అన్ని టూ వీలర్లను ఆఫర్లతో ముంచెత్తిన బజాజ్

బజాజ్ ఆటో లిమిటెడ్ జూలై 2018 కోసం అద్భుతమైన ఆఫర్లు ప్రకటించింది. బజాజ్ విక్రయిస్తున్న అన్ని మోటార్ సైకిళ్ల మీద హాట్రిక్ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. పరిమిత కాలపు బజాజ్ హ్యాట్రిక్ ఆఫర్లకు మంచి స

By Anil Kumar

దేశీయ దిగ్గజ టూ వీలర్ల తయారీ సంస్థ బజాజ్ ఆటో లిమిటెడ్ జూలై 2018 కోసం అద్భుతమైన ఆఫర్లు ప్రకటించింది. బజాజ్ విక్రయిస్తున్న అన్ని మోటార్ సైకిళ్ల మీద హాట్రిక్ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. పరిమిత కాలపు బజాజ్ హ్యాట్రిక్ ఆఫర్లకు మంచి స్పందన లభిస్తోంది.

అన్ని టూ వీలర్లను ఆఫర్లతో ముంచెత్తిన బజాజ్

బజాజ్ ఆటో అన్ని టూ వీలర్ల మీద మొదటి ఏడాది ఉచిత ఇన్సూరెన్స్, రెండేళ్ల పాటు ఉచిత సర్వీస్ మరియు ఐదేళ్ల పాటు వారంటీని అందిస్తోంది. ఈ మూడు ఆఫర్లు బజాజ్ టూ వీలర్ల శ్రేణిలో ఉన్న పల్సర్, అవెంజర్ మరియు డామినర్ రేంజ్ ఉత్పత్తులు అన్నింటికీ వర్తిస్తాయి.

అన్ని టూ వీలర్లను ఆఫర్లతో ముంచెత్తిన బజాజ్

అయితే, జూలై 2018 లోపు కొనుగోలు చేసే కస్టమర్లకు మాత్రమే ఈ హ్యాట్రిక్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఐదేళ్ల వారంటీలోనే రెండేళ్ల ఉచిత సర్వీస్ ఉంటుంది. దీనికి అదనంగా బజాజ్ మరో మూడేళ్ల పాటు వారంటీ అందిస్తోంది. ఈ మూడేళ్ల వారంటీ కేవలం ఇంజన్‌కు మాత్రమే వర్తిస్తుంది.

అన్ని టూ వీలర్లను ఆఫర్లతో ముంచెత్తిన బజాజ్

మొదటి ఏడాది ఉచిత ఇన్సూరెన్స్ ప్రత్యేకించి పల్సర్ 150, పల్సర్ 160, వి15, డిస్కవరీ మరియు ప్లాటినా మోడళ్ల మీద మాత్రమే ఉంది. అయితే, రెండేళ్ల పాటు ఉచిత సర్వీస్ ఆఫర్ బజాజ్ ఆటో లైనప్‌లోని అన్ని మోడళ్లకు వర్తిస్తుంది.

అన్ని టూ వీలర్లను ఆఫర్లతో ముంచెత్తిన బజాజ్

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న బజాజ్ డీలర్లు మంచి విక్రయాలు జరుపుతున్నారు. కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన ఆఫర్లతో ఈ సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ఆఫర్ల పట్ల కస్టమర్ల నుండి సానుకూల స్పందన వస్తున్నట్లు సమాచారం.

అన్ని టూ వీలర్లను ఆఫర్లతో ముంచెత్తిన బజాజ్

బజాజ్ ఆటో ఇటీవల వి12 బైకును ఆశించిన సేల్స్ లేకపోవడంతో మార్కెట్ తాత్కాలికంగా తొలగించింది. బజాజ్ ఆటో యుజి6 పేరుతో సరికొత్త పల్సర్ బైకును అభివృద్ది చేస్తోంది. మార్కెట్ నుండి వైదొలగిన పల్సర్ 135 స్థానంలో పల్సర్ 125 బైకును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Tuesday, July 24, 2018, 16:09 [IST]
English summary
Read In Telugu: Bajaj 2018 discount offer on all motorcycles – Dominar, Pulsar, Avenger, Discover gets good response
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+