ఏషియా రోడ్ రేసింగ్ ఛాంపియన్‌షిప్‌లో రికార్డ్ నెలకొల్పిన ఇండియన్ జట్టు

2018 ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి మోటార్‌సైకిలజమ్ (FIM) ఆసియా రోడ్ రేసింగ్ ఛాంపియన్‌షిప్ (ARRC) నాలుగు రౌండ్ ముంగిపు దశకు వచ్చింది. చెన్నైలోని మద్రాస్ మోటార్ రేస్ ట్రాక్‌లో 2018 ఆగష్టు 3 నుండి 5 మధ్యన రేస

By Anil Kumar

2018 ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి మోటార్‌సైకిలజమ్ (FIM) ఆసియా రోడ్ రేసింగ్ ఛాంపియన్‌షిప్ (ARRC) నాలుగు రౌండ్ ముంగిపు దశకు వచ్చింది. చెన్నైలోని మద్రాస్ మోటార్ రేస్ ట్రాక్‌లో 2018 ఆగష్టు 3 నుండి 5 మధ్యన రేస్ జరిగింది. T.Pro Ten10 Racing విభాగానికి చెందిన ఇడెమిట్సు హోండా రేసింగ్ ఇండియా జట్టు తరపున ARRC లో పాల్గొన్న జపాన్‌కు చెందిన టియాగా హడా పోడియం మీద మూడవ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

ఏఆర్ఆర్‌సీ 2018 రౌండ్ ఫోర్ రిజల్ట్స్

జపాన్ నుండి వచ్చిన 19 ఏళ్ల టియాగా హడా చెన్నైలో జరిగిన ARRC ఛాంపియన్‌షిప్‌లో ఇడెమిట్సు హోండా రేసింగ్ ఇండియా టీమ్ తరపున సూపర్‌స్పోర్ట్ 600(ఎస్ఎస్600) కెటగిరీలో ఒంటరిగా ప్రవేశించాడు.

ఏఆర్ఆర్‌సీ 2018 రౌండ్ ఫోర్ రిజల్ట్స్

1:41.384 సమయంలో ట్రాక్ మొత్తం దూరాన్ని చేధించి, వేగవంతమైన ల్యాప్ టైమ్ రికార్డుతో వరుసగా ఆరవ సారి క్వాలిఫై అయ్యాడు. టియాగా హడా మొదట్లోనే వేగాన్ని పుంజుకోగలిగాడు, ఆంథోని వెస్ట్ జతగా రేస్ ట్రాక్ మీద దాదాపు అన్ని విభాగాల్లో తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు.

ఏఆర్ఆర్‌సీ 2018 రౌండ్ ఫోర్ రిజల్ట్స్

రేస్ తుది దశకు చేరుకునేసరికి టియాగా హడా 16 పాయింట్లతో మూడవ స్థానాన్ని కైవసం చేసుకోగలిగాడు. ఈ ఛాంపియన్‌షిప్‌లో ఒంటరిగా పాల్గొని పూర్తి చేసిన మొదటి పోడియం ఇదే. మొత్తం మీద 40 పాయింట్లను సాధించిన రైడర్‌ ఛాంపియన్‌షిప్‌లో ఏడవ స్థానంలో నిలిచాడు.

ఏఆర్ఆర్‌సీ 2018 రౌండ్ ఫోర్ రిజల్ట్స్

T.Pro Ten10 Racing కు చెందిన ఇడెమిట్సు హోండా రేసింగ్ ఇండయా టీమ్ నుంచి ARRC లో పాల్గొన్న టియాగా హడా ఈ సందర్భంగా మాట్లాడుతూ, "మద్రాస్ మోటార్ రేస్ ట్రాక్ మీద నా మునుపటి పర్ఫామెన్స్ కంటే ఈ సారి రెండు రెట్లు పోడియం పాయింట్లను సాధించడం ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. వరుసగా మూడవసారి నా స్థానాన్ని పధిలపరుచుకోవడం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాను."

ఏఆర్ఆర్‌సీ 2018 రౌండ్ ఫోర్ రిజల్ట్స్

"మద్రాస్ మోటార్ రేస్ ట్రాక్ ఈవెంట్లో హాజరైన అభిమానులు మరియు ఔత్సాహికుల నుండి వచ్చిన ఆదరణ నన్ను ఎంతగానో ప్రేరేపించింది. ప్రతి మలుపు, ప్రతి గమ్యంలో నా విజయానికి వారి ప్రోత్సాహం అద్భుతం మరియు నా క్యాలెండర్ రేస్ ట్రాకుల్లో నాకు ఎంతగానో ఇష్టమైన రేస్ ట్రాక్ మద్రాస్ మోటార్ రేస్ ట్రాక్ అని చెప్పుకొచ్చాడు."

ఏఆర్ఆర్‌సీ 2018 రౌండ్ ఫోర్ రిజల్ట్స్

ఇదే సందర్భంలో, వారాంతంలో జరిగిన ఏషియా ప్రొడక్షన్ 250 (AP250) కెటగిరీలో సుమారుగా 24 మంది రైడర్లు పోటీపడ్డారు. ఇందులో ఇడెమిట్సు హోండా రేసింగ్ పోటీదారులైన ఇండియన్ రైడర్లు, రాజీవ్ సేతు మరియు అనీష్ సెట్టి వరుసగా 19 మరియు 20వ స్థానాలలో క్వాలిఫై అయ్యారు.

ఏఆర్ఆర్‌సీ 2018 రౌండ్ ఫోర్ రిజల్ట్స్

20 ఏళ్ల వయస్సున్న రాజీవ్ సేతుకి ఇది మొట్టమొదటి రేస్ కావడం విశేషం. మణికట్టు గాయం నుండి కోలుకున్న తరువాత రైడర్ రేసులో ఏకంగా 13 వ స్థానానికి ఎగబాకాడు. థాయి టాలెట్ కప్ ద్వారా రేసింగ్ ప్రపంచానికి కొత్తగా పరిచయం అయిన రాజీవ్ ఛాపియన్‌షిప్‌లో మూడు పాయింట్లను పట్టుకెళ్లాడు. 1:50.945 సమయంలో రేస్ ట్రాక్ పూర్తి చేశాడు.

ఏఆర్ఆర్‌సీ 2018 రౌండ్ ఫోర్ రిజల్ట్స్

ఏదేమైనప్పటికీ, రూకీ రేసర్, అనీష్ శెట్టి తన ఏడవ ల్యాప్‌లో ఎక్కువసార్లు హై స్లైడ్ కావడంతో డిడ్ నాట్ ఫినిష్ (DNF)కు పరిమితమయ్యాడు.

ఏఆర్ఆర్‌సీ 2018 రౌండ్ ఫోర్ రిజల్ట్స్

T.Pro Ten10 కు చెందిన ఇడెమిట్సు హోండా రేసింగ్ ఇండియా జట్టు పోటీదారుడు రాజీవ్ సేతు మాట్లాడుతూ, "ఈ రోజు దారుణమైన ప్రారంభాన్ని ఎదుర్కొన్నాను అయితే, నా బైకు వెంటనే సెటప్ కావడంతో ధైర్యం వచ్చింది. చాలా మంది రైడర్లు నన్ను రేస్ ట్రాక్ నుండి తప్పించడానికి ప్రయత్నించారు. అయితే, ఎంతో ఓపికతో వారిని ఎదుర్కొని అధిగమించాను."

ఏఆర్ఆర్‌సీ 2018 రౌండ్ ఫోర్ రిజల్ట్స్

"ఏకంగా ఆరు స్థానాలను అధిగమించడం, రేసింగ్ ప్రియుల సమక్షంలో నా తొలి సీజన్‌లో ఈ తరహా పాయింట్లను సాధించడం నన్ను ఎంతగానో ఆనందానికి గురి చేసింది. ఇటీవల నేను పాల్గొన్న థాయ్ టాలెంట్ కప్ నన్ను అత్యంత కఠినమైన ఇంటర్నేషనల్ రేసింగ్‌లో ప్రపంచానికి పరిచయం చేసింది. అత్యధిక ఒత్తిడిలో రేపటి కోసం సిద్దమవుతున్నానని రాజీవ్ తన అనుభవాలను చెప్పుకొచ్చాడు."

ఏఆర్ఆర్‌సీ 2018 రౌండ్ ఫోర్ రిజల్ట్స్

హోండా మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, బ్రాండ్ అండ్ కమ్యూనికేషన్ విభాగాధ్యక్షుడు, ప్రభు నాగరాజ్ మాట్లాడుతూ, "సొంత గడ్డ మీద తమ ఛాంపియన్ల అద్భుతమైన పనితీరు మమ్మల్ని ఎంతగానో సంతోషపరిచింది. ఈ సీజన్‌లో ఫస్ట్ పోడియం విజేత టియాగో హడా మరియు ఫస్ట్ పాయింట్ల్ పరంగా రాణించిన రాజీవ్ సేతు విజయం మమ్మల్ని గర్వపడేలా చేసింది. అనీష్ ప్రమాదాన్ని ఊహించేకపోయాం అయితే, రేపు ఖచ్చితంగా ట్రాక్‌లో కీలకంగా మారుతాడనే నమ్మకం ఉంది. ఛాంపియన్‌షిప్‌లో రేపటి రోజును సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవడానికి మా రైడర్లు ఖచ్చితంగా మరో గొప్ప విజయాన్ని తీసుకొస్తారనే విశ్వాసం వ్యక్తం చేశాడు."

ఏఆర్ఆర్‌సీ 2018 రౌండ్ ఫోర్ రిజల్ట్స్

ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి మోటార్‌సైకిలజమ్ ఏషియా రోడ్ రేసింగ్ ఛాంపియన్‌షిప్ 2018 (FIM ARRC ) గురించి...

అత్యంత కఠినమైన మరియు విపరీతమైన పోటీ గల రోడ్ రేసుల్లో ఏషియా రోడ్ రేసింగ్ ఛాంపియన్‌షిప్ (ARRC) ఒకటి. ప్రొడక్షన్ ఆధారిత కెటగిరీలో ARRC ఒక భాగం. ఈ ఛాంపియన్‌షిప్‌లో మూడు ఓపెన్-మేక్ క్లాసులు మరియు రెండు సింగల్-మేక్ డెవలప్‌మెంట్ క్లాసులు ఉంటాయి.

ఏఆర్ఆర్‌సీ 2018 రౌండ్ ఫోర్ రిజల్ట్స్

ప్రస్తుతం 23 వ ఎడిషన్ ఛాంపియన్‌షిప్ జరిగింది. ఇందులో 8 ఆషియా దేశాలకు చెందిన 65 మంది రైడర్లు ఆరు రౌండ్ల ఛాంపియన్‌షిప్‌లో తలపడ్డారు. మొదటి రౌండ్ థాయింలాండ్‌లో జరిగింది. రెండ మరియు మూడవ రౌండ్లు వరుసగా ఆస్ట్రేషియా మరియు జపాన్‌లో జరిగాయి. రౌండ్ ఫోర్ ఇండియాలోని మద్రాస్ మోటార్ రేస్ ట్రాక్‌లో జరిగింది. ఆగష్టు 12 నుండి 14 మధ్య జరిగే ఐదవ రౌండ్ కోసం ఛాంపియన్లు ఇండోనేషియాకు వెళుతున్నారు. సీజన్ ఫినాలే నవంబర్ 30 నుండి డిసెంబర్ 2 మధ్యన థాయిలాండ్‌లో జరుగుతుంది.

ఏఆర్ఆర్‌సీ 2018 రౌండ్ ఫోర్ రిజల్ట్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఏషియా రోడ్ రేసింగ్ ఛాంపియన్‌షిప్ 2018 నాలుగవ రౌండ్ ఇండియాలో జరగడం మోటార్‌స్పోర్ట్స్ ఇష్టపడే ప్రతి ఔత్సాహిక భారతీయుడు గర్వించదగ్గ విషయం. ఈ వారంతంలో జరిగిన పోటీలో ఇడెమిట్సు హోండా రేసింగ్ సూపర్ స్పోర్ట్ కేటగిరీలో పోడియంలో స్థానంలో నిలవడం మరియు ఏపి250 కెటగిరీలో రాజీవ్ సేతు పోడియంలో మొదటి పాయింట్లు సాధించాడు.

ఏఆర్ఆర్‌సీ 2018 రౌండ్ ఫోర్ రిజల్ట్స్

ఛాంపియన్లు అందరూ ఇప్పుడు ఐదవ రౌండ్ రేసింగ్ కోసం ఇండోనేషియాకు వెళుతున్నారు. డ్రైవ్‌స్పార్క్ బృందం దేశీయ జట్టు ఇడెమిట్సు హోండా రేసింగ్ బృందానికి ఆల్

ద బెస్ట్ చెబుతోంది.

Most Read Articles

English summary
Read In Telugu: ARRC 2018 Round Four Results: IDEMITSU Honda Racing India Sets The Pace
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X