రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసింన ఆంపియర్

By Anil Kumar

ఆంపియర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండియన్ మార్కెట్లోకి రెండు సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసింది. కోయంబత్తూరుకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఆంపియర్ విపణిలోకి వి48 మరియు రియో లి-అయాన్ ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది.

రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసింన ఆంపియర్

ఆంపియర్ వి48 స్కూటర్ ప్రారంభ ధర రూ. 38,000 లు మరియు రియో లి-అయాన్ స్కూటర్ ప్రారంభ ధర రూ. 46,000 లు ఎక్స్-షోరూమ్‌గా ఉన్నాయి. రెండు స్కూటర్లలో కూడా లిథియం-అయాన్ బ్యాటరీలను అందివ్వడం జరిగింది.

రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసింన ఆంపియర్

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... రెండు స్కూటర్లకు రిజిస్ట్రేషన్ నెంబర్ అవసరం లేదు మరియు వీటిని నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసరం లేదు.

రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసింన ఆంపియర్

ఆంపియర్ వి48 మరియు రియో లి-అయాన్ స్కూటర్లలో 250 వాట్స్ బ్రష్‌లెస్ డిసి మోటార్ ఉంది. దీనికి 48వోల్ట్ లిథియం-అయాన్ బ్యాటరీ నుండి పవర్ అందుతుంది. ఆంపియర్ వి48 మోయగల గరిష్ట బరువు 100కిలోలు మరియు అంపియర్ రియో లి-అయాన్ మోయగల గరిష్ట బరువు 120కిలోలుగా ఉంది.

రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసింన ఆంపియర్

కొత్తగా విడుదలైన రెండు ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు రహదారి పరిస్థితులను బట్టి ఒక్కసారి ఛార్జింగ్‌తో 65 నుండి 70కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి. మరియు ఈ రెండింటి గరిష్ట వేగం గంటకు 25కిలోమీటర్లుగా ఉంది. మరియు వీటిని నాలుగు నుండి ఐదు గంటల్లోపు ఫుల్ ఛార్జింగ్ చేయవచ్చని ఆంపియర్ పేర్కొంది.

రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసింన ఆంపియర్

ఆంపియర్ కంపెనీ ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల విడుదలతో పాటు సరికొత్త లిథియం-అయాన్ బ్యాటరీ ఛార్జర్‌ను కూడా మార్కెట్లోకి లాంచ్ చేసింది. దీని ధర రూ. 3,000 లుగా ఉంది. ఇందులో ఉన్న 2-స్టేజ్ ప్రొఫైల్ వోల్టేజ్ మరియు కరెంట్ లెవల్స్‌ను మార్చుతుంది.

రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసింన ఆంపియర్

బ్యాటరీని షార్ట్-కట్, రివర్స్-పొలారిటీ మరియు హై-టెంపరేచర్ కట్-ఆఫ్ నుండి రక్షించేందుకు బ్యాటరీలో కంట్రోల్ మరియు మానిటరింగ్ సిస్టమ్ వచ్చింది. బ్యాటరీని సురక్షితంగా ఉంచడంలో ఈ వ్యవస్థ కీలకంగా పనిచేస్తుంది.

రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసింన ఆంపియర్

ఆంపియర్ సంస్థ ఈ బ్యాటరీలను ప్రస్తుతం తైవాన్ మరియు చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. ఆంపియర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కంపెనీకి దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో సుమారుగా 150 విక్రయ కేంద్రాలు ఉన్నాయి.

రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసింన ఆంపియర్

ఇంధన ధరలు మరియు వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలు ప్రధాన పరిష్కారమయ్యాయి. ఇప్పుడు దేశీయ అంకుర సంస్థలు ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందులో ఒకటి ఆంపియర్ సంస్థ. రోజు వారి నగర అవసరాలకు ఆంపియర్ విడుదల చేసిన స్కూటర్ల బాగానే ఉంటాయి, అయితే వీటి టాప్ స్పీడ్ 25కిమీలు కాకుండా మరికాస్త ఎక్కువ ఉండే బాగుండేది.

Most Read Articles

English summary
Read In Telugu: Ampere V48 and Reo Li-Ion Electric Scooters Launched In India
Story first published: Friday, May 18, 2018, 11:52 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X