2018 హోండా ఏవియేటర్ విడుదల: ధర రూ. 55,157 లు

హోండా టూ వీలర్స్ విపణిలోకి సరికొత్త అప్‌‌డేటెడ్ 2018 ఎడిషన్ హోండా ఏవియేటర్ స్కూటర్‌ను విడుదల చేసింది. 2018 హోండా ఏవియేటర్ ప్రారంభ ధర రూ. 55,157 ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. 2018 ఎడిషన్ హోండా యాక్టివా-

By Anil Kumar

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ విపణిలోకి సరికొత్త అప్‌‌డేటెడ్ 2018 ఎడిషన్ హోండా ఏవియేటర్ స్కూటర్‌ను విడుదల చేసింది. 2018 హోండా ఏవియేటర్ ప్రారంభ ధర రూ. 55,157 ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. Honda Activa-i విడుదల చేసిన రెండు రోజుల తర్వాత ఏవియేటర్‌ను విడుదల చేసింది.

2018 హోండా ఏవియేటర్ విడుదల: ధర రూ. 55,157 లు

పలు మార్పులు చేర్పులతో విడుదలైన 2018 హోండా ఏవియేటర్ ధర మునుపటి మోడల్ కంటే రూ. 1,405 లు ఎక్కువగా ఉంది. 2018 ఎడిషన్ హోండా ఏవియేటర్ స్టాండర్డ్, అల్లాయ్ డ్రమ్ మరియు అల్లాయ్ డిస్క్ అనే మూడు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది.

2018 హోండా ఏవియేటర్ విడుదల: ధర రూ. 55,157 లు

2018 హోండా యాక్టివా 125 స్కూటర్ తరహాలో 2018 ఏవియేటర్ స్కూటర్‌లో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ మరియు పగటి పూట వెలిగే ఎల్ఈడీ లైట్లు, 4-ఇన్-1 ఇగ్నిషన్ స్విచ్, సీట్ ఓపెనింగ్, రిట్రాక్టబుల్ ఫ్రంట్ మరియు రియర్ హుక్స్, అదే విధంగా మెటల్ మఫ్లర్ ప్రొటెక్టర్‌తో పాటు బ్లూ-బ్యాక్ లైటింగ్ గల ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ కలదు.

2018 హోండా ఏవియేటర్ విడుదల: ధర రూ. 55,157 లు

2018 హోండా ఏవియేటర్‌లో సాంకేతికంగా అదే మునుపటి 109సీసీ కెపాసిటి గల సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు, సీవీటీ ట్రాన్స్‌మిషన్ గల ఇది గరిష్టంగా 8బిహెచ్‌పి పవర్ మరియు 9ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

2018 హోండా ఏవియేటర్ విడుదల: ధర రూ. 55,157 లు

2018 ఎడిషన్ హోండా ఏవియేటర్ సరికొత్త పర్ల్ స్పార్టన్ రెడ్ కలర్ ఆప్షన్‌లో పరిచయం అయ్యింది. ఇది వరకు లభించే పర్ల్ ఇగ్నియస్ బ్లాక్, మ్యాట్ సెలెన్ సిల్వర్ మెటాలిక్ మరియు పర్ల్ అమేజింగ్ వైట్ రంగుల్లో ఎంచుకోవచ్చు. వీటికి అదనంగా పలు కాస్మొటిక్ మెరుగులు కూడా జోడించారు.

2018 హోండా ఏవియేటర్ విడుదల: ధర రూ. 55,157 లు

హోండా ఏవియేటర్‌లో ముందు వైపున 12-అంగుళాలు మరియు వెనుక వైపున 10-అంగుళాల అల్లాయ్ వీల్స్ వాటికి 90/100 కొలతల్లో ఉన్న టైర్లను అందివ్వడం జరిగింది. సస్పెన్షన్ పరంగా ముందు టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున డ్యూయల్ షాక్ అబ్జార్లు ఉన్నాయి.

2018 హోండా ఏవియేటర్ విడుదల: ధర రూ. 55,157 లు

బ్రేకింగ్ విధులు నిర్వర్తించడానికి ముందు వైపున ఆప్షనల్ 190ఎమ్ఎమ్ ఫ్రంట్ డిస్క్ మరియు వెనుక వైపున 130ఎమ్ఎమ్ డ్రమ్ బ్రేక్ ఉంది. మెరుగైన బ్రేకింగ్ కోసం ఏ ఒక్క బ్రేక్ అప్లే చేసినా రెండు చక్రాలకు సమానమైన బ్రేకింగ్ పవర్ అందేలా కాంబి బ్రేకింగ్ సిస్టమ్ అందివ్వడం జరిగింది.

2018 హోండా ఏవియేటర్ విడుదల: ధర రూ. 55,157 లు

ఇందులో 125సీసీ స్కూటర్ల తరహా 6-లీటర్ల కెపాసిటి గల ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. 106కిలోల బరువున్న ఏవియేటర్ గంటకు 82కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకెళుతుంది. హోండా ఏవియేటర్ విపణిలో ఉన్న టీవీఎస్ జూపిటర్, సుజుకి లెట్స్, హీరో డ్యూయెట్ మరియు హీరో మాయెస్ట్రో ఎడ్జ్ వంటి మోడళ్ల నుండి గట్టి పోటీని ఎదుర్కోనుంది.

More from DriveSpark

Article Published On: Friday, July 27, 2018, 10:51 [IST]
English summary
Read In Telugu: 2018 Honda Aviator launched in India, priced at Rs. 55,157
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+