విడుదలకు సిద్ధమవుతున్న బజాజ్ పల్సర్ 150 ఎబిఎస్ బైక్
బజాజ్ ఆటో విపణిలోకి తమ పాపులర్ మోటార్ సైకిల్ పల్సర్ 150 డిటిఎస్ఐ బైకును సరికొత్త వేరియంట్లో లాంచ్ చేయనుంది. ఈ నూతన వెర్షన్ బజాజ్ పల్సర్ 150 లో సింగల్ ఛానల్ ఎబిఎస్ బ్రేకులు వచ్చాయి. వీటితో పాటు అదనంగా పలు ఎక్ట్సీరియర్ అప్‌డేట్స్ జరిగాయి. ఎబిఎస్ అందుకున్న బజాజ్ పల్సర్ 150 డిటిఎస్ఐ ప్రారంభ ధర రూ. 85,000 లు ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)గా ఉండనుంది.

సరికొత్త బజాజ్ పల్సర్ 150 బైకులో రివైజ్ చేయబడిన గ్రాఫిక్స్, రెండుగా విభజించిన సీటు మరియు పిలియన్ గ్రాబ్ రెయిల్, పొడవాటి వీల్ బేస్, వెడల్పాటి టైర్లు ఇంకా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి.

ట్విన్ డిస్క్ బ్రేక్ వేరియంట్ బజాజ్ పల్సర్ 150 మూడు విభిన్న కలర్ కాంబినేషన్స్‌లో లభిస్తుంది. అవి, బ్లాక్ బ్లూ, బ్లాక్-రెడ్ మరియు బ్లాక్ క్రోమ్. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బజాజ్ ఆధీకృత డీలర్ల వద్ద బుకింగ్స్ ప్రారంభం అవ్వనుంది . కొన్న వెంటనే డెలివరీ కూడా ఇవ్వగలరు.

దేశవ్యాప్తంగా విక్రయించే 125సీసీ కంటే ఎక్కువ కెపాసిటి గల అన్ని టూ వీలర్లలో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్‌ను తప్పనిసరి చేయడానికి ముందే బజాజ్ ఆటో తమ పల్సర్ 150 బైకులో అదనంగా రియర్ డిస్క్ బ్రేక్ జోడించింది. కానీ ఇప్పుడు ఎబిఎస్ టెక్నలాజిని అందుకున్న కొత్త బైక్ 2019 మొదటి త్రైమాసిక అవధిలో విడుదల చేయనుంది.

సాంకేతికంగా బజాజ్ పల్సర్ 150 డిటిఎస్ఐ బైకులో 150సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే ఫోర్ స్ట్రోక్ సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 14పిఎస్ పవర్ మరియు 13.4ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

కొత్త బజాజ్ పల్సర్ 150 బైకులలో 230ఎంఎం రియర్ డిస్క్ బ్రేక్, మరియు 260ఏమేం ఫ్రమ్ట్ డిస్క్ బ్రేకులు అందించి ఇప్పుడు బైక్ రైడర్లకు ఎక్కువ సురక్షితను అందించటం కోసం సింగల్ ఛానల్ ఎబిఎస్ అందించింది.

ఎబిఎస్ పొందిన బజాజ్ పల్సర్ విడుదల అవ్వగానే మార్కెట్లో ఉన్న హోండా సిబి హార్నెట్ ఏబీఎన్, సుజుకి జిక్సర్ 160 ఏబీఎన్ మరియు మరిన్ని పల్సరి బైకుల అమ్మకాలు తక్కువ అవ్వచ్చు అని విపణుల అంచనా.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
ప్రస్తుతం మార్కెట్లో విడుద అవ్వడానికి సిద్ధపడుతున్న బజాజ్ పల్సర్ 150 ఎబిఎస్ బైకుకు చాలా నిరీక్షణ ఉండగా, మార్కెట్లో ఎబిఎస్ పొందిన బైకులకు డిమ్యాండ్చాలా ఉంది. ఈ నేపథ్యంలో బజాజ్ ఆటో సంస్థ తమ కొన్ని బైకులకు ఎబిఎస్ బ్రేకింగ్ సిస్టంను అందించే పనిలో ఉండగా, వేరే ద్విచక్ర వాహన తయారకులు సహా అదే పనిలో ఉన్నారు.
Source: Rushlane


Click it and Unblock the Notifications








