యమహా ఆర్1 బైకు మీద 2.57 లక్షలు తగ్గిన ధర

Written By:

యమహా ఇండియా తమ యమహా ఆర్1 సూపర్ స్పోర్ట్స్ బైకు మీద రూ. 2.57 లక్షలు ధర తగ్గించింది. గత ఏడాది డిసెంబరులో యమహా ఆర్1 బైకును రూ. 20.73 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ) ధరతో లాంచ్ చేసింది. ధరల తగ్గింపు అనంతరం ఇప్పుడు యమహా ఆర్1 ధర రూ. 15.16 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

యమహా ఆర్1

యమహా ఆర్1 బైకు మీద ఏకంగా రెండున్నర లక్షల రుపాయలు ధర తగ్గడానికి గల ప్రధాన కారణం, పూర్తి స్థాయిలో నిర్మించి దిగుమతి చేసుకునే బైకుల మీద ట్యాక్స్ తగ్గించడం. దీంతో ఆర్1 ధర గణనీయంగా తగ్గింది.

యమహా ఆర్1

యమహా ఆర్1 స్పోర్ట్స్ బైకు రెండు రంగుల్లో లభిస్తోంది. అవి, టెక్ బ్లాక్ మరియు యమహా బ్లూ. సాంకేతికంగా ఇందులో 998సీసీ కెపాసిటి గల క్రాస్ ప్లేన్, నాలుగు సిలిండర్ల, ఫోర్-వాల్వ్ పెట్రోల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 197.2బిహెచ్‌పి పవర్ మరియు 112ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

యమహా ఆర్1

ధరలు సవరించిన 2018 యమహా ఆర్1 బైకులో సరికొత్త క్విక్ షిఫ్ట్ సిస్టమ్, లిఫ్ట్ కంట్రోల్ సిస్టమ్, ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్ మరియు పగటిపూట వెలిగే లైట్లకు ఇరువైపులా గాలి గ్రహించే ఎయిర్ ఇంటికేటర్స్, పూర్తి స్థాయిలో అడ్జెస్ట్ చేసుకునే అవకాశం ఉన్న సస్పెన్షన్ సిస్టమ్ మరియు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.

యమహా ఆర్1

2018 యమహా ఆర్1లో 1405ఎమ్ఎమ్‌తో పొట్టిగా ఉన్న వీల్ బేస్, 130ఎమ్ఎమ్ తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ మరియు 17-లీటర్ల కెపాసిటి గల భారీ ఫ్యూయల్ ట్యాంక్ వంటివి ఉన్నాయి. ఇందులో ఇరువైపులా 320ఎమ్ఎమ్ డిస్క్ బ్రేకులు మరియు ముందువైపున 120/70/17, వెనుక వైపున 190/55/17 కొలతల్లో ఉన్న టైర్లు ఉన్నాయి.

యమహా ఆర్1

ఆర్1 లోని టెక్నాలజీ, ఏరోడైనమిక్ డిజైన్, హై స్క్రీన్, లో-హైడ్‌లైట్ పొజిషన్ వంటివి వైజడ్ఆర్-ఎమ్ఎ1 నుండి సేకరించారు. 2018 యమహా ఆర్1 విపణిలో ఉన్న హోండా సిబిఆర్1000ఆర్ఆర్, సుజుకి జిఎస్ఎక్స్-ఆర్1000 మరియు కవాసకి నింజా జడ్ఎక్స్-10ఆర్ వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

యమహా ఆర్1

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

1000సీసీ కెపాసిటి గల బైకు మీద భారీ మొత్తంలో ధర తగ్గడంతో ఈ సెగ్మెంట్ బైకులను ఎంచుకోవాలని ఆశపడే కస్టమర్లకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. 2.57 లక్షల మేర ధర తగ్గినప్పటికీ, కొంత మంది కస్టమర్లకు దీని ధర ఇంకా భారంగానే ఉంది.

యమహా ఆర్1

1. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 క్రిస్టల్ ఎడిషన్

2. హోండా యాక్టివా 5జీ Vs టీవీఎస్ జూపిటర్: ధర, డిజైన్, ఫీచర్లు మరియు మైలేజ్ పరంగా ఏ స్కూటర్ బెస్ట్?

3.బెంగళూరు - ఉత్తర కొరియాకు ఓలా క్యాబ్: 3.55 లక్షల బిల్లుతో ఖంగుతిన్న కస్టమర్

4.20 కోట్ల రుపాయల ఆ కారుకు 25 కోట్లు వెచ్చించి స్పెషల్ పెయింట్

Read more on: #yamaha #యమహా
English summary
Read In Telugu: 2018 Yamaha R1 Price Reduced By Rs 2.57 Lakh
Story first published: Friday, March 23, 2018, 9:32 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark