డిస్కవర్ 110 మరియు డిస్కవర్ 125 బైకులను విడుదల చేసిన బజాజ్

బజాజ్ ఆటో విపణిలోకి సరికొత్త డిస్కవర్ 110 మోటార్ సైకిల్‌ను విడుదల చేసింది. దీనితో పాటు డిస్కవర్ 125 బైకును కూడా ప్రవేశపెట్టింది. బజాజ్ డిస్కవర్ 110 ప్రారంభ ధర రూ. 50,176 లు.

By Anil

Recommended Video

Bangalore Bike Accident At Chikkaballapur | Full Details - DriveSpark

బజాజ్ ఆటో విపణిలోకి సరికొత్త డిస్కవర్ 110 మోటార్ సైకిల్‌ను విడుదల చేసింది. దీనితో పాటు డిస్కవర్ 125 బైకును కూడా ప్రవేశపెట్టింది. బజాజ్ డిస్కవర్ 110 ప్రారంభ ధర రూ. 50,176 లు మరియు డిస్కవర్ 125 ప్రారంభ ధర రూ. 53,171లు, రెండు ధరలు ఎక్స్-షోరూమ్‍‌(ఢిల్లీ)గా ఉన్నాయి.

బజాజ్ డిస్కవర్ బైకులు

బజాజ్ గతంలో ప్రవేశపెట్టి, తొలగించిన డిస్కవర్ 100 బైకు స్థానంలోకి డిస్కవర్ 110 బైకును తమ లైనప్‌లోకి విడుదల చేసింది. కొత్తగా విడుదలైన డిస్కవర్ 110 మరియు రీలాంచ్ అయిన డిస్కవర్ 125 గురించి పూర్తి వివరాలు ఇవాళ్టి కథనంలో తెలుసుకుందాం రండి...

బజాజ్ డిస్కవర్ బైకులు

నూతన బజాజ్ డిస్కవర్110 కేవలం సింగల్ వేరియంట్లో మాత్రమే లభిస్తుండగా, బజాజ్ డిస్కవర్ 125 డ్రమ్ మరియు డిస్క్ అనే రెండు వేరియంట్లలో లభ్యమవుతోంది.

వేరియంట్లు ధరలు
డిస్కవర్ 110 రూ. 50,176 లు
డిస్కవర్ 125 డ్రమ్ రూ. 53,171 లు
డిస్కవర్ 125 డిస్క్ రూ. 55,994 లు
బజాజ్ డిస్కవర్ బైకులు

డిస్కవర్ 110 మరియు డిస్కవర్ 125 స్పెసిఫికేషన్లు

110సీసీ కమ్యూటర్ మోటార్ సైకిల్ సెగ్మెంట్లోకి లాంచ్ చేసిన ఆల్ న్యూ డిస్కవర్ 110 బైకులో 115.4సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే ఫోర్ స్ట్రోక్ సింగల్ సిలిండర్ డిటిఎస్-ఐ ఇంజన్ కలదు. ఇది 7,000ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 8.48బిహెచ్‌పి పవర్ మరియు 5,000ఆర్‌పిఎమ్ వద్ద 9.81ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

బజాజ్ డిస్కవర్ బైకులు

అయితే, డిస్కవర్ 125 బైకులో మాత్రమే బజాజ్ అదే 124.6సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ అందించింది. ఇది 7,000ఆర్‌పిఎమ్ వద్ద 10.84బిహెచ్‌పి పవర్ మరియు 5,000ఆర్‌పిఎమ్ వద్ద 11ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

బజాజ్ డిస్కవర్ బైకులు

2018 వెర్షన్ బజాజ్ డిస్కవర్ సిరీస్‌లో ఉన్న రెండు బైకుల్లో కూడా గేర్లను మృదువుగా మారేందుకు సెల్యూలోస్ ఆధారిత క్లచ్ సిస్టమ్ మరియు సౌకర్యవంతమైన రైడింగ్ కల్పించేందుకు 16 శాతం పొడవైన సస్పెన్షన్ సిస్టమ్ ఇందులో అందించింది.

Trending On DriveSpark Telugu:

బజాజ్ డిస్కవర్ బైకులు

2018 బజాజ్ డిస్కవర్ డిజైన్ మరియు ఫీచర్లు

సరికొత్త 2018 బజాజ్ డిస్కవర్ 110 మరియు డిస్కవర్ 125 బైకులు డిస్కవర్ ఫ్యామిలీకి చెందిన అదే పాత రూపాన్ని పోలి ఉంటాయి. రెండు బైకులు కూడా చూడటానికి 2017 సిరీస్ డిస్కవర్ తరహాలోనే ఉన్నప్పటికీ స్టైలింగ్ మరియు ఫీచర్ల పరంగా గుర్తించదగిన మార్పులు చోటు చేసుకున్నాయి.

బజాజ్ డిస్కవర్ బైకులు

ప్రధానంగా గుర్తించదగిన మార్పుల్లో పగటి పూట వెలిగ్ ఎల్ఇడి లైట్ల జోడింపుతో ఉన్న హెడ్ ల్యాంప్. ఇందులో తలక్రిందులుగా అమర్చిన కొమ్ముల తరహా ఎల్ఇడి లైటింగ్ వ్యవస్థను గమనించగలరు. వీటిలో పరిచయం చేసిన ఎల్ఇడి లైట్లు మరియు ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ ఆన్ ఫీచర్లు డిస్కవర్ సిరీస్ బైకులకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.

బజాజ్ డిస్కవర్ బైకులు

డిస్కవర్ 110 మరియు 125 రెండు బైకుల్లో ఫస్ట్-ఇన్-క్లాస్ డిజిటల్ స్పీడో మీటర్ వచ్చింది. ఇది ఫ్యూయల్ గేజ్, ఓడో మీటర్ మరియు ట్రిప్ మీటర్లు వంటివి ఉన్నాయి. అయితే, ఆర్‌పిఎమ్ లెక్కించే మీటర్ అదే అనలాగ్ సిస్టమ్‌లో వచ్చింది.

బజాజ్ డిస్కవర్ బైకులు

బజాజ్ డిస్కవర్ శ్రేణి బైకులు రివైజ్ చేయబడిన సైడ్ ప్యానల్స్, నూతన బ్లాక్ స్పైడర్ మ్యాగ్ అల్లాయ్ వీల్స్, త్రీ స్టెప్ టెయిల్ ల్యాంప్ బెజల్ ఉన్నాయి. రెండు మోటార్ సైకిళ్లు మూడు విభిన్న రంగుల్లో లభిస్తున్నాయి. అవి, బ్లాక్, బ్లూ మరియు రెడ్.

బజాజ్ డిస్కవర్ బైకులు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

బజాజ్ ఆటో ఈ ఏడాది మరింత ఉత్సాహంతో 2018 డిస్కవర్ సిరీస్ బైకులను లాంచ్ చేసింది. కమ్యూటర్ బైకుల సెగ్మెంట్లో అత్యుత్తమ పవర్ మరియు టార్క్ ఇవ్వగల ఇంజన్‌లతో మరియు కమ్యూటర్ శ్రేణి బైకుల్లో తొలిసారిగా కొన్ని నూతన ఫీచర్లను పరిచయం చేసింది.

అన్ని అంశాలతో కస్టమర్లకు బెస్ట్ ఛాయిస్‌గా నిలిచే బజాజ్ డిస్కవర్ 110 మరియు డిస్కవర్ 125 ధరలు కూడా అత్యంత సరసమైనవిగా ఉన్నాయి.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

More from DriveSpark

Article Published On: Wednesday, January 10, 2018, 15:58 [IST]
English summary
Read In Telugu: Bajaj discover 110 and 125 launched in india. prices, mileage, specifications and images
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+