రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350కి సవాల్ విసురుతున్న బెనెల్లీ ఇంపీరియలె 400

రాయల్ ఎన్ఫీల్డ్ దిగ్గజం ఇండియన్ మార్కెట్లోకి ఎలాంటి పోటీ లేకుండా రాణిస్తోంది. నిజంగా చెప్పాలంటే, ఖరీదైన మోటార్ సైకిళ్ల సెగ్మెంట్లో రాయల్ ఎన్ఫీల్డ్‌దే ఆధిపత్యం. అయితే, స్పోర్ట్ బైకులు తయయారీ దిగ్గజం బె

By Anil Kumar

రాయల్ ఎన్ఫీల్డ్ దిగ్గజం ఇండియన్ మార్కెట్లోకి ఎలాంటి పోటీ లేకుండా రాణిస్తోంది. నిజంగా చెప్పాలంటే, ఖరీదైన మోటార్ సైకిళ్ల సెగ్మెంట్లో రాయల్ ఎన్ఫీల్డ్‌దే ఆధిపత్యం. అయితే, స్పోర్ట్ బైకులు తయయారీ దిగ్గజం బెనెల్లీ రాయల్ ఎన్పీల్డ్ క్లాసిక్ 350 మోటార్ సైకిల్‌కు పోటీగా ఇంపీరియలె 400 అనే బైకును సిద్దం చేస్తోంది.

బెనెల్లీ ఇంపీరియలె 400 బైకు నిజంగానే రాయల్ ఎన్ఫీల్డ్‌కు పోటీనిస్తుందో... లేదో... చూద్దాం రండి...

బెనెల్లీ నుండి రాయల్ ఎన్ఫీల్డ్‌కు పోటీ: విడుదల వివరాలు

బెనెల్లీ గత ఏడాది ఇటలీలోని మిలాన్ నగరంలో జరిగిన 2017 ఐక్మా మోటార్ సైకిల్‌ షోలో బెనెల్లీ ఇంపీరియలె 400 రెట్రో-స్టైల్ క్రూయిజర్ బైకును ఆవిష్కరించింది. డ్యూయల్ డిస్క్ బ్రేకులు మరియు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లను తప్పనిసరి ఫీచర్లుగా పరిచయం చేసింది.

బెనెల్లీ నుండి రాయల్ ఎన్ఫీల్డ్‌కు పోటీ: విడుదల వివరాలు

పాత కాలం డిజైన్ అంశాలు మరియు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మేళవింపులతో వచ్చిన పర్ఫామెన్స్ క్రూయిజ్ బైకులకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇందుకు రాయల్ ఎన్ఫీల్డ్ మరియు యుఎమ్ మోటార్‌సైకిల్స్ కంపెనీల విక్రయాలే నిదర్శనం.

బెనెల్లీ నుండి రాయల్ ఎన్ఫీల్డ్‌కు పోటీ: విడుదల వివరాలు

ఇందుకు అనుగుణంగానే, బ్లాక్ అండ్ రెడ్ పెయింట్ స్కీమ్, గుండ్రటి ఆకారంలో ఉన్న హెడ్ ల్యాంప్, టు పీస్ సీటు, అనలాగ్ స్పీడో మీటర్, టాకో మీటర్ ఓడో మీటర్ మరియు ఫ్యూయల్ గేజ్ అదే విధంగా, ముందు 19 అంగుళాలు మరియు వెనుక 18 అంగుళాల ఫోక్స్ వీల్స్ ఉన్నాయి.

బెనెల్లీ నుండి రాయల్ ఎన్ఫీల్డ్‌కు పోటీ: విడుదల వివరాలు

బెనెల్లీ ఇంపీరియలె 400 బైకులో యూరో-IV ఉద్గార ప్రమాణాలను పాటించే శక్తివంతమైన 373.3సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఎస్ఓహెచ్‌సి పెట్రోల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 19బిహెచ్‌పి పవర్ మరియు 28ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

బెనెల్లీ నుండి రాయల్ ఎన్ఫీల్డ్‌కు పోటీ: విడుదల వివరాలు

అత్యుత్తమ సస్పెన్షన్ కోసం ముందువైపున 41ఎమ్ఎమ్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున ట్విన్ షాక్ అబ్జార్వర్లు ఉన్నాయి. సమర్థవంతమైన బ్రేకింగ్ వ్యవస్థ కోసం ముందు వైపు 300ఎమ్ఎమ్ మరియు వెనుక వైపు 240ఎమ్ఎమ్ డిస్క్ బ్రేకులు ఉన్నాయి.

బెనెల్లీ నుండి రాయల్ ఎన్ఫీల్డ్‌కు పోటీ: విడుదల వివరాలు

బెనెల్లీ ఇంపీరియలె 400 బైకు బరువు మొత్తం 200కిలోలుగా ఉంది మరియు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటి 12-లీటర్లుగా ఉంది. భద్రత పరంగా డ్యూయల్ ఛానల్ యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్ కలదు. క్రూయిజర్ బైకు తరహా ఇరువైపులా లగేజ్ బ్యాగులున్నాయి.

బెనెల్లీ నుండి రాయల్ ఎన్ఫీల్డ్‌కు పోటీ: విడుదల వివరాలు

ఇండియన్ మార్కెట్లో విడుదలకు సిద్దమవుతున్న బెనెల్లీ ఇంపీరియలె 400 బైక్ డిజైన్ మరియు ఫీచర్లను గమనిస్తే విపణిలో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ 350 క్లాసిక్ మోటార్ సైకిల్ నోరు మూయించడం ఖాయమనిపిస్తోంది. టెక్నాలజీ పరంగా పోల్చుకుంటే ఇంపీరియలె 400 బైకులో అతి ముఖ్యమైన ఫ్యూయల్ ఇంజెక్షన్ మరియు ఏబిఎస్ ఫీచర్లు ఉన్నాయి.

బెనెల్లీ నుండి రాయల్ ఎన్ఫీల్డ్‌కు పోటీ: విడుదల వివరాలు

రాయల్ ఎన్ఫీల్డ్ విషయానికి వస్తే, దేశవ్యాప్తంగా అత్యుత్తమ డీలర్‌షిప్ నెట్‌వర్క్, మరియు రెట్రో స్టైల్ మోటార్ సైకిళ్ల విపణిలో అపారమైన అనుభవం గడించింది. అయితే, ఎన్ఫీల్డ్ మోటార్ సైకిళ్ల పట్ల సంతృప్తి చెందిన కస్టమర్లు ఏ మేరకు ఉన్నారో అసంతృప్తి చెందిన కస్టమర్లు కూడా అదే సంఖ్యలో ఉన్నారు.

బెనెల్లీ ఇంపీరియలె 400 మరియు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మోటార్ సైకిళ్లలో ఏది బెస్ట్ అంటారు...? క్రింది కామెంట్ బాక్స్ ద్వారా మాతో పంచుకోండి.

Most Read Articles

English summary
Read In Telugu: Benelli India to launch a Royal Enfield rival motorcycle next year – Imperiale 400
Story first published: Wednesday, August 8, 2018, 15:51 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X