హైదరాబాద్‌లో ప్రొడక్షన్ ప్లాంటు ఏర్పాటు చేయనున్న బెనెల్లీ

సూపర్ బైకుల సెగ్మెంట్లో గ్లోబల్ లీడర్ బెనెల్లీ హైదారాబాద్ సమీపంలో ప్రొడక్షన్ ప్లాంటు ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు, సోమవారం బెనెల్లీ ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.

By Anil Kumar

సూపర్ బైకుల సెగ్మెంట్లో గ్లోబల్ లీడర్ బెనెల్లీ హైదారాబాద్ సమీపంలో ప్రొడక్షన్ ప్లాంటు ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు, సోమవారం బెనెల్లీ ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. హైదరాబాదులో పూర్తి స్థాయిలో స్వదేశీయ తయారీ కేంద్రాన్ని నిర్మించడానికి బెనెల్లీ సంస్థ ముందుకొచ్చింది.

హైదరాబాద్‌కు బెనెల్లీ ప్రొడక్షన్ ప్లాంట్

ఇదే కార్యక్రమంలో ఇటాలియన్ మోటార్ సైకిల్ బ్రాండ్ ఇండియాలో తమ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు హైదరాబాద్‌కు చెందిన మహవీర్ యొక్క భాగస్వామ్యపు సంస్థ ఆదీశ్వర ఆటో రైడ్ ఇంటర్నేషనల్‌ (AARI)తో దేశీయ కార్యకలాపాల కోసం వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది.

హైదరాబాద్‌కు బెనెల్లీ ప్రొడక్షన్ ప్లాంట్

బెనెల్లీ టూ వీలర్స్ ప్రొడక్షన్ ప్లాంటును పోచం పల్లిలో ఏర్పాటు చేయడానికి కసరత్తులు ప్రారంభించారు. దీనిని రెండు దశల వారీగా నిర్మించనున్నారు. తొలి దశ క్రింద 3 ఎకరాల్లో నిర్మించనున్న ప్లాంటు యొక్క వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 7,000 నుండి 10,000 యూనిట్ల మధ్య ఉంటుంది.

హైదరాబాద్‌కు బెనెల్లీ ప్రొడక్షన్ ప్లాంట్

రెండవ దశ క్రింద సుమారుగా 20 ఎకరాల్లో నిర్మించనున్న ప్లాంటులో బెనెల్లీ టూ వీలర్ల తయారీకి సంభందించిన విడి భాగాలను పూర్తి స్థాయిలో ఇక్కడే ఉత్పత్తి చేయనున్నారు. దీంతో దిగుమతి ఖర్చులు తగ్గడంతో పాటు దేశీయ యువతకు ఉపాధి కల్పన జరుగుతుంది.

హైదరాబాద్‌కు బెనెల్లీ ప్రొడక్షన్ ప్లాంట్

హైదరాబాద్ కేంద్రంగా నిర్మిస్తున్న బెనెల్లీ తయారీ కేంద్రం ఏర్పాటు మరియు నిర్వహణ పనుల మొత్తాన్ని ఆదీశ్వర ఆటో రైడ్ ఇండియా మహవీర్ గ్రూప్ పర్యవేక్షించనుంది.

హైదరాబాద్‌కు బెనెల్లీ ప్రొడక్షన్ ప్లాంట్

సుమారుగా వందేళ్లకు పైగా చరిత్ర గల ఇటాలియన్ దిగ్గజం బెనెల్లీ గతంలో డిఎస్‌కె మోటోవీల్స్ భాగస్వామ్యంలో ఉండేది. డిఎస్‌కె ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఒడిదుడుకుల్లో కూరుకుపోయింది.

హైదరాబాద్‌కు బెనెల్లీ ప్రొడక్షన్ ప్లాంట్

గతం మిగిల్చిన నష్టాన్ని పూడ్చుకునేందుకు, పాత భాగస్వామికి వీడ్కోలు పలుకుతూ, దేశీయ మార్కెట్లో రాణించేందుకు వ్యూహాత్మక ప్రణాళికతో నూతన భాగస్వామితో జట్టు కట్టింది. అంతే కాకుండా, 2019 నాటికి ఇండియాలోకి 12 కొత్త మోడళ్లను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

హైదరాబాద్‌కు బెనెల్లీ ప్రొడక్షన్ ప్లాంట్

12 కొత్త మోడళ్లలో 7 ఉత్పత్తులను ఈ ఆర్థిక సంవత్సరంలోనే విడుదల చేయనుంది. అందులో, టీఆర్‌502 మరియు లియోన్సినో 500. అంతే కాకుండా, టిఎన్‍టి300, టిఎన్‌టి 302ఆర్ మరియు టిఎన్‌టి 600ఐ వంటి మోడళ్లను నూతన వెర్షన్‌లు ప్రధానంగా ఉన్నాయి.

హైదరాబాద్‌కు బెనెల్లీ ప్రొడక్షన్ ప్లాంట్

అంతర్జాతీయ అగ్రగామి స్పోర్ట్స్ మరియు పర్ఫామెన్స్ బైకుల తయారీ దిగ్గజం బెనెల్లీ ప్రపంచ వ్యాప్తంగా 60 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మోటార్ సైకిళ్లు, స్కూటర్లు మరియు ఎలక్ట్రిక్ టూ వీలర్ల వారీగా మొత్తం 200కు పైగా వేరియంట్లను విక్రయిస్తోంది.

హైదరాబాద్‌కు బెనెల్లీ ప్రొడక్షన్ ప్లాంట్

ఆదీశ్వర ఆటో రైడ్ ఇంటర్నేషనల్‌తో జరిగిన ఒప్పందం బెనెల్లీకి లాభదాయకమైన ఒప్పందం కానుంది. మహవీర్ గ్రూప్ గత 30 ఏళ్ల నుండి స్కోడా, మెర్సిడెస్ బెంజ్ మరియు ఇండియన్ మోటార్‍‌సైకిల్స్ వంటి దిగ్గజ సంస్థలకు అధీకృత డీలరుగా ఉంది.

హైదరాబాద్‌కు బెనెల్లీ ప్రొడక్షన్ ప్లాంట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

గత కొన్ని నెలలుగా కవాసకి, ట్రయంప్, హ్యార్లీ-డేవిడ్సన్ వంటి కంపెనీల నుండి బెనెల్లీ తీవ్ర పోటీని ఎదుర్కుంటోంది. తాజగా జరిగిన ఒప్పందంతో బెనెల్లీ దిగ్గజం మార్కెట్లో తన ప్రాబల్యాన్ని పెంచుకోవడం ఖాయం అని చెప్పవచ్చు. డీలర్‌షిప్ రంగంలో సుధీర్ఘ అనుభవం గల మహవీర్ గ్రూప్ మరియు బెనెల్లీతో జరిగిన పరస్పరం ఒప్పందం హైదరాబాద్‌కు తయారీ కేంద్రాన్ని తీసుకొచ్చింది.

Image Source: Overdrive

Most Read Articles

English summary
Read In Telugu: Benelli to set up manufacturing plant near Hyderabad
Story first published: Tuesday, August 7, 2018, 19:03 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X