రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసిన ఏథర్: ధర రూ. 1.09 లక్షలు

ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసింది. బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారు చేసే స్టార్టప్ కంపెనీ ఏథర్ ఎనర్జీ సుధీర్ఘ ప్రయోగానంతరం మార్కెట్లో 340 మరియు 450 అనే ఎలక్ట్రిక్ స్కూటర్లను వ

By Anil Kumar

మారుతున్న కాలానికి అనుగుణంగా నగర రవాణా వ్యవస్థను సరళతరం చేస్తూనే పర్యావరణానికి మేలు కలిగించే దిశగా ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసింది. బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారు చేసే స్టార్టప్ కంపెనీ ఏథర్ ఎనర్జీ సుధీర్ఘ ప్రయోగానంతరం మార్కెట్లో 340 మరియు 450 అనే ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది.

దేశీయ ద్విచక్ర వాహన పరిశ్రమ రూపు రేఖలు మార్చబోయే ఏథర్ 340 మరియు 450 స్కూటర్ల గురించి పూర్తి వివరాలు నేటి కథనంలో...

ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల

ఏథర్ ఎనర్జీ స్టార్టప్ కంపెనీ విడుదల చేసిన 340 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.09 లక్షలు మరియు 450 స్కూటర్ ధర రూ. 1.24 లక్షలు. రెండు ధరలు కూడా అన్ని పన్నులు, మినహాయింపులు మరియు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రయోజనాలతో సహా ఆన్-రోడ్ ధరలుగా ఇవ్వబడ్డాయి.

ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల

340 మరియు 450 ఎలక్ట్రిక్ స్కూటర్లు చూడానిటికి ఒకేలా ఉంటాయి. అయితే, 450 స్కూటర్లోని చక్రాల మీద గ్రీన్ స్టిక్కరింగ్ ఉంటుంది. ఏథర్ ఎనర్జీ విపణిలోకి ప్రవేశపెట్టిన భారతదేశపు తొలి స్మార్ట్ ఎలక్ట్రి స్కూటర్ల తొలుత బెంగళూరులో మాత్రమే లభ్యమవుతాయి. ఈ ఏడాది చివరి నాటికి ఇతర నగరాలకు విస్తరించనున్నారు.

ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల

రెండు స్కూటర్లలో కూడా ఏథర్ ఎనర్జీ అభివృద్ది మరియు తయారు చేసిన బ్రష్‌లెస్ డిసి మోటార్(BLDC) మరియు బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. బ్యాటరీలకు మూడేళ్లపాటు అపరిమిత కిలోమీటర్లకు వారంటీ ఉంది.

ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల

340 మరియు 450 ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఉన్న ఎలక్ట్రిక్ మోటార్లు పెట్రోల్ ఇంజన్ స్కూటర్లకు ధీటుగా 20ఎన్ఎమ్ మరియు 20.5ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఏథర్ 340 గరిష్ట పరిధి 60కిమీలు. దీని గరిష్ట వేగం గంటకు 70కిమీలుగా ఉంది అదే విధంగా 0 నుండి 40కిమీల వేగాన్ని 5.1 సెకండ్లలో అందుకుంటుంది.

ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల

ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి పూర్తి ఛార్జింగ్‌తో 75కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 80కిలోమీటర్లు కాగా, 0 నుండి 40కిమీల వేగాన్ని కేవలం 3.9 సెకండ్ల వ్యవధిలోనే అందుకుంటుంది.

ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల

ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఇన్‌బిల్ట్ రివర్స్ అసిస్ట్ ఫీచర్ ఉంది. ఇది, స్కూటర్‌ను వెనక్కి నెట్టడానికి ఉపయోగపడుతుంది. ఏదేమైనప్పటికీ, రివర్స్ మోడ్‌లో యాక్సిలరేట్ చేసినపుడు గంటకు 5కిమీల వేగం మాత్రమే ఉంటుంది.

ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల

అంతే కాకుండా, తాము ఎయిర్ అప్‌డేట్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ఏథర్ ఎనర్జీ ప్రకటించింది. సాఫ్ట్‌వేర్ మరియు ఇతర టెక్నాలజీ అప్‌డేట్స్‌ను డైరక్ట్‌గా స్కూటర్‌కు చేరవేయడానికి ఈ ఎయిర్ అప్‌డేట్ సిస్టమ్ సహకరిస్తుంది.

ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల

ఏథర్ 340 మరియు 450 స్కూటర్లలో ఉన్న ఇతర ఫీచర్లలో, 7-అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, న్యావిగేషన్ అసిస్ట్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటి మరియు పార్కింగ్ అసిస్ట్‌తో పాటు వీటిలో వెహికల్ ఛార్జింగ్ పాయింట్ ట్రాకర్ కూడా ఉంది.

ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసే కస్టమర్ల నివాసంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ ఇవ్వడానికి ముందే ఏథర్ ప్రతినిధులు ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తారు.

ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల

ఏథర్ ఎనర్జీ బెంగళూరు నగర వ్యాప్తంగా ఇప్పటికే 30 ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఏథర్‌గ్రిడ్ ఛార్జింగ్ స్టేషన్లు ఫాస్ట్-ఛార్జింగ్ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నాయి. ఫాస్ట్-ఛార్జింగ్ ద్వారా ఒక గంట ఛార్జింగ్‌తో 50కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.

ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల

డ్రైవ్‌‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఏథర్ ఎనర్జీ ఎట్టకేలకు తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఆశ్చర్యకరంగా ఒకేసారి రెండు ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. భారతదేశపు తొల స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు అయిన ఏథర్ 340 మరియు 450 తొలుత బెంగళూరులో మాత్రమే లభ్యమవుతాయి.

ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు విపణిలో ఉన్న ట్వంటీటూ మోటార్స్ ఫ్లో మరియు ఒకినవ ప్రైజ్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు గట్టిపోటీనిస్తాయి.

Most Read Articles

English summary
Read In Telugu: Ather 340 & 450 Electric Scooters Launched In India; Prices Start At Rs 1.09 Lakh
Story first published: Tuesday, June 5, 2018, 14:18 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X