మరో కొత్త వేరియంట్లో బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160

బజాజ్ ఆటో పల్సర్ ఎన్ఎస్ 160 బైకును విడుదల చేసిన అనతి కాలంలోనే ఇప్పుడు మరో వేరియంట్‌ను ప్రవేశపెట్టడానికి సిద్దమైంది. అవును, బజాజ్ టూ వీలర్స్ తమ పల్సర్ ఎన్ఎస్ 160 బైకును రియర్ డిస్క్ బ్రేక్ వేరియంట్లో వ

By Anil Kumar

బజాజ్ ఆటో పల్సర్ ఎన్ఎస్ 160 బైకును విడుదల చేసిన అనతి కాలంలోనే ఇప్పుడు మరో వేరియంట్‌ను ప్రవేశపెట్టడానికి సిద్దమైంది. అవును, బజాజ్ టూ వీలర్స్ తమ పల్సర్ ఎన్ఎస్ 160 బైకును రియర్ డిస్క్ బ్రేక్ వేరియంట్లో విడుదల చేయనుంది.

బజాజ్ పల్సర్ 160 రియర్ డిస్క్ బ్రేక్ వేరియంట్

పల్సర్ ఎన్ఎస్ 160 రియర్ డిస్క్ బ్రేక్ వేరియంట్ మార్కెట్లో ఉన్న సుజుకి జిక్సర్, యమహా ఎఫ్‌జడ్ మరియు హోండా సిబి హార్నెట్ 160ఆర్ వంటి మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది. ఓ యూట్యూబర్ అప్‌లోడ్ చేసిన వీడియో ద్వారా ఈ విషయం వెల్లడైంది.

బజాజ్ పల్సర్ 160 రియర్ డిస్క్ బ్రేక్ వేరియంట్

బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160 చూడటానికి అచ్చం, ఎన్ఎస్ 200 బైకును పోలి ఉంటుంది. బడ్జెట్ ధరలో, రోజూ వారి అవసరాలకు మరియు మైలేజ్ కోరుకునే కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని ఎన్ఎస్ 200 యొక్క స్మాల్ వెర్షన్ ఎన్ఎస్ 160 బైకును ప్రవేశపెట్టారు.

బజాజ్ పల్సర్ 160 రియర్ డిస్క్ బ్రేక్ వేరియంట్

ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160 ప్రారంభ వేరియంట్ ధర రూ. 80,640 ఎక్స్-షోరూమ్ (ముంబాయ్‍)గా ఉంది. అయితే, రియర్ డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర దీని కంటే రూ. 3,000 అధికంగా ఉండే అవకాశం ఉంది.

బజాజ్ పల్సర్ 160 రియర్ డిస్క్ బ్రేక్ వేరియంట్

బజాజ్ పల్సర్ ఎన్ఎస్200తో పోల్చుకుంటే తేడా కనబడేందుకు స్మాల్ వెర్షన్ ఎన్ఎస్ బైకును డ్యూయల్ టోన్ కలర్ థీమ్‌లో అందుబాటులో ఉంచింది. పల్సర్ ఎన్ఎస్ 160లో సాంకేతికంగా 160సీసీ సామర్థ్యం గల లిక్విడ్-కూల్డ్ పెట్రోల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 15.5బిహెచ్‌పి పవర్ మరియు 14.6ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

బజాజ్ అతి త్వరలో పరిచయం చేయనున్న పల్సర్ ఎన్ఎస్ 160 రియర్ డిస్క్ బ్రేక్ వేరియంట్ డీలర్ల వద్ద గుర్తించినట్లు తెలిసింది. ఇది కనుక పూర్తి స్థాయిలో విడుదలైతే, బజాజ్‌కు అత్యుత్తమ ఫలితాలు సాధించిపెట్టే అవకాశం ఉంది. బజాజ్ ఆటో దీనిని ఈ పండుగ సీజన్ నాటికి విడుదల చేసే అవకాశం ఉంది.

Source: Shivansh Batham

Most Read Articles

Read more on: #బజాజ్
English summary
Read In Telugu: 2018 Bajaj Pulsar NS 160 rear disc brake arrives at dealer before launch – First Look Video
Story first published: Saturday, August 11, 2018, 18:45 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X