బజాజ్ పల్సర్ 160ఎన్ఎస్ రియర్ డిస్క్ బ్రేక్ వేరియంట్ విడుదల: ధర ఎంతంటే..?

బజాజ్ ఆటో విపణిలోకి తమ ఎన్ఎస్160 బైకును రియర్ డిస్క్ బ్రేక్ వేరియంట్‌తో లాంచ్ చేసింది. బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 డ్యూయల్ డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 82,630 లుగా ఉంది. ఎన్ఎస్160 రెగ్యులర్ వేరియంట్ కంటే

By Anil Kumar

బజాజ్ ఆటో విపణిలోకి తమ ఎన్ఎస్160 బైకును రియర్ డిస్క్ బ్రేక్ వేరియంట్‌తో లాంచ్ చేసింది. బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 డ్యూయల్ డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 82,630 లుగా ఉంది. ఎన్ఎస్160 రెగ్యులర్ వేరియంట్ కంటే దీని ధర 2,000 రుపాయలు అధికంగా ఉంది.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 సింగల్ డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 80,500. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్(పూనే)గా ఉన్నాయి.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 రియర్ డిస్క్ బ్రేక్ వేరియంట్

బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 బైకులో అదనపు డిస్క్ బ్రేక్ జోడింపు మినహాయిస్తే, ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. పల్సర్ ఎన్ఎస్200 ప్రేరణతో వచ్చిన ఎన్ఎస్160 అదే అగ్రెసివ్ డిజైన్ మరియు స్పోర్టివ్ తత్వాన్ని కలిగి ఉంది.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 రియర్ డిస్క్ బ్రేక్ వేరియంట్

స్టీల్ ప్రీమియర్ ఫ్రేమ్ మరియు బాక్స్-సెక్షన్ స్వింగ్ఆర్మ్ మీద నిర్మించిన బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 బైకులో అవే మునుపటి హెడ్‌ల్యాంప్స్, ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, 12-లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, స్ల్పిట్ సీట్ మరియు టెయిల్ లైట్లు ఉన్నాయి.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 రియర్ డిస్క్ బ్రేక్ వేరియంట్

సాంకేతికంగా బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 బైకులో 160.3సీసీ కెపాసిటి గల ఆయిల్-కూల్డ్, సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 15.5బిహెచ్‌పి పవర్ మరియు 14.6ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 రియర్ డిస్క్ బ్రేక్ వేరియంట్

ఇందులో ఇరువైపులా 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. సస్పెన్షన్ పరంగా ముందు వైపున కన్వెన్షనల్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనోషాక్ అబ్జార్వర్ ఉన్నాయి. బ్రేకింగ్ విధులు నిర్వర్తించడానికి ముందు చక్రానికి 240ఎమ్ఎమ్ మరియు వెనుక చక్రానికి 230ఎమ్ఎమ్ డిస్క్ బ్రేకులు ఉన్నాయి.

సరికొత్త బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 రియర్ డిస్క్ బ్రేక్ వేరియంట్ ఇప్పటికే డీలర్ల వద్ద పట్టుబడింది. రియర్ డిస్క్ బ్రేక్ వేరియంట్‌ను రహస్యంగా చిత్రీకరించిన వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయ్యింది.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 రియర్ డిస్క్ బ్రేక్ వేరియంట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మెరుగైన బ్రేకింగ్ కోసం బజాజ్ తమ ఎన్ఎస్160 బైకులో ఫ్రంట్ డిస్క్ బ్రేకుతో పాటు రియర్ డిస్క్ బ్రేక్ కూడా జోడించింది. డ్యూయల్ డిస్క్ బ్రేకులున్న బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 ధర పరంగా విపణిలో ఉన్న సుజుకి జిక్సర్, టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 4వి మరియు హోండా సీబీ హార్నెట్ 160ఆర్ వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

Video Courtesy: Shivansh Batham

Most Read Articles

English summary
Read In Telugu: Bajaj Pulsar NS160 Now Available With Rear Disc Brakes; Priced At Rs 82,630
Story first published: Thursday, August 16, 2018, 9:42 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X