పల్సర్ ఎన్ఎస్160 బైకులో ఏబిఎస్ ప్రవేశపెడుతున్న బజాజ్

బజాజ్ ఆటో తమ పల్సర్ ఎన్ఎస్160 బైకులో సింగల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ ( ABS) టెక్నాలజీ అందించేందుకు సిద్దమవుతోంది. తాజాగా అందిన సమాచారం మేరకు, బజాజ్ ఆటో వచ్చే ఆక్టోబర్ 2018లో ఏబిఎస్ వెర్షన్

By Anil Kumar

బజాజ్ ఆటో తమ పల్సర్ ఎన్ఎస్160 బైకులో సింగల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ ( ABS) టెక్నాలజీ అందించేందుకు సిద్దమవుతోంది. తాజాగా అందిన సమాచారం మేరకు, బజాజ్ ఆటో వచ్చే ఆక్టోబర్ 2018లో ఏబిఎస్ వెర్షన్ పల్సర్ ఎన్ఎస్160 బైకును విడుదల చేయడానికి సన్నాహాలు ప్రారంభించినట్లు తెలిసింది.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 ఏబిఎస్

పల్సర్ ఎన్ఎస్160 బైకులో సింగల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ జోడించడం మినహాయిస్తే, డిజైన్ మరియు సాంకేతికంగా ఇందులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. అయితే, పగటి పూట వెలిగే ఎల్ఈడీ లైట్లు, నూతన బాడీ గ్రాఫిక్స్ మరియు పెయింట్ స్కీమ్ అందించే అవకాశం ఉంది.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 ఏబిఎస్

ప్రస్తుతం, బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 బైకు ప్రారంభ ధర రూ. 82,000 లు ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది. సింగల్-ఛానల్ ఏబిఎస్ పరిచయంతో దీని ధర రూ. 10,000 ల వరకు పెరిగే అవకాశం ఉంది.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 ఏబిఎస్

బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 బైకులో సాంకేతికంగా 160సీసీ కెపాసిటి గల ట్రిపుల్ స్పార్క్ ప్లగ్ ఇగ్నిషన్ టెక్నాలజీ, ఆయిల్ కూల్డ్, సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇంజన్ గరిష్టంగా 15.5బిహెచ్‌పి పవర్ మరియు 14.6ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 ఏబిఎస్

బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 ఏబిఎస్ వేరియంట్ పూర్తి స్థాయిలో విడుదలైతే, విపణిలో ఉన్న సుజుకి జిక్సర్ 160, యమహా ఎఫ్‌జడ్-ఎస్, టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 మరియు హోండా హార్నెట్ సిబి160ఆర్ వంటి మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 ఏబిఎస్

ఏప్రిల్ 2019 నుండి మార్కెట్లో ఉన్న అన్ని 125సీసీ మరియు దాని కంటే ఎక్కువ ఇంజన్ సామర్థ్యం ఉన్న టూ వీలర్లలో సింగల్-ఛానల్ ఏబిఎస్ టెక్నాలజీని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు, టూ వీలర్ల కంపెనీలు ఇప్పటి నుండే తమ అన్ని మోడళ్లలో (125సీసీ కంటే ఎక్కువ కెపాసిటి) ఏబిఎస్ ఫీచర్‌ను పరిచయం చేస్తున్నాయి.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 ఏబిఎస్

టూ వీలర్ల భద్రతలో ఏబిఎస్ అత్యంత కీలకమైన పరికరం. టూ వీలర్ల ప్రమాదాలను గణనీయంగా తగ్గించడంలో ఏబిఎస్ కీలకపాత్ర పోషిస్తుంది. అసలు ఏబిఎస్ అంటే ఏమిటి...? ఎలా పనిచేస్తుంది...? ఏబిఎస్ గురించి పూర్తి వివరాలు క్లుప్తంగా....

Source: MotorOctane

Most Read Articles

English summary
Read In Telugu: Bajaj Pulsar NS 160 with ABS: Coming soon
Story first published: Monday, July 30, 2018, 18:27 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X