Just In
Don't Miss
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- News
విమానంలో టాయిలెట్‌కు వెళ్లనివ్వలేదని... డీజీసీఏ ఉద్యోగులను కిడ్నాప్ చేసిన యువకుడు...
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Movies
ఝాన్సీ, శ్రీముఖి ఖతం.. ఇప్పుడు సుమ వంతు.. ఇప్పటికైనా ఆ షో గట్టెక్కేనా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇండియన్ మార్కెట్ కోసం సిద్దమైన ఐదు అడ్వెంచర్ బైకులు
అడ్వెంచర్ బైకులు ప్రపంచ మార్కెట్లో మంచి ప్రాచుర్యం పొందాయి. అదే ఇండియాలో అయితే మైలేజ్ ఇచ్చే కమ్యూటర్ మరియు రేసింగ్ ఫీల్ ఇచ్చే స్పోర్ట్స్ బైకులకు మాత్రమే డిమాండ్ ఎక్కువ. కానీ, ఇటీవల కాలంలో అడ్వెంచర్ మోటార్ సైకిళ్లకు కూడా మార్కెట్లో డిమాండ్ ఏర్పడుతోంది.

ఈ నేపథ్యంలో ఇప్పటికే మార్కెట్లో ఉన్న పలు టూ వీలర్ల కంపెనీలు అడ్వెంచర్ బైకులను దేశీయంగా లాంచ్ చేసేందుకు సిద్దమవుతున్నాయి. బడ్జెట్ ధరలో వీలైనంత త్వరగా విడుదలయ్యేందుకు సిద్దమైన బైకుల గురించి పూర్తి వివరాల కోసం...

5. కెటిఎమ్ అడ్వెంచర్ 390
కెటిఎమ్ ఇండియన్ మార్కెట్లో ఆర్సీ390 స్పోర్ట్స్ మరియు డ్యూక్ 390 నేక్డ్ మోటార్ సైకిళ్లను విక్రయిస్తోంది. వీటికి తోడుగా అదే ఇంజన్‌తో అడ్వెంచర్ వెర్షన్‍ను ప్రవేశపెట్టనుంది. ఎన్నో ప్రయోగాలు మరియు పరీక్షలు అనంతరం ప్రొడక్షన్ వెర్షన్ కెటిఎమ్ అడ్వెంచర్ 390 బైకు దాదాపు సిద్దమైంది.

డిజైన్ పరంగా డ్యూక్ 390 ప్రేరణతో అడ్వెంచర్ వెర్షన్‌ను డెవలప్ చేసింది. అయితే, అదే ఇంజన్‌ను యథావిధిగా కొనసాగించింది. సాంకేతికంగా ఇందులో ఉన్న 373సీసీ కెపాసిటి గల లిక్విడ్ కూల్డ్ సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 44బిహెచ్‌పి పవర్ మరియు 37ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
- విడుదల అంచనా: 2019లో

4. బిఎమ్‌డబ్ల్యూ జి310 జిఎస్
బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్ ఇండియన్ మార్కెట్ కోసం 313సీసీ ఇంజన్ ఆధారంతో నిర్మించిన రెండు మోటార్ సైకిళ్లను ఖరారు చేసింది. అవి, జి310 జిఎస్ మరియు జి310 ఆర్. వీటిని ఇప్పటికే, దేశీయంగా టీవీఎస్ ప్రొడక్షన్ ప్లాంటులో ఉత్పత్తి చేసి విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేస్తోంది.

బిఎమ్‌డబ్ల్యూ టీవీఎస్ భాగస్వామ్యంతో నిర్మించిన జి310 ఆర్ నేక్ట్ స్ట్రీట్ ఫైటర్ కాగా, జి310 జిఎస్ అడ్వెంచర్ వెర్షన్. రెండింటిలో కూడా 313సీసీ కెపాసిటి గల లిక్విడ్ కూల్డ్ సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 34బిహెచ్‌పి పవర్ మరియు 28ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
- విడుదల అంచనా: జూలై 2018

3. హీరో ఎక్స్‌పల్స్ 200
ఇండియన్ అడ్వెంచర్ మోటార్ సైకిళ్ల విభాగంలో విడుదలయ్యేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్న మరో మోడల్ హీరో ఎక్స్‌పల్స్ 200. హీరో మోటోకార్ప్ తమ ఇంపల్స్ మోటార్ సైకిల్‌కు కొనసాగింపుగా రూపొందించింది. ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ వేదికగా జరిగిన ఆటో ఎక్స్ పో 2018లో తొలిసారిగా ఆవిష్కరించింది.

ఎక్స్‌పల్స్ 200 అడ్వెంచర్ బైకును హీరో తమ ఎక్స్‌ట్రీమ్ 20ఆర్ ఆధారంగా డెవలప్ చేసింది. సాంకేతికంగా రెండు బైకులు కూడా ఒకే 200సీసీ ఇంజన్‌ను పంచుకున్నప్పటికీ, అడ్వెంచర్ వెర్షన్‌లో ఎన్నో విభిన్నమైన ఫీచర్లు మరియు డిజైన్ ఎలిమెంట్లు ఉన్నాయి.
- విడుదల అంచనా: సెప్టెంబరు 2018 నాటికి

2. సుజుకి వి-స్ట్రామ్ 250
బిఎమ్‌డబ్ల్యూ జి310 జిఎస్ ఆవిష్కరించిన అనంతరం సుజుకి కూడా వి-స్ట్రామ్ 250 అడ్వెంచర్ బైకును ప్రవేశపెట్టింది. ఎంట్రీ లెవల్ వి-స్ట్రామ్ 250 ఆఫ్-రోడ్ మరియు ఆన్-రోడ్ రెండు రకాల అవసరాలకు ఉపయోగపడుతుంది.

అత్యంత సరసమైన అడ్వెంచర్ మోటార్ సైకిళ్లను కోరుకునే ఇండియన్ కస్టమర్ల అవసరాలకు ఇది చక్కగా సరిపోతుంది. సాంకేతికంగా ఇందులో ఉన్న 250సీసీ పెట్రోల్ ఇంజన్ 24బిహెచ్‌పి పవర్ మరియు 23.4ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆఫ్ రోడ్ వెర్షన్ వివిధ రకాల ఫీచర్లతో లభిస్తుంది.
విడుదల అంచనా: 2019 ప్రారంభంలో

1. బెనెల్లీ టీఆర్‌కే 502
ఇటలీకి చెందిన టూ వీలర్ల తయారీ దిగ్గజం బెనెల్లీకి ఇటీవల కాలంలో దేశీయంగా మంచి పాపులారిటీ లభించింది. 2016 ఆటో ఎక్స్‌పో లో బెనెల్లీ తొలిసారిగా టీఆర్‌కే 502 అడ్వెంచర్ మోటార్ సైకిల్‌ను ప్రదర్శించింది.

ఈ జాబితాలో అత్యంత శక్తివంతమైన మోడల్ బెనెల్లీ టీఆర్‌కే 502. సాంకేతికంగా ఇందులో 500సీసీ కెపాసిటి గల లిక్విడ్ కూల్డ్ ప్యార్లల్-ట్విన్ ఇంజన్ కలదు, 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 47బిహెచ్‌పి పవర్ మరియు 45ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
విడుదల అంచనా: 2018 చివరి నాటికి