2018 ఎడిషన్ సుజుకి జిక్సర్ SP మరియు జిక్సర్ SF SP విడుదల

సుజుకి విపణిలోకి తమ జిక్సర్ శ్రేణి బైకులను 2018 ఎడిషన్‌లో లాంచ్ చేసింది. జిక్సర్ ఎస్‌పి మరియు ఫెయిరింగ్ వెర్షన్ జిక్సర్ ఎస్ఎఫ్ ఎస్‌పి బైకులను బాడీ కలర్స్ మరియు గ్రాఫిక్స్ అప్‌డేట్స్‌తో విడుదల చేసింది.

By Anil Kumar

జపాన్ టూ వీలర్ల తయారీ దిగ్గజం సుజుకి విపణిలోకి తమ జిక్సర్ శ్రేణి బైకులను 2018 ఎడిషన్‌లో లాంచ్ చేసింది. జిక్సర్ ఎస్‌పి మరియు ఫెయిరింగ్ వెర్షన్ జిక్సర్ ఎస్ఎఫ్ ఎస్‌పి బైకులను బాడీ కలర్స్ మరియు గ్రాఫిక్స్ అప్‌డేట్స్‌తో విడుదల చేసింది. 2018 సుజుకి జిక్సర్ ఎస్‌పి ప్రారంభ ధర రూ. 87,250 లు మరియు సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ ఎస్‌పి ప్రారంభ ధర రూ. 1 లక్ష ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.

సుజుకి జిక్సర్ 2018 ఎడిషన్ విడుదల

సరికొత్త 2018 ఎడిషన్ జిక్సర్ ఎస్‌పి ఇప్పుడు రెండు సరికొత్త కలర్ ఆప్షన్‌లలో లభ్యమవుతోంది. అవి, విభిన్నమైన బ్లాక్ కలర్ మరియు రెండు డ్యూయల్ టోన్ కలర్స్ - మాజెస్టి గోల్డ్/ గ్లాస్ స్పార్కిల్ బ్లాక్.

సుజుకి జిక్సర్ 2018 ఎడిషన్ విడుదల

రెండు బైకులు కూడా నూతన కలర్ అప్‌డేట్స్‌తో పాటు ఫ్యూయల్ ట్యాంక్ మరియు ఫ్రంట్ డిజైన్‌లో సరికొత్త గ్రాఫిక్స్ పొందాయి. 2018 వెర్షన్ జిక్సర్ సిరీస్ బైకుల్లో అప్‌డేటెడ్ ఎస్‌పి(SP) లోగో వచ్చింది.

సుజుకి జిక్సర్ 2018 ఎడిషన్ విడుదల

జిక్సర్ ఎస్‌పి మరియు జిక్సర్ ఎస్ఎఫ్ ఎస్‌పి రెండు బైకులు ఇప్పుడు స్టాండర్డ్ సింగల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్‌తో లభ్యమవుతున్నాయి. ఎస్ఎఫ్ ఎస్‌పి మోడల్లో అదనంగా ఫ్యూయల్-ఇంజెక్షన్ సిస్టమ్ టెక్నాలజీ కలదు, కానీ రెగ్యులర్ ఎస్‌పి మోడల్లో స్టాండర్డ్ కార్బోరేటర్ ఉంది.

సుజుకి జిక్సర్ 2018 ఎడిషన్ విడుదల

కాస్మొటిక్ మార్పులు మరియు అదనపు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ జోడింపు మినహాయిస్తే, మెకానికల్‌గా రెండు బైకుల్లో ఎలాంటి మార్పులు జరగలేదు. 2018 జిక్సర్ సిరీస్ బైకులో అదే మునుపటి 155సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఉంది.

సుజుకి జిక్సర్ 2018 ఎడిషన్ విడుదల

5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 14.6బిహెచ్‌పి పవర్ మరియు 14ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెండు జిక్సర్ బైకుల్లో కూడా సుజుకి వారి ఇకో పర్ఫామెన్స్ టెక్నాలజీ ఉంది.

సుజుకి జిక్సర్ 2018 ఎడిషన్ విడుదల

సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎక్జ్సిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ రాజశేఖరన్ మాట్లాడుతూ, "సుజుకి జిక్సర్ తొలుత 2014లో ఇండియన్ మార్కెట్లోకి విడుదలైంది. అప్పటి నుండి జిక్సర్ బ్రాండ్ పేరు యువత ఉత్తేజానికి పర్యాయపదంగా నిలిచిపోయింది. నూతనత్వాన్ని కోరుకునే కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు తమ ఉత్పత్తులను అప్‌జేట్ చేస్తుంటామని ఈ సందర్భంగా తెలియజేశాడు."

సుజుకి జిక్సర్ 2018 ఎడిషన్ విడుదల

సుజుకి జిక్సర్ ఎస్‌పి మరియు జిక్సర్ ఎస్ఎఫ్ ఎస్‌పి రెండు బైకుల్లో ఇరు వైపులా డిస్క్ బ్రేకులు అందివ్వడం జరిగింది. సస్పెన్షన్ కోసం ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనోషాక్ అబ్జార్వర్ ఉంది.

సుజుకి జిక్సర్ 2018 ఎడిషన్ విడుదల

2018 జిక్సర్ ఎస్‌పి మరియు జిక్సర్ ఎస్ఎఫ్ ఎస్‌పి బైకుల్లో డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, స్పోర్టివ్ ట్విన్-పోర్ట్ ఎగ్జాస్ట్ మరియు ఎల్ఈడీ టెయిల్ లైట్లు వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి.

సుజుకి జిక్సర్ 2018 ఎడిషన్ విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

2018 సుజుకి జిక్సర్ విపణిలో ఉన్న బజాజ్ పల్సర్ ఎన్ఎస్160, హోండా సీబీ హార్నెట్ 160ఆర్ మరియు టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 4వి వంటి మోడళ్లకు గట్టిపోటీనిస్తుంది. అదే విధంగా ఫుల్లీ ఫెయిర్డ్ స్పోర్టివ్ వెర్షన్ జిక్సర్ ఎస్ఎఫ్ ఎస్‌పి యమహా ఫేజర్ వి2.0 కు పోటీనిస్తోంది.

Most Read Articles

English summary
Read In Telugu: 2018 Suzuki Gixxer SP and Gixxer SF SP launched
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X