 100సీసీ మోటార్ సైకిల్ ధర రూ. 70,000లుగా నిర్ణయించింది. వారంటీ, పవర్ మరియు సేల్స్ అనంతరం సర్వీసింగ్ గురించి ఎలాంటి సమాచారం లేదు.

100సీసీ కెపాసిటీతో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్

ఒరిజినల్ రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు 350సీసీ మరియు 500సీసీ ఇంజన్ కెపాసిటితో లభ్యమవుతున్నాయి. 346సీసీ ఇంజన్ 19.8బిహెచ్‌పి పవర్ మరియు 28ఎన్ఎమ్ టార్క్ మరియు 499సీసీ ఇంజన్ 27.2బిహెచ్‌పి పవర్ మరియు 41.3ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

100సీసీ కెపాసిటీతో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్

ఇండియన్ రాయల్ పేరుతో బ్లాట్ 100 బైకులో 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం ఉంది. హ్యాండిల్, ఇంజన్ మరియు ఫ్రేమ్ గమనిస్తే ఇది ఇండియన్ మార్కెట్లో ఉన్న ఎంట్రీ లెవల్ 100సీసీ మోటార్ సైకిల్ అని చెప్పవచ్చు. కానీ, ఖచ్చితంగా ఫలానా మోడల్ అనే విషయం తెలియరాలేదు.

Source: YouTube

Most Read Articles

English summary
Read In Telugu: 100cc Motorcycle Imitates The Royal Enfield Bullet
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X