పల్సర్ 150 కంటే తక్కువ ధరలో పల్సర్ 150 క్లాసిక్ విడుదల

బజాజ్ ఆటో విపణిలోకి సరికొత్త పల్సర్ 150 క్లాసిక్ బైకును లాంచ్ చేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పల్సర్ 150 క్లాసిక్ ధర రెగ్యులర్ పల్సర్ 150 కంటే తక్కువగా ఉండటం. అవును, బజాజ్ పల్సర్ 150 క్లాసిక్ ధర ర

By Anil Kumar

బజాజ్ ఆటో విపణిలోకి సరికొత్త పల్సర్ 150 క్లాసిక్ బైకును లాంచ్ చేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పల్సర్ 150 క్లాసిక్ ధర రెగ్యులర్ పల్సర్ 150 కంటే తక్కువగా ఉండటం. అవును, బజాజ్ పల్సర్ 150 క్లాసిక్ ధర రూ. 67,437 ఎక్స్-షోరూమ్(ముంబాయ్)గా ఉంది.

బజాజ్ పల్సర్ 150 క్లాసిక్ విడుదల

పల్సర్ 150 బైకులో ఎన్నో ఫీచర్లు మరియు డిజైన్ అంశాలు ఈ పల్సర్ 150 క్లాసిక్‌లో రాలేదు. దాంతో తక్కువ ధరలో తీసుకురావడానికి సాధ్యమైంది. ప్రాథమిక డిజైన్ పరంగా రెండు బైకులు ఒకేలా ఉంటాయి. కానీ తక్కువ ధరలో అందించే ఉద్దేశ్యంతో క్లాసిక్ వేరియంట్‌ను ప్రవేశపెట్టినట్లు తెలిసింది.

బజాజ్ పల్సర్ 150 క్లాసిక్ విడుదల

బజాజ్ పల్సర్ 150 క్లాసిక్ బైకులో బాడీ గ్రాఫిక్స్, రియర్ డిస్క్ బ్రేక్, రెండుగా ఇవ్వబడిన సీటు మరియు ఫ్యూయల్ ట్యాంక్ ఇరువైపులా ఉన్న డీకాల్స్ మిస్సయ్యాయి.

బజాజ్ పల్సర్ 150 క్లాసిక్ విడుదల

బజాజ్ అతి త్వరలో పల్సర్ 150 బైకులో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్ అందించే అవకాశం ఉంది. కానీ, క్లాసిక్ వేరియంట్లో వచ్చే అవకాశం లేదు. అయితే ఏప్రిల్ 2019 నుండి ఏబిఎస్ ఫీచర్ తప్పనిసరి కానుండటంతో రెండింటిలో ఏబిఎస్ వచ్చే అవకాశం ఉంది.

బజాజ్ పల్సర్ 150 క్లాసిక్ విడుదల

బజాజ్ పల్సర్ 150 క్లాసిక్ బ్లాక్ కలర్‌లో మాత్రమే లభ్యం కానుంది. 2018 పల్సర్ 150 తరహాలోనే క్రాంకేస్, ఫ్రంట్ ఫోర్క్స్, చైన్ గార్డ్ మరియు అల్లాయ్ వీల్స్ కూడా బ్లాక్ ఫినిషింగ్‌లో ఉన్నాయి.

బజాజ్ పల్సర్ 150 క్లాసిక్ విడుదల

బజాజ్ పల్సర్ 150 క్లాసిక్ ఇప్పటికే డీలర్ల వద్ద పట్టుబడింది. డీలర్ల సమాచారం మేరకు, విక్రయాలు కూడా ప్రారంభమయ్యాయి. ఇదే విషయాన్ని బజాజ్ ఆటో మరికొన్ని వారాల్లో అధికారికంగా ప్రకటించనుంది.

బజాజ్ పల్సర్ 150 క్లాసిక్ విడుదల

బజాజ్ పల్సర్ 150 క్లాసిక్ బైకులో రెగ్యులర్ పల్సర్ 150లో ఉన్నటువంటి అదే 150సీసీ కెపాసిటి గల ఫోర్-స్ట్రోక్ సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది 8,000ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 14బిహెచ్‌పి పవర్ మరియు 6,000ఆర్‌పిఎమ్ వద్ద 13.4ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

బజాజ్ పల్సర్ 150 క్లాసిక్ విడుదల

పల్సర్ 150 క్లాసిక్ బైకులో 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ తప్పనిసరిగా రానుంది. లేటెస్ట్ వెర్షన్‌లో మల్టిపుల్ స్పార్క్ ప్లగ్స్ ఉంటాయి, ఇంజన్‌లో ట్విన్-స్పార్క్ ప్లగ్ హెడ్ ఉంది. ఫ్రంట్ వీల్‌కు డిస్క్ మరియు రియర్ వీల్‌కు డ్రమ్ బ్రేక్ ఉంది.

బజాజ్ పల్సర్ 150 క్లాసిక్ విడుదల

సస్పెన్షన్ పరంగా ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున గ్యాస్ ఛార్జ్‌డ్ ట్విన్ రియర్ షాక్ అబ్జార్వర్లు ఉన్నాయి. మరియు రెండు చక్రాలకు ట్యూబ్ లెస్ టైర్లు ఉన్నాయి.

బజాజ్ పల్సర్ 150 క్లాసిక్ విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ మార్కెట్లో అత్యంత సరసమైన 150సీసీ మోటార్ సైకిల్ అందించే ఉద్దేశ్యంతో బజాజ్ ఆటో తమ రెగ్యులర్ పల్సర్ 150లో పలు ఫీచర్లను తొలగించి క్లాసిక్ వేరియంట్లో భారతదేశపు చీపెస్ట్ 150సీసీ మోటార్‌సైకిల్‌గా లాంచ్ చేసింది.

Source: AutoCarIndia

More from DriveSpark

Article Published On: Wednesday, June 13, 2018, 10:37 [IST]
English summary
Read In Telugu: Bajaj Pulsar 150 Classic launched in India; Cheaper than 2018 Pulsar 150
Read more on: #బజాజ్
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+