బజాజ్ పల్సర్ సిరీస్ బైకుల రికార్డు సేల్స్

బజాజ్ టూ వీలర్ల సేల్స్ ఇప్పుడు సరికొత్త రికార్డులు సాధిస్తున్నాయి. అత్యుత్తమ నెలవారీ విక్రయాల్లో పల్సర్ రేంజ్ బైకుల సేల్స్ అనూహ్యంగా పెరిగాయి. గడిచిన మే 2018 నెలలో బజాజ్ పల్సర్ సిరీస్ బైకులు 70,000 సే

By Anil Kumar

బజాజ్ టూ వీలర్ల సేల్స్ ఇప్పుడు సరికొత్త రికార్డులు సాధిస్తున్నాయి. అత్యుత్తమ నెలవారీ విక్రయాల్లో పల్సర్ రేంజ్ బైకుల సేల్స్ అనూహ్యంగా పెరిగాయి. బజాజ్ పల్సర్ సిరీస్ బైకులు ప్రధానంగా ఇండియన్ కమ్యూటర్ మరియు ఎంట్రీ లెవల్ స్పోర్ట్ బైకుల సెగ్మెంట్లో ఉన్నాయి. గడిచిన మే 2018 నెలలో బజాజ్ పల్సర్ సిరీస్ బైకులు 70,000 సేల్స్ మైలురాయిని సాధించాయి.

బజాజ్ పల్సర్ సిరీస్ బైకుల రికార్డు సేల్స్

సుమారుగా కొన్ని సంవత్సరాల తరువాత ఈ తరహా ఫలితాలు సాధ్యమయ్యాయి. గత కొన్నేళ్లుగా పల్సర్ రేంజ్ బైకులు ఆశించిన ఫలితాలు సాధించలేదు. అయితే, ఇటీవల విడుదలైన పల్సర్ క్లాసిక్ 150 వేరియంట్ కారణంగా సేల్స్ అమాంతంగా పెరిగిపోయాయి.

బజాజ్ పల్సర్ సిరీస్ బైకుల రికార్డు సేల్స్

మే 2018లో బజాజ్ పల్సర్ 150 మోడల్ మాత్రమే 52,759 యూనిట్ల సేల్స్ జరిపింది. గత ఏడాది అదే నెలలో పల్సర్ 150 విక్రయాలతో పోల్చుకుంటే 46 శాతం వృద్దిని సాదించింది. అంతే కాకుండా, తాజా ఫలితాలు బజాజ్ పల్సర్ రేంజ్ రెండంకెల వృద్దిని సాధించింది.

బజాజ్ పల్సర్ సిరీస్ బైకుల రికార్డు సేల్స్

బజాజ్ పల్సర్ సిరీస్‌లో మొత్తం ఎనిమిది విభిన్న మోడళ్లను ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తోంది. ఇందులో, పల్సర్ 135ఎల్ఎస్, పల్సర్ క్లాసిక్, పల్సర్ స్టాండర్డ్ 150 మరియు పల్సర్ 200ఎఫ్. అదనంగా లిక్విడ్-కూల్డ్ ఎన్ఎస్160, ఫ్లాగ్‌షిప్ మోడళ్లయిన ఎన్ఎస్200 మరియు ఆర్ఎస్ మోటార్ సైకిళ్లు ఉన్నాయి.

బజాజ్ పల్సర్ బైకుల ధరల శ్రేణి రూ. 64,589 లతో (135ఎల్ఎస్ వేరియంట్) ప్రారంభమవుతుంది. పల్సర్ క్లాసిక్ 150 ధర దీని రూ. 3,000 మాత్రమే అధికం మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర గరిష్టంగా రూ. 67,437 లు ఎక్స్-షోరూమ్(ముంబాయ్)గా ఉన్నాయి.

బజాజ్ పల్సర్ సిరీస్ బైకుల రికార్డు సేల్స్

పల్సర్ 150 ధర క్లాసిక్ వేరియంట్ కంటే రూ. 6,000 అధికంగా ఉంది. ఇది స్టాండర్డ్ మరియు ట్విన్ డిస్క్ అనే రెండు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది. స్టాండర్డ్ వేరియంట్ పల్సర్ 150 బైకులో ముందు వైపున డిస్క్ మరియు వెనుక వైపున డ్రమ్ బ్రేక్ ఉంటుంది.

బజాజ్ పల్సర్ సిరీస్ బైకుల రికార్డు సేల్స్

బజాజ్ ప్లస్ ఫ్లాగ్‌షిప్ మోడల్ ఎన్ఎస్200 ప్రేరణతో ఎన్ఎస్160 బైకును కూడా పరిచయం చేసింది. లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌లో లభ్యమయ్యే పల్సర్ ఎన్ఎస్160 ప్రారంభ ధర రూ. 82,000 లుగా ఉంది. ఇదే శ్రేణిలో దీని తర్వాత ఉన్న మోడల్ పల్సర్ 180. దీని ధర ఎన్ఎస్160 కంటే కేవలం రూ. 1,000 లు మాత్రమే ఎక్కువ.

బజాజ్ పల్సర్ సిరీస్ బైకుల రికార్డు సేల్స్

బజాజ్ పల్సర్ శ్రేణిలో ఎక్కువ సామర్థ్యం ఉన్న ఇంజన్ గల మోడల్ 220ఎఫ్. సాంకేతికంగా ఇందులో 220సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు, దీని ప్రారంభ ధర రూ. 94,000 లు ఎక్స్-షోరూమ్(ముంబాయ్‌)గా ఉంది.

బజాజ్ పల్సర్ సిరీస్ బైకుల రికార్డు సేల్స్

వీటితో పాటు బజాజ్ పల్సర్ సిరీస్‌లో ఫ్లాగ్‌షిప్ మోడళ్లుగా ఎన్ఎస్200 మరియు ఆర్ఎస్200 బైకులను విక్రయిస్తోంది. రెండు బైకుల్లో కూడా 200సీసీ కెపాసిటి గల లిక్విడ్-కూల్డ్ పెట్రోల్ ఇంజన్‌లను అందించింది.

బజాజ్ పల్సర్ సిరీస్ బైకుల రికార్డు సేల్స్

బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 నాన్-ఏబిఎస్ వేరియంట్ ధర రూ. 98,000 లు మరియు ఆర్ఎస్200 వేరియంట్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో కూడా లభ్యమవుతోంది. పల్సర్ ఆర్ఎస్200 ప్రారంభ ధర రూ. 1.24 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉంది.

బజాజ్ పల్సర్ సిరీస్ బైకుల రికార్డు సేల్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

బజాజ్ ఆటో దేశీయంగా పరిచయం చేసిన పల్సర్ బ్రాండ్ మోడల్ కంపెనీకి భారీ విజయాన్ని సాధించిపెట్టింది. టూ వీలర్ల ఇండస్ట్రీలో పల్సర్ పేరు బాగా ప్రాచుర్యం పొందడంతో, ఎంట్రీ లెవల్ పర్ఫామెన్స్ మోటార్ సైకిళ్ల నుండి అత్యంత శక్తివంతమైన, ఖరీదైన ఫ్లాగ్‌షిప్ మోడళ్ల వరకు అన్ని రకాల కస్టమర్లను టార్గెట్ చేసుకుని బజాజ్ బ్రాండ్ పేరు క్రింద ఎన్నో ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. దీంతో పల్సర్ శ్రేణిలో అన్ని వేరియంట్ల నుండి లభిస్తున్న సేల్స్ బజాజ్‌కు అరుదైన రికార్డును సాధించిపెట్టాయి.

Most Read Articles

Read more on: #బజాజ్
English summary
Read In Telugu: Bajaj Pulsar Range Records Highest Sales Number In May 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X