ఏథర్ ఎస్340 స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదలకు సిద్దమైన బెంగళూరు స్టార్టప్

బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ల అభివృద్ది మరియు తయారు చేసే ఏథర్ ఎనర్జీ స్టార్టప్ కంపెనీ తమ తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి లాంచ్ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.

బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ల అభివృద్ది మరియు తయారు చేసే ఏథర్ ఎనర్జీ స్టార్టప్ కంపెనీ తమ తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి లాంచ్ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఉద్గార రహిత ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి చేసే లక్ష్యంగా ప్రాణం పోసుకున్న ఏథర్ ఎనర్జీ అంకుర సంస్థ ఎట్టకేలకు భారతదేశపు ఏథర్ ఎస్340 తొలి స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదలకు సిద్దమైంది.

ఏథర్ ఎస్340 స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్

ఎలక్ట్రిక్ స్కూటర్ల అభివృద్ది మరియు తయారు చేసే ఏథర్ ఎనర్జీ జూన్ 5, 2018 న బెంగళూరు వేదికగా ఏథర్ ఎస్340 స్కూటర్‌ను విడుదల చేయనుంది. ఇండియా యొక్క మొట్టమొదటి స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర సుమారుగా రూ. 1 నుండి 1.5 లక్షల మధ్య ఎక్స్‌-షోరూమ్‌గా ఉండవచ్చు.

ఏథర్ ఎస్340 స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్

అంతే కాకుండా, భారతదేశపు అత్యంత ఖరీదైన స్కూటర్‍‌గా విపణిలోకి రానుంది. ఏథర్ ఇంజనీరింగ్ బృందం స్వయంగా అభివృద్ది చేసిన బ్రష్‌లెస్ డిసి మోటార్(BLDC) మరియు బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ ఈ ఎస్340 స్కూటర్‌లో ఉన్నాయి. ఇది గరిష్టంగా 14ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ఏథర్ ఎస్340 స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్

ఏథర్ ఎస్340 పరిధి ఒక్కసారి ఛార్జింగ్‌తో గరిష్టంగా 60కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. మరియు దీని గరిష్ట వేగం గంటకు 72కిలోమీటర్లుగా ఉంది. కేవలం 5.1 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 40కిమీల వేగాన్ని అందుకుంటుంది. ఇందులోని లిథియం-అయాన్ బ్యాటరీ 50,000కిమీల మన్నుతుందని కంపెనీ పేర్కొంది.

ఏథర్ ఎస్340 స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్

ఏథర్ ఎనర్జీ తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను తొలుత బెంగళూరు నగరంలో మాత్రమే విక్రయించనుంది. ఈ ఏడాది చివరి నాటికి తమ స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ విక్రయాలను దేశవ్యాప్తంగా విస్తరించే ఆలోచనలో ఉంది.

ఏథర్ ఎస్340 స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్

పేరుకు ఎలక్ట్రిక్ స్కూటర్ అయినప్పటికీ, ఇంత వరకు ఇండియన్ టూ వీలర్లలో పరిచయం కానటువంటి ఎన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 7-అంగుళాల టచ్ స్క్రీన్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటి, న్యావిగేషన్ అసిస్ట్, పార్కింగ్ అసిస్ట్, అండర్-సీట్ స్టోరేజ్ లైట్ మరియు ఎల్ఇడి లైటింగ్‌తో పాటు వెహికల్ ఛార్జింగ్ స్టేషన్‌ను గుర్తించే సిస్టమ్ కూడా ఉంది.

ఏథర్ ఎస్340 స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్

ఏథర్ ఎనర్జీ ఇప్పటికే, ఏథర్‌గ్రిడ్ ఛార్జింగ్ స్టేషన్లను ప్రారంభించింది. బెంగళూరు నగర వ్యాప్తంగా సుమారుగా 30 ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది, 2018 చివరి నాటికి అదనంగా మరో 30 స్టేషన్లను నిర్మించే ఆలోచనలో ఉంది.

ఏథర్ ఎస్340 స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్

ఏథర్ ఎనర్జీ తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను దేశవ్యాప్తంగా విక్రయించడానికి ముందుగా, వాటి ఛార్జింగ్ అవసరాల కోసం పలు ప్రధాన నగరాలలో ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.

ఏథర్ ఎస్340 స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఐఐటిలో ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న ఇద్దరు యువ ఔత్సాహికులు ఏథర్ ఎనర్జీ సంస్థను స్థాపించారు. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ టూ వీలర్లకు ఉండనున్న డిమాండు దృష్ట్యా దేశీయంగా ఉన్న పలు వ్యాపార వేత్తలు ఏథర్ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. సుధీర్ఘ అభివృద్ది అనంతరం ఏథర్ సంస్థ రూపొందించిన ఎస్340 ఎలక్ట్రిక్ స్కూటర్ ఎట్టకేలకు మార్కెట్లోకి విడుదలవుతోంది.

ఏథర్ ఎస్340 స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్

ఏథర్ ఎస్340 స్కూటర్ పూర్తి స్థాయిలో విడుదలైతే, మార్కెట్లో ఉన్న 22మోటార్స్ ఫ్లో మరియు ఒకినవ ప్రైజ్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు గట్టి పోటీనివ్వనుంది.

Most Read Articles

English summary
Read In Telugu: Ather S340 Smart Electric Scooter Launch Date Revealed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X