బజాజ్ డామినర్ 400 మీద పెరిగిన ధరలు

ఇండియన్ టూ వీలర్ల తయారీ దిగ్గజం బజాజ్ ఆటో తమ డామినర్ 400 బైకు మీద మరోసారి ధరలు పెంచింది. బజాజ్ తాజాగా చేపట్టిన ధరల పెంపులో భాగంగా డామినర్ 400 మీద రూ. 2,000 పెరిగింది. బజాజ్ చివరి సారిగా మే నెలలో డామిన

By Anil Kumar

ఇండియన్ టూ వీలర్ల తయారీ దిగ్గజం బజాజ్ ఆటో తమ డామినర్ 400 బైకు మీద మరోసారి ధరలు పెంచింది. బజాజ్ తాజాగా చేపట్టిన ధరల పెంపులో భాగంగా డామినర్ 400 మీద రూ. 2,000 పెరిగింది. బజాజ్ చివరి సారిగా మే నెలలో డామినర్ ధరను పెంచింది. మూడు నెలల్లోపే మళ్లీ డామినర్ 400 మీద ధరల పెంపు చేపట్టింది.

బజాజ్ డామినర్ 400 మీద పెరిగిన ధరలు

బజాజ్ డామినర్ 400 మీద ధరలు పెరగడం ఈ ఏడాదిలో ఇది నాలుగవసారి మరియు బజాజ్ డామినర్ 400 విడుదలైనప్పటి నుండి తొమ్మిదిసార్లు ధరలు పెరిగాయి. బజాజ్ ఆటో డామినర్ 400 స్పోర్ట్స్ క్రూయిజర్ బైకును డిసెంబరు 2016లో విపణిలోకి లాంచ్ చేసింది.

బజాజ్ డామినర్ 400 మీద పెరిగిన ధరలు

తాజాగా జరిగిన ధరల పెంపు అనంతరం బజాజ్ డామినర్ 400 నాన్-ఏబిఎస్ వేరియంట్ ధర రూ. 1.48 లక్షలు చేరుకుంది. కాగా, ఏబీఎస్ వేరియంట్ ధర రూ. 1.62 లక్షలుగా ఉంది. రెండు ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఇవ్వబడ్డాయి.

బజాజ్ డామినర్ 400 మీద పెరిగిన ధరలు

బజాజ్ ఆటో డామినర్ 400 బైకును డిసెంబరు 2016లో రూ. 1.36 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్(ఢిల్లీ) ధరతో ప్రవేశపెట్టింది. బజాజ్ డామినర్ 400 విడుదలైనప్పటి నుండి దీని మీద ఏకంగా రూ. 12,000 మేర ధర పెరిగింది.

బజాజ్ డామినర్ 400 మీద పెరిగిన ధరలు

బజాజ్ ఈ ఏడాది ప్రారంభంలో డామినర్ 400 స్పోర్ట్స్ క్రూయిజర్ బైకును 2018 ఎడిషన్‌లో నూతన కలర్ స్కీమ్ మరియు గోల్డన్ కలర్ ఫినిషింగ్ గల అల్లాయ్ వీల్స్‌తో లాంచ్ చేసింది. మెకానికల్‌గా మరియు ఫీచర్ల పరంగా ఎలాంటి మార్పులు జరగలేదు.

బజాజ్ డామినర్ 400 మీద పెరిగిన ధరలు

సాకేతికంగా బజాజ్ డామినర్ 400 బైకులో కేటిఎమ్ నుండి సేకరించిన 373సీసీ కెపాసిటి గల సింగల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కలదు. స్లిప్పర్ క్లచ్ సహాయంతో వచ్చిన 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 34.5బిహెచ్‌పి పవర్ మరియు 35ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

బజాజ్ డామినర్ 400 మీద పెరిగిన ధరలు

బజాజ్ డామినర్ 400లో సస్పెన్షన్ పరంగా ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనో షాక్ అబ్జార్వర్ కలదు. బ్రేకింగ్ డ్యూటీ కోసం ఇరువైపులా డిస్క్ బ్రేకులు ఉన్నాయి. మెరుగైన బ్రేకింగ్ వ్యవస్థ కోసం ఆప్షనల్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కూడా అందిస్తోంది.

బజాజ్ డామినర్ 400 మీద పెరిగిన ధరలు

డామినర్ 400 బరువు 182 కిలోలుగా ఉంది మరియు ఇది గంటకు 145కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతుంది. ఎప్పటికప్పుడు ధరలు పెరుగుతున్నప్పటికీ బజాజ్ డామినర్ 400 ఇప్పటికీ అద్భుతమైన ధరకు విలువలు కలిగి ఉంది. దేశీయంగా నెలకు 10,000 యూనిట్లు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ కేవలం 1,000 యూనిట్లను మాత్రమే విక్రయిస్తోంది. కానీ పలు విదేశీ మార్కెట్లలో దీనికి అనూహ్యమైన ఆదరణ లభిస్తోంది.

బజాజ్ డామినర్ 400 మీద పెరిగిన ధరలు

డ్రైవ్‌‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

బజాజ్ ఆటో డామినర్ 400 మీద ఈ ఏడాది నాలుగవసారి ధరలు పెంచింది. ధరల పెంపుకు గల కారణాలను బజాజ్ వెల్లడించలేదు. ఈ ధరల పెంపు డామినర్ 400 సేల్స్ మీద పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. బజాజ్ డామినర్ 400 విపణిలో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ క్రూయిజర్ బైకులు మరియు మహంద్రా మోజో ఎక్స్‌టి300 మరియు యుటి300 మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

Most Read Articles

Read more on: #బజాజ్
English summary
Read In Telugu: Bajaj Dominar 400 Prices Increased — Fourth Price Hike In 2018
Story first published: Wednesday, July 11, 2018, 11:07 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X