2019 కవాసకి నింజా 650 విడుదల: వేరియంట్లు, ఫీచర్లు మరియు ధరల కోసం

జపాన్ దిగ్గజం కవాసకి విపణిలోకి సరికొత్త 2019 కవాసకి నింజా 650 బైకును విడుదల చేసింది. నూతన 2019 కవాసకి నింజా 650 ప్రారంభ ధర రూ. 5.49 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

By Anil Kumar

జపాన్ దిగ్గజం కవాసకి విపణిలోకి సరికొత్త 2019 కవాసకి నింజా 650 బైకును విడుదల చేసింది. నూతన 2019 కవాసకి నింజా 650 ప్రారంభ ధర రూ. 5.49 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

2019 కవాసకి నింజా 650 విడుదల

2019 కవాసకి నింజా 650 వేరియంట్ కేవలం మెటాలిక్ ఫ్లాట్ స్పార్క్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లో మాత్రమే లభ్యమవుతోంది. న్యూ ఎడిషన్ కవాసకి నింజా 650 బైకు మీద దేశవ్యాప్తంగా ఉన్న కవాసకి అధీకృత డీలర్ల వద్ద బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

2019 కవాసకి నింజా 650 విడుదల

కవాసకి నింజా 650 ఇప్పుడు మూడు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది. 2019 మోడల్ కెఆర్‌టి ఎడిషన్ నింజా 650 ధర రూ. 5.69 లక్షలు, మరియు 2018 మోడల్ ఇయర్‌తో అమ్ముడవుతున్న బ్లూ కలర్ మోడల్ మరియు కొత్త కలర్ ఆప్షన్‌లో విడుదలైన 2019 నింజా 650 2018 మోడల్‌తో పోల్చితే ఎలాంటి మార్పులు జరగలేదు.

2019 కవాసకి నింజా 650 విడుదల

సాంకేతికంగా సరికొత్త కవాసకి నింజా 650 బైకులో అదే 649సీసీ కెపాసిటి గల లిక్విడ్-కూల్డ్ ప్యార్లల్-ట్విన్ పెట్రోల్ ఇంజన్ కలదు. దీనికి స్లిప్పర్ క్లచ్ టెక్నాలజీ సహాయంతో 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 67.2బిహెచ్‌పి పవర్ మరియు 65.7ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

2019 కవాసకి నింజా 650 విడుదల

కవాసకి నింజా 650 మోటార్‌సైకిల్‌ను రోజు వారీ అవసరాలకు మరియు దూర ప్రాంత రైడింగ్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దారు. ఇందులో అప్‌రైట్ రైడింగ్ పొజిషన్ కలదు, తక్కువ ఎత్తులో ఉన్న సీటు మరియు అవసరానికి తగ్గట్లుగా డెలివరీ అయ్యే పవర్ దీని ప్రత్యేకత.

2019 కవాసకి నింజా 650 విడుదల

ఇందులో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎకానమీ రైడింగ్ ఇండికేటర్ మరియు స్లిప్పర్ క్లచ్ అసిస్ట్ వంటి టెక్నాలజీ ఉంది. సస్పెన్షన్ పరంగా ముందు వైపున 41ఎమ్ఎమ్ ట్రావెల్ గల టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్ మరియు వెనుక వైపున హారిజంటల్ బ్యాక్-లింక్ సస్పెన్షన్ ఉంది.

2019 కవాసకి నింజా 650 విడుదల

బ్రేకింగ్ డ్యూటీ కోసం ముందు చక్రానికి 300ఎమ్ఎమ్ డ్యూయల్ పెటల్ డిస్క్ బ్రేకులు అదే విధంగా వెనుక వైపున 220ఎమ్ఎమ్ చుట్టుకొలత సింగల్ డిస్క్ బ్రేక్ ఉంది. మెరుగైన, సమర్థవంతమైన మరియు సురక్షితమైన బ్రేకింగ్ కోసం ఏబిఎస్ ఫీచర్‌ను తప్పనిసరిగా అందివ్వడం జరిగింది.

2019 కవాసకి నింజా 650 విడుదల

కవాసకి మోటార్స్ ఇండియా మేనేజింగ్ డైరక్టర్ యుటాకా యమషిట మాట్లాడుతూ, "2019 సిరీస్ విడుదలతో నూతన మరియు అప్‌డేటెడ్ మోడళ్ల విడుదలను యథావిధిగా కొనసాగిస్తాము. 650సీసీ కెటగిరీలో నాలుగు విభిన్న మోడళ్లు ఉన్నాయి. అందులో ఒకటి నింజా 650. ఇండియన్ మార్కెట్లో నింజా 650 మోడల్‌కు నిర్ధిష్టమైన కస్టమర్లు ఉన్నట్లు చెప్పుకొచ్చాడు."

2019 కవాసకి నింజా 650 విడుదల

డ్రైవ్‌‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కవాసకి మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి కెఆర్‌టి ఎడిషన్ నింజా 650 వేరియంట్‌ను పరిచయం చేశాక ఇప్పుడు తాజాగా 2019 నింజా 650 బైకును నూతన బ్లాక్ కలర్ ఆప్షన్‌లో లాంచ్ చేసింది. నూతన కలర్ అప్‌డేట్ మినహాయిస్తే డిజైన్ మరియు సాంకేతికంగా 2019 మోడల్ అచ్చం 2018 మోడల్‌నే పోలి ఉంటుంది. ఇది విపణిలో ఉన్న హోండా సిబిఆర్ 650ఎఫ్ మరియు బెనెల్లీ టిఎన్‌టి 600జిటి వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, July 6, 2018, 17:48 [IST]
English summary
Read In Telugu: 2019 Kawasaki Ninja 650 launched in India at Rs 5.49 lakhs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+