హోండా సిబిఆర్250ఆర్ రీ-ఎంట్రీ: ధర రూ. 1.63 లక్షలు మాత్రమే!!

Written By:

హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ తమ లెజండరీ స్పోర్ట్స్ మోటార్‌సైకిల్ హోండా సిబిఆర్250ఆర్‌(Honda CBR250R)ను విపణిలోకి లాంచ్ చేయడానికి సర్వం సిద్దం చేసుకుంది. ఫిబ్రవరి 2018 మొదటి వారంలో ఢిల్లీ వేదకగా జరిగిన ఆటో ఎక్స్ పో 2018లో హోండా సిబిఆర్250ఆర్ స్పోర్ట్స్ బైకును ఆవిష్కరించింది.

హోండా సిబిఆర్250ఆర్

అయితే, హోండా టూ వీలర్స్ ఇండియా వెబ్‌సైట్లోకి సిబిఆర్250ఆర్ బైకును చేర్చింది. ఇది లభించే వేరియంట్లు మరియు ధరలను కూడా ప్రకటించింది. హోండా సిబిఆర్250ఆర్ గురించి పూర్తి వివరాలు ఇవాళ్టి కథనంలో చూద్దాం రండి...

హోండా సిబిఆర్250ఆర్

హోండా సిబిఆర్250ఆర్ రెండు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది. అవి, స్టాండర్డ్ మరియు ఏబిఎస్ వేరియంట్. సిబిఆర్250ఆర్ స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 1.63 లక్షలు మరియు ఏబిఎస్ వేరియంట్ ధర రూ. 1.93 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.

హోండా సిబిఆర్250ఆర్

విపరీతమైన అభిమానులను సొంతం చేసుకున్న హోండా సిబిర్250ఆర్ 2018 వెర్షన్ సరికొత్త డిజైన్, అధునాతన ఫీచర్లు మరియు బిఎస్-IV ఉద్గార ప్రమాణాలను పాటించే ఇంజన్‌తో మొట్టమొదటి సారిగా ఆటో ఎక్స్ పో 2018లో రివీల్ అయ్యింది.

Recommended Video - Watch Now!
TVS Zeppelin Cruiser Concept Walkaround, Specs, Details - DriveSpark
హోండా సిబిఆర్250ఆర్

సాంకేతికంగా, 2018 హోండా సిబిఆర్250ఆర్ స్పోర్ట్స్ బైకులో 249సీసీ కెపాసిటి గల లిక్విడ్ కూల్డ్, పిజిఎమ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ గల ఫోర్-వాల్వ్ డిఒహెచ్‌సి పెట్రోల్ ఇంజన్ 26.5బిహెచ్‌పి పవర్ మరియు22.9ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్ గల సిబిఆర్250ఆర్ గరిష్ట వేగం గంటకు 135కిలోమీటర్లుగా ఉంది.

హోండా సిబిఆర్250ఆర్

సరికొత్త హోండా సిబిఆర్250ఆర్ బైకులో నూతన ఎల్ఇడి హెడ్‌ల్యాంప్స్, స్పోర్టివ్ బాడీ గ్రాఫిక్స్, అప్‌డేటెడ్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, రేసింగ్ మఫ్లర్ ఇంకా ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. 2018 వెర్షన్ హోండా సిబిఆర్250ఆర్ మొత్తం బరువు 167కిలోలు మరియు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటి 13 లీటర్లుగా ఉంది.

హోండా సిబిఆర్250ఆర్

17-అంగుళాల అల్లాయ్ వీల్స్ మీద పరుగులు పెట్టే ఇందులో ముందు వైపున 110ఎమ్ఎమ్ మరియు వెనుక వైపున 140ఎమ్ఎమ్ కొలతల్లో ఉన్న ట్యూబ్ లెస్ టైర్లు ఉన్నాయి. బ్రేకింగ్ డ్యూటీ కోసం ఫ్రంట్ వీల్‌కు 296ఎమ్ఎమ్ మరియు రియర్ వీల్‌కు 220ఎమ్ఎమ్ కొలతల్లో ఉన్న డిస్క్ బ్రేకులు ఉన్నాయి.

హోండా సిబిఆర్250ఆర్

సేఫ్టీ కోసం రియర్ డిస్క్ బ్రేక్‌ వద్ద డ్యూయల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అందివ్వడం జరిగింది. సస్పెన్షన్ కోసం ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున ప్రొ-లింక్ మోనోషాక్ అబ్జార్వర్ కలదు.

హోండా సిబిఆర్250ఆర్

సరికొత్త 2018 హోండా సిబిఆర్250ఆర్ నాలుగు విభిన్న కలర్ కాంబినేషన్లలో లభ్యమవుతోంది. అవి,

  • మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్ - మార్స్ ఆరేంజ్,
  • మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్ - స్ట్రైకింగ్ గ్రీన్,
  • పర్ల్ యెల్లో స్పోర్ట్ మరియు
  • స్పోర్ట్స్ రెడ్.
హోండా సిబిఆర్250ఆర్

విపణిలో ఉన్న కెటిఎమ్ ఆర్‌సి200, బజాజ్ పల్సర్ ఆర్ఎస్200, యమహా ఫేజర్ 25 మరియు ఇటీవల మార్కెట్లోకి విడుదలైన టీవీఎస్ అపాచే ఆర్‌ఆర్310 స్పోర్ట్స్ బైకులకు సరికొత్త 2018 హోండా సిబిఆర్250ఆర్ గట్టి పోటీనివ్వనుంది.

హోండా సిబిఆర్250ఆర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

బిఎస్-IV ఉద్గార ప్రమాణాలను పాటించకపోవడంతో సరిగ్గా పది నెలల క్రితం హోండా సిబిఆర్250ఆర్ మోటార్ సైకిల్ విక్రయాలు మరియు ఉత్పత్తి హోండా టూ వీలర్స్ నిలిపివేసింది. అయితే, ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్ పో వేదికగా బిఎస్-IV ఇంజన్‌తో వచ్చిన సిబిఆర్250ఆర్ బైకును హోండా ఆవిష్కరించింది. నూతన స్టైలింగ్, అత్యాధునిక ఫీచర్లు మరియు ధరకు తగ్గ విలువలతో కూడిన సిబిఆర్250ఆర్ అతి త్వరలో మార్కెట్లోకి విడుదలవ్వనుంది.

భారతదేశపు లెజెండరీ స్పోర్ట్స్ మోటార్ సైకిల్ హోండా సిబిఆర్250ఆర్ రీఎంట్రీ పై మీ అభిప్రాయాన్ని క్రింది కామెంట్ సెక్షన్ ద్వారా మాతో పంచుకోండి...

Read more on: #honda #హోండా
English summary
Read In Telugu: 2018 Honda CBR250R Prices Revealed; Starts at Rs 1.63 Lakhs
Story first published: Tuesday, March 20, 2018, 13:56 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark