2018 ఆటో ఎక్స్ పో కోసం రెండు టూ వీలర్లను సిద్దం చేసిన యమహా
జపాన్ టూ వీలర్ల తయారీ దిగ్గజం యమహా 2018 ఆటో ఎక్స్‌పో వేదిక మీద కొత్త మోడళ్లను ఆవిష్కరించడానికి సమాయత్తమవుతోంది. తాజాగా అందిన రిపోర్ట్స్ మేరకు, వైజడ్ఎఫ్-ఆర్15 వి3.0 మరియు సరికొత్త 125సీసీ స్కూటర్.
Recommended Video

జపాన్ టూ వీలర్ల తయారీ దిగ్గజం యమహా 2018 ఆటో ఎక్స్‌పో వేదిక మీద కొత్త మోడళ్లను ఆవిష్కరించడానికి సమాయత్తమవుతోంది. తాజాగా అందిన రిపోర్ట్స్ మేరకు, వైజడ్ఎఫ్-ఆర్15 వి3.0 మరియు సరికొత్త 125సీసీ స్కూటర్‌ను ప్రదర్శించడానికి సన్నాహాలు చేస్తోంది.

యమహా తమ అప్ కమింగ్ 125సీసీ స్కూటర్ గురించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అయితే, వియత్నాంలో విక్రయిస్తున్న నోజా గ్రాండీ స్కూటర్ ఆధారంగా రూపొందిస్తున్నట్లు తెలిసింది.

యామహా న్యూ 125 స్కూటర్‌లో 125సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే ఫ్యూయల్ ఇంజెక్టెడ్ సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ వస్తోంది. భారత్‌లోకి వచ్చే ఈ స్కూటర్ కార్బోరేటర్ వెర్షన్‌లో రానుంది. ఇది గరిష్టంగా 8.2.బిహెచ్‌పి పవర్ మరియు 9.7ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

సిటీ మరియు పల్లె రోడ్ల మీద సులభంగా రైడ్ చేసేందుకు అతి తక్కువ బరువు(99కిలోలు మాత్రమేతో దీనిని రూపొందించింది. ఫ్యూయల్ క్యాప్ మరియు సీట్ తెరవడానికి ప్రత్యేకంగా బటన్లు ఉన్నాయి.

స్కూటర్ ఫ్రంట్ సైడ్ ఫ్యూయల్ ఫిల్టర్, 27-లీటర్ల కెపాసిటి ఉన్న అండర్ సీట్ స్టోరేజ్, ఫ్రంట్ సైడ్ ఉన్న ఫ్యూయల్ ట్యాంక్ , 12-అంగుళాల అల్లాయ్ వీల్స్ మరియు ఫ్రంట్ వీల్‌కు డిస్క్ బ్రేక్ ఇంకా ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.

యమహా ఇండియా 125సీసీ స్కూటర్‌తో పాటు థర్డ్ వెర్షన్ వైజడ్ఎఫ్-ఆర్15 స్కూటర్‌ను 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పో వేదిక మీద ఆవిష్కరించనుంది. యమహా ఈ మోడల్‌ను ఇప్పటికే పలుమార్లు ఇండియన్ రోడ్ల మీద పరీక్షించింది.

ఇండియన్ వెర్షన్ యమహా వైజడ్ఎఫ్ ఆర్15 వి3.0 లో అప్‌డేటెడ్ డిజైన్, డ్యూయల్ ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్, కన్వెన్షనల్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు సరికొత్త స్టైలింగ్‌లో ఉన్న నూతన ఫెయిరింగ్ కలదు.
Trending On DriveSpark Telugu:

యమహా సాంకేతికంగా ఆర్15 వి3.0 లో 155సీసీ కెపాసిటి గల లిక్విడ్ కూల్డ్ సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇది 19.3బిహెచ్‌పి పవర్ మరియు 14.7ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే ఇండియన్ స్పెక్ ఆర్15 వి3.0 లో వేరిబుల్ వాల్వ్ ఆక్టివేషన్ మరియు స్లిప్పర్ క్లచ్ టెక్నాలజీ మిస్సయ్యే అవకాశం ఉంది.

యమహా ఇప్పటికే బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే ఇంజన్‌తో అప్‌గ్రేడ్ చేసిన వైజడ్ఎఫ్-ఆర్3 బైకును అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉంచింది. ఇది గరిష్టంగా 41.9బిహెచ్‌పి పవర్ మరియు 29.6ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సరికొత్త యమహా ఆర్3 బైకును కూడా 2018 ఆటో ఎక్స్‌పో వేదిక మీద ప్రదర్శించనుంది.

2018 యమహా ఆర్3 సరికొత్త కలర్ ఆప్షన్‌లలో పరిచయం కానుంది. అంతే కాకుండా ఇందులో కనీసం ఆప్షనల్‌గానైనా యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్‌ను అందించే అవకాశాలు ఉన్నాయి. సస్పెన్షన్ పరంగా ముందు వైపున కెవైబి టెలిస్కోపిక్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనోషాక్ సస్పెన్షన్ కలదు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
యమహా సరికొత్త 125సీసీ స్కూటర్ మరియు 2018 లైనప్‌లోకి సరికొత్త ఆర్15 వి3.0 అదే విధంగా ఆర్3 బైకులను ఆవిష్కరించడానికి సర్వం సిద్దం చేసుకుంది. రెండు ఫెయిరింగ్ స్పోర్ట్స్ బైకులను అప్‌డేటెడ్ డిజైన్, ఇంజన్ మరియు నూతన ఫీచర్లతో ప్రవేశపెట్టనుంది.
Trending DriveSpark Telugu YouTube Videos


Click it and Unblock the Notifications








