ఆటో ఎక్స్‌పో 2018: అప్రిలియా స్టార్మ్ 125 స్కూటర్ ఆవిష్కరించిన అప్రిలియా

అప్రిలియా ఇండియన్ ఆటో ఎక్స్‌పో 2018 వేదికగా పలు కొత్త మోడళ్లను ఆవిష్కరించింది. అందులో అప్రిలియా స్టార్మ్ 125 స్కూటర్. అప్రిలియా ఎస్ఆర్ 125తో పాటు స్టార్మ్ 125 స్కూటర్‌ను కూడా ప్రవేశపెట్టింది.

By Anil

Recommended Video

New Honda Activa 5G Walkaround, Details, Specifications, First Look

ఆటో ఎక్స్‌పో 2018: ఇటలీకి చెందిన శక్తివంతమైన టూ వీలర్ల తయారీ దిగ్గజం అప్రిలియా ఇండియన్ ఆటో ఎక్స్‌పో 2018 వేదికగా పలు కొత్త మోడళ్లను ఆవిష్కరించింది. అందులో అప్రిలియా స్టార్మ్ 125 స్కూటర్. అప్రిలియా ఎస్ఆర్ 125తో పాటు స్టార్మ్ 125 స్కూటర్‌ను కూడా ప్రవేశపెట్టింది.

అప్రిలియా స్టార్మ్ 125 స్కూటర్ గురించి మరిన్ని వివరాలు మరియు ఫోటోల కోసం...

ఆటో ఎక్స్‌పో 2018: అప్రిలియా స్టార్మ్ 125

అప్రిలియా స్టార్మ్ 125 స్కూటర్ చూడటానికి అచ్చం ఎస్ఆర్ 125 స్కూటర్‌నే పోలి ఉంటుంది. కాస్మొటిక్ మార్పులు మరియు బాడీ గ్రాఫిక్స్ మినహాయిస్తే రెండు స్కూటర్లను ఒకే ఛాసిస్ ఫ్రేమ్ మరియు ఇంజన్‌తో సహా ఒకే బాడీతో డిజైన్ చేశారు.

ఆటో ఎక్స్‌పో 2018: అప్రిలియా స్టార్మ్ 125

అప్రిలియా స్టార్మ్ 125 స్కూటర్‌లో రెడ్ మరియు యెల్లో మ్యాట్ ఫినిషింగ్ రంగులతో ఆటో ఎక్స్‌పోలో కొలువుదీరింది. అయితే, డ్యూయల్ టోన్ బాడీ గ్రాఫిక్స్ కేవలం ఎస్ఆర్ 125 స్కూటర్‌కే పరిమితం అయ్యాయి.

ఆటో ఎక్స్‌పో 2018: అప్రిలియా స్టార్మ్ 125

అప్రిలియా స్టార్మ్ 125 స్పోర్టివ్ మరియు ఫంకీ అగ్రెసివ్ కలిగి ఉంటుంది. ఫ్రంట్ యాప్రాన్ మీద డ్యూయల్-హెడ్‌ల్యాంప్, ట్విన్-పోడ్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, పదునైన మరియు కోణీయంగా ఉన్న డిజైన్ స్కూటర్‌కు స్పోర్టివ్ స్టైల్ తీసుకొచ్చాయి.

ఆటో ఎక్స్‌పో 2018: అప్రిలియా స్టార్మ్ 125

అప్రిలియా ఎస్ఆర్ 125 మరియు స్టార్మ్ 125 ఉన్న ప్రధాన వ్యత్యాసం చక్రాలు. స్టార్మ్ 125లో 12-అంగుళాల వీల్స్ ఉంటే ఎస్ఆర్ 125లో 14-అంగుళాల వీల్స్ ఉన్నాయి. ఈ చక్రాల డిజైన్ కూడా పూర్తి విభిన్నంగా ఉంటుంది.

ఆటో ఎక్స్‌పో 2018: అప్రిలియా స్టార్మ్ 125

అప్రిలియా స్టార్మ్ 125 స్కూటర్లో హై-ప్రొఫైల్ బటన్స్ గల వీ రబ్బర్ ట్యూబ్ లెస్ టైర్లు ఉన్నాయి. ఎస్ఆర్ 125లో సాధారణ టైర్లు ఉంటాయి. ఆఫ్-రోడ్ టైర్లతో అన్ని రకాల రహదారుల్లో స్టార్మ్ 125 అద్భుతమైన పనితీరును కనబరుస్తుంది. ఇతర యాక్ససరీలతో పాటు పెద్ద పరిమాణంలో ఉన్న విండ్‌స్క్రీన్ కలదు.

ఆటో ఎక్స్‌పో 2018: అప్రిలియా స్టార్మ్ 125

సాంకేతికంగా అప్రిలియా స్టార్మ్ 125 మరియు ఎస్ఆర్ 125 స్కూటర్లలో అదే 124సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే 3-వాల్వ్ సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇంజన్ ఉత్పత్తి చేసే 9.46బిహెచ్‌పి పవర్ మరియు 8.2ఎన్ఎమ్ టార్క్ సివిటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ద్వారా రియర్ వీల్‌కు చేరుతుంది.

ఆటో ఎక్స్‌పో 2018: అప్రిలియా స్టార్మ్ 125

అప్రిలియా స్టార్మ్ 125లో 6.5-లీటర్ల ఇంధన ట్యాంక్ కలదు, అదే ఎస్ఆర్ 125 స్కూటర్‌లో 7-లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంది. అప్రిలియా స్టార్మ్ 125లో సస్పెన్షన్ పరంగా ముందు వైపున 30ఎమ్ఎమ్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స మరియు వెనుక వైపున ప్రిలోడ్ అడ్జస్టబుల్ సింగల్ మోనోషాక్ అబ్జార్వర్ ఉంది.

ఆటో ఎక్స్‌పో 2018: అప్రిలియా స్టార్మ్ 125

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

125సీసీ స్కూటర్ సెగ్మెంట్లో స్పోర్టివ్ ఫీల్ కలిగించే స్కూటర్‌ను అందించే ఉద్దేశ్యంతో స్టార్మ్ 125 స్కూటర్‌ను కొన్ని ఆఫ్-రోడ్ లక్షణాలతో ప్రవేశపెట్టింది. మ్యాట్ కలర్ ఫినిషింగ్‌లో, అతి కొద్ది బాడీ గ్రాఫిక్స్‌తో ఆఫ్ రోడ్ మరియు ఆన్ రోడ్ అవసరాలకు అనుగుణంగా యువ కొనుగోలుదారులను టార్గెట్ చేసుకుని అప్రిలియా స్టార్మ్ 125 స్కూటర్‌ను అభివృద్ది చేశారు.

ఆటో ఎక్స్‌పో 2018: అప్రిలియా స్టార్మ్ 125

ఈ ఏడాది చివరి నాటికి రూ. 65,000ల అంచనా ధరతో విడుదల చేసే అవకాశం ఉంది. అప్రిలియా ఆవిష్కరించిన మరిన్ని మోడళ్లను క్రింది ఫోటో గ్యాలరీ సెక్షన్ ద్వారా వీక్షించగలరు...

Most Read Articles

English summary
Read In Telugu: Auto Expo 2018: Aprilia Storm 125 Unveiled - Expected Launch Date, Price, Features & Images
Story first published: Monday, February 12, 2018, 17:49 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X