Just In
- 14 hrs ago
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- 16 hrs ago
మీకు తెలుసా.. ఇది ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ట్రైన్ కానుంది
- 1 day ago
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 1 day ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
Don't Miss
- News
దేశ రాజధానిలో రైతుల ట్రాక్టర్ల ర్యాలీకి అనుమతి, కానీ..: పాక్ కుట్ర జరిగిందని ఢిల్లీ పోలీసులు
- Movies
ట్రెండింగ్ : ఆమె నా తల్లి కాదు.. ప్రైవేట్ పార్టు చూపిస్తూ.. పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన దీపిక పదుకొనే
- Sports
Sri Lanka vs England: జోరూట్ జోరు.. శ్రీలంక బేజారు!
- Finance
బడ్జెట్, మొబైల్ యాప్‌లో 14 డాక్యుమెంట్ల పూర్తి వివరాలు
- Lifestyle
రాత్రుల్లో లోదుస్తులు ధరించకుండా ఒక వారం పాటు నిద్రించండి,ఏం జరుగుతుందో చూడండి, ఆశ్చర్యపోతారు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
16-18 ఏళ్ల యువతకు 100సీసీ స్కూటర్లు నడిపేందుకు డ్రైవింగ్ లైసెన్స్
భారత్‌లో డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు కనీస వయసు 18 సంవత్సరాలు. ఈ మధ్య కాలంలో దేశీయంగా మైనర్ల డ్రైవింగ్ సమస్య ఎక్కువైపోయింది. డ్రైవింగ్ పట్ల అవగాహన లేని 18 లోపు వయస్సున్న యువతీ యువకులు టూ వీలర్లతో రోడ్డెక్కి ప్రమాదాలకు కారణమవుతున్నారు.

ఈ సమస్యను అధిగమించేందుకు, ఒక కొత్త విధానాన్ని అమలు చేసేందుకు కేంద్రం కసరత్తులు ప్రారంభించింది. అవును, తాజాగా అందిన రిపోర్ట్స్ ప్రకారం, 16 మరియు 17 ఏళ్ల యువత టూ వీలర్లను రైడ్ చేయడాన్ని చట్టబద్దం చేసింది.

ఇక మీదట 16 ఏళ్లు పైబడిన టీనేజ్ యువతీ యువకులకు 100సీసీ స్కూటర్లను రైడ్ చేసేందుకు ప్రత్యేకంగా డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసే విధానాన్ని ప్రతిపాందించే ప్రక్రియలో ఉంది. 16 నుండి 18 ఏళ్ల మధ్య వయసున్న యువత కేవలం 100సీసీ కెపాసిటి గల స్కూటర్లను నడపడానికి మాత్రమే అనుతిస్తారు.

ఇటీవల కాలంలో టీనేజర్లు టూ వీలర్లను చట్టానికి అతిక్రమంగా రైడింగ్ చేస్తూ పట్టుబడుతున్నారు. ఇలాంటి వారిని కట్టడి చేసేందుకు ప్రత్యేకంగా నిర్వహించిన అధ్యయనం మేరకు 16-18 ఏళ్ల వయస్సున్న యువతీ యువకులకు ప్రత్యేకంగా 100సీసీ టూ వీలర్లను రైడింగ్ చేసేందుకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయాలని భావించింది.

2016లో కొన్ని రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు బృందం ఈ విధానాన్ని అమలు చేయాలని కేంద్రానికి ప్రతిపాదించింది. ప్రస్తుతం ఉన్న రూల్ ప్రకారం, 16 - 18 ఏళ్ల యువత టూ వీలర్ లైసెన్స్ కోసం అప్లె చేసుకోవచ్చు, అయితే వీరు కేవలం 50సీసీ కంటే తక్కువ కెపాసిటి ఉన్న టూ వీలర్లను మాత్రమే నడపడానికి అర్హులు. కానీ, ఇలాంటి టూ వీలర్లు విపణిలో లేవు.

కేంద్ర ప్రభుత్వం ఈ నూతన రూల్‌ను అమోదిస్తే, టీనేజీ యువత లీగల్‌గా టూ వీలర్లను నడపొచ్చు. ప్రస్తుతం, 100సీసీ మరియు దీని కంటే తక్కువ కెపాసిటి ఉన్న స్కూటర్ల మార్కెట్లో చాలానే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ, 100సీసీ కంటే ఎక్కువ కెపాసిటి ఉన్న స్కూటర్లు మరియు గేర్లు ఉన్న బైకులను నడిపేందుకు కావాల్సిన డ్రైవింగ్ లైసెన్స్‌కు 18 ఏళ్ల తరువాతనే అనుమతిస్తారు.

ఇటీవల కాలంలో టూ వీలర్లను నడిపే మైనర్ల పట్ల అధికారులు కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. మైనర్లు రైడింగ్ చేయడానికి అనుమతించిన తల్లిదండ్రులను ట్రాఫిక్ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఈ కొత్త రూల్ ఇలాంటి ఇబ్బందులకు పుల్‌స్టాప్ పెట్టనుంది.

ప్రభుత్వం ఈ కొత్త నియమాన్ని ఎప్పటి నుండి అమలు చేస్తుందనే సమాచారాన్ని ఇంకా వెల్లడించలేదు. కానీ, వీలైనంత త్వరలో ఈ కొత్త నియమాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఇప్పుడు, 100సీసీ కంటే ఎక్కువ కెపాసిటి ఉన్న స్కూటర్లు నడిపే మైనర్ల మీద ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించాలి.

డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
మైనర్లు చేస్తున్న డ్రైవింగ్ మరియు రైడింగ్ ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులకు పెద్ద సమస్యగా మారింది. దీనికి తోడు డ్రైవింగ్ పట్ల అవగాహన లేమి కారణంగా ప్రమాదాలు కూడా అధికంగా చోటు చేసుకుంటున్నాయి. పూర్తి స్థాయిలో రైడింగ్ నేర్చుకున్న తరువాత ఆర్టీఓ కార్యాలయాల్లో 100సీసీ స్కూటర్లను నడిపేందుకు ఉండాల్సిన డ్రైవింగ్ లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. ఈ కొత్త నియమంతో అండర్ ఏజ్ రైడింగ్ ద్వారా జరిగే సమస్యలు గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉంది.

1. యాక్సిడెంట్ చూసే ధైర్యం ఉన్న వాళ్లే ఈ వీడియో చూడండి
2. రివర్స్ గేర్ ఎక్కువగా వాడితే ఇంజన్ మీద ఎలాంటి ప్రభావం పడుతుందా...?
3.టియాగో దెబ్బకు విలవిల్లాడుతున్న చిన్న కార్లు
4.భారీ సంఖ్యలో మారుతి స్విప్ట్ మరియు బాలెనో రీకాల్
5.9 సీటర్ మహీంద్రా టియువి 300 ప్లస్ లాంచ్ ఖరారు: వేరియంట్లు మరియు ధరలు