మార్కెట్ నుండి తాత్కాలికంగా వైదొలగిన బజాజ్ వి12 బైకు

బజాజ్ ఆటో దేశీయ విపణిలో విక్రయిస్తున్న వి12 మోటార్ సైకిల్‌ను మార్కెట్ నుండి తొలగించింది. అయితే, ఈ తొలగింపు తాత్కాలికం మాత్రమేనని బజాజ్ ఆటో పేర్కొంది. తాజాగా అందిన రిపోర్ట్స్ మేరకు, కొన్ని నెలల తరువాత

By Anil Kumar

బజాజ్ ఆటో దేశీయ విపణిలో విక్రయిస్తున్న వి12 మోటార్ సైకిల్‌ను మార్కెట్ నుండి తొలగించింది. అయితే, ఈ తొలగింపు తాత్కాలికం మాత్రమేనని బజాజ్ ఆటో పేర్కొంది. తాజాగా అందిన రిపోర్ట్స్ మేరకు, కొన్ని నెలల తరువాత బజాజ్ వి12 మోటార్ సైకిల్ యథావిధిగా మార్కెట్లోకి మళ్లీ విడుదలవుతుందని తెలిసింది.

 బజాజ్ వి12 బైకు

2018 ప్రారంభం నుండి బజాజ్ వి12 సేల్స్ క్రమంగా పడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గడిచిన జనవరి 2018 నెలలో దేశవ్యాప్తంగా 1737 యూనిట్ల వి12 బైకులను విక్రయించగా, మే 2018లో ఒక్క వి12 బైకు కూడా అమ్ముడవ్వలేదు.

మార్కెట్ నుండి తాత్కాలికంగా వైదొలగిన బజాజ్ వి12 బైకు

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బజాజ్ డీలర్లు వి12 స్టాకు తెప్పించుకోవడం మానేశారు. అంతే కాకుండా, బజాజ్ వి12 బైకుల మీద బుకింగ్స్ స్వీకరించడానికి కూడా కొంత మంది డీలర్లు నిరాకరిస్తున్నారు. దీంతో బజాజ్ అతి కష్టం మీద వి12 బైకును తాత్కాలికంగా మార్కెట్ నుండి తొలగించింది.

మార్కెట్ నుండి తాత్కాలికంగా వైదొలగిన బజాజ్ వి12 బైకు

బజాజ్ వి12 విపణిలో ఉన్న డిస్కవర్ 125 మరియు వి15 బైకుల మధ్య స్థానాన్ని భర్తీ చేస్తుంది. డిస్కవర్ మరియు వి15 రెండు బైకులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అయితే, వి12 ఆశించిన సేల్స్ సాధించకపోవడమే కాకుండా, దీని మీద డిమాండ్ పూర్తిగా పడిపోయింది.

మార్కెట్ నుండి తాత్కాలికంగా వైదొలగిన బజాజ్ వి12 బైకు

బజాజా ఆటో ఐఎన్ఎస్ యుద్దనౌక లోహం నుండి వి సిరీస్ బైకులను రూపొందించింది. తొలుత వి15 బైకును ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రేరణతో తీసుకొచ్చి, దీనికి కొనసాగింపుగా గత ఏడాది వి12 బైకును లాంచ్ చేసింది. ఏదేమైనప్పటికీ, రెండు బైకులు కూడా డిజైన్ పరంగా ఒకేలా ఉన్నాయి.

మార్కెట్ నుండి తాత్కాలికంగా వైదొలగిన బజాజ్ వి12 బైకు

బజాజ్ వి12 బైకులో సాంకేతికంగా 124సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు, 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 10.5బిహెచ్‌పి పవర్ మరియు 10.9ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మార్కెట్ నుండి తాత్కాలికంగా వైదొలగిన బజాజ్ వి12 బైకు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

బజాజ్ ఆటో వి12 బైకును తాత్కాలికంగా మార్కెట్ నుండి తొలగించింది. మరికొన్ని నెలల్లో మార్కెట్లోకి మళ్లీ విడుదల చేస్తామని బజాజ్ ప్రకటించింది. బహుశా పలుమార్పలు చేర్పులతో, అదనపు ఫీచర్ల జోడింపుతో వి12 బైకును తిరిగి ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ, వి15 బైక్‌కు లభించిన ఆదరణ వి12కు లభించలేదు.

Most Read Articles

Read more on: #బజాజ్
English summary
Read In Telugu: Bajaj V12 Discontinued Temporarily — Will Be Back On Sale In A Few Months Time
Story first published: Thursday, July 5, 2018, 16:10 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X