16-18 ఏళ్ల యువతకు 100సీసీ స్కూటర్లు నడిపేందుకు డ్రైవింగ్ లైసెన్స్

భారత్‌లో డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు కనీస వయసు 18 సంవత్సరాలు. ఈ మధ్య కాలంలో దేశీయంగా మైనర్ల డ్రైవింగ్ సమస్య ఎక్కువైపోయింది. డ్రైవింగ్ పట్ల అవగాహన లేని 18 లోపు వయస్సున్న యువతీయువకులు టూ వీలర్లతో రోడ్

By Anil Kumar

భారత్‌లో డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు కనీస వయసు 18 సంవత్సరాలు. ఈ మధ్య కాలంలో దేశీయంగా మైనర్ల డ్రైవింగ్ సమస్య ఎక్కువైపోయింది. డ్రైవింగ్ పట్ల అవగాహన లేని 18 లోపు వయస్సున్న యువతీ యువకులు టూ వీలర్లతో రోడ్డెక్కి ప్రమాదాలకు కారణమవుతున్నారు.

16 ఏళ్ల యువతకు స్కూటర్ లైసెన్స్

ఈ సమస్యను అధిగమించేందుకు, ఒక కొత్త విధానాన్ని అమలు చేసేందుకు కేంద్రం కసరత్తులు ప్రారంభించింది. అవును, తాజాగా అందిన రిపోర్ట్స్ ప్రకారం, 16 మరియు 17 ఏళ్ల యువత టూ వీలర్లను రైడ్ చేయడాన్ని చట్టబద్దం చేసింది.

16 ఏళ్ల యువతకు స్కూటర్ లైసెన్స్

ఇక మీదట 16 ఏళ్లు పైబడిన టీనేజ్ యువతీ యువకులకు 100సీసీ స్కూటర్లను రైడ్ చేసేందుకు ప్రత్యేకంగా డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసే విధానాన్ని ప్రతిపాందించే ప్రక్రియలో ఉంది. 16 నుండి 18 ఏళ్ల మధ్య వయసున్న యువత కేవలం 100సీసీ కెపాసిటి గల స్కూటర్లను నడపడానికి మాత్రమే అనుతిస్తారు.

16 ఏళ్ల యువతకు స్కూటర్ లైసెన్స్

ఇటీవల కాలంలో టీనేజర్లు టూ వీలర్లను చట్టానికి అతిక్రమంగా రైడింగ్ చేస్తూ పట్టుబడుతున్నారు. ఇలాంటి వారిని కట్టడి చేసేందుకు ప్రత్యేకంగా నిర్వహించిన అధ్యయనం మేరకు 16-18 ఏళ్ల వయస్సున్న యువతీ యువకులకు ప్రత్యేకంగా 100సీసీ టూ వీలర్లను రైడింగ్ చేసేందుకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయాలని భావించింది.

16 ఏళ్ల యువతకు స్కూటర్ లైసెన్స్

2016లో కొన్ని రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు బృందం ఈ విధానాన్ని అమలు చేయాలని కేంద్రానికి ప్రతిపాదించింది. ప్రస్తుతం ఉన్న రూల్ ప్రకారం, 16 - 18 ఏళ్ల యువత టూ వీలర్ లైసెన్స్ కోసం అప్లె చేసుకోవచ్చు, అయితే వీరు కేవలం 50సీసీ కంటే తక్కువ కెపాసిటి ఉన్న టూ వీలర్లను మాత్రమే నడపడానికి అర్హులు. కానీ, ఇలాంటి టూ వీలర్లు విపణిలో లేవు.

16 ఏళ్ల యువతకు స్కూటర్ లైసెన్స్

కేంద్ర ప్రభుత్వం ఈ నూతన రూల్‌ను అమోదిస్తే, టీనేజీ యువత లీగల్‌గా టూ వీలర్లను నడపొచ్చు. ప్రస్తుతం, 100సీసీ మరియు దీని కంటే తక్కువ కెపాసిటి ఉన్న స్కూటర్ల మార్కెట్లో చాలానే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ, 100సీసీ కంటే ఎక్కువ కెపాసిటి ఉన్న స్కూటర్లు మరియు గేర్లు ఉన్న బైకులను నడిపేందుకు కావాల్సిన డ్రైవింగ్ లైసెన్స్‌కు 18 ఏళ్ల తరువాతనే అనుమతిస్తారు.

16 ఏళ్ల యువతకు స్కూటర్ లైసెన్స్

ఇటీవల కాలంలో టూ వీలర్లను నడిపే మైనర్ల పట్ల అధికారులు కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. మైనర్లు రైడింగ్ చేయడానికి అనుమతించిన తల్లిదండ్రులను ట్రాఫిక్ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఈ కొత్త రూల్ ఇలాంటి ఇబ్బందులకు పుల్‌స్టాప్ పెట్టనుంది.

16 ఏళ్ల యువతకు స్కూటర్ లైసెన్స్

ప్రభుత్వం ఈ కొత్త నియమాన్ని ఎప్పటి నుండి అమలు చేస్తుందనే సమాచారాన్ని ఇంకా వెల్లడించలేదు. కానీ, వీలైనంత త్వరలో ఈ కొత్త నియమాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఇప్పుడు, 100సీసీ కంటే ఎక్కువ కెపాసిటి ఉన్న స్కూటర్లు నడిపే మైనర్ల మీద ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించాలి.

16 ఏళ్ల యువతకు స్కూటర్ లైసెన్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మైనర్లు చేస్తున్న డ్రైవింగ్ మరియు రైడింగ్ ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులకు పెద్ద సమస్యగా మారింది. దీనికి తోడు డ్రైవింగ్ పట్ల అవగాహన లేమి కారణంగా ప్రమాదాలు కూడా అధికంగా చోటు చేసుకుంటున్నాయి. పూర్తి స్థాయిలో రైడింగ్ నేర్చుకున్న తరువాత ఆర్టీఓ కార్యాలయాల్లో 100సీసీ స్కూటర్లను నడిపేందుకు ఉండాల్సిన డ్రైవింగ్ లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. ఈ కొత్త నియమంతో అండర్ ఏజ్ రైడింగ్ ద్వారా జరిగే సమస్యలు గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉంది.

16 ఏళ్ల ప్రాయానికే డ్రైవింగ్ లైసెన్స్ అనుమతించిన కేంద్రం

More from DriveSpark

Article Published On: Saturday, May 12, 2018, 14:00 [IST]
English summary
Read In Telugu: 16-18-Year-Olds To Get Licence To Ride 100cc Automatic Scooters
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+