అడ్డంగా దొరికిపోయిన బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్: ఎంట్రీ లైవల్ బైకుల విడుదలకు సర్వం సిద్దం

By Anil Kumar

ఇండియన్ మార్కెట్లో బిఎమ్‌డబ్ల్యూ డి310 ఆర్ మరియు జి310 జిఎస్ బైకులు విడుదలకు ఎంతగానో ఎదురుచూస్తున్నాయి. బిఎమ‌డబ్ల్యూ మోటోరాడ్ ఈ రెండు మోటార్ సైకిళ్లను ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ వేదికగా జరిగిన ఆటో ఎక్స్ 2018లో ఆవిష్కరించింది. అయితే తాజాగా, బిఎమ్‌డబ్ల్యూ జి 310 జిఎస్ బైకు మొదటిసారి అత్యంత రహస్యంగా పట్టుబడింది. ఈ వార్త బిఎమ్‌‍డబ్ల్యూ జి310 సిరీస్ బైకుల కోసం ఎదురుచూస్తున్న ఔత్సాహికుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపింది.

అడ్డంగా దొరికిపోయిన బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్: ఎంట్రీ లైవల్ బైకుల విడుదలకు సర్వం సిద్దం

చెన్నై-బెంగళూరు జాతీయ రహదారి మీద ఓ చిన్న బ్యాచ్ బిఎమ్‌డబ్ల్యూ జి310 జిఎస్ బైకులను తరలిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మరికొన్ని నెలల్లో బిఎమ్‌‌డబ్ల్యూ తమ జి310 ఆర్ మరియు జి310 జిఎస్ బైకులను విడుదల చేయడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది.

అడ్డంగా దొరికిపోయిన బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్: ఎంట్రీ లైవల్ బైకుల విడుదలకు సర్వం సిద్దం

బిఎమ్‌బ్ల్యూ మోటోరాడ్ ఇప్పటికే ఇండియాలోని టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రొడక్షన్ ప్లాంటులో జి310 ఆర్ మరియు జి310 జిఎస్ బైకుల ఉత్పత్తిని ప్రారంభించింది. వీటిలో జి310 ఆర్ నేక్డ్ స్ట్రీట్ ఫైటర్ కాగా, జి 310 జిఎస్ అడ్వెంచర్ మోటార్ సైకిల్. ఇండియాలో తయారవుతున్న వీటిని విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేస్తోంది.

అడ్డంగా దొరికిపోయిన బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్: ఎంట్రీ లైవల్ బైకుల విడుదలకు సర్వం సిద్దం

బిఎమ్‌డబ్ల్యూ జి310 జిఎస్ బైకులో సాంకేతికంగా 313సీసీ కెపాసిటి గల లిక్విడ్-కూల్డ్ సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 33.5బిహెచ్‌పి పవర్ మరియు 28ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

అడ్డంగా దొరికిపోయిన బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్: ఎంట్రీ లైవల్ బైకుల విడుదలకు సర్వం సిద్దం

టీవీఎస్ మోటార్ కంపెనీ ఇటీవల లాంచ్ చేసిన టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310 బైకులో కూడా ఇదే ఇంజన్ కలదు. అదే విధంగా జి310 ఆర్ బైకులో ఇవే మెకానికల్ విడి భాగాలు ఉన్నాయి.

అడ్డంగా దొరికిపోయిన బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్: ఎంట్రీ లైవల్ బైకుల విడుదలకు సర్వం సిద్దం

బిఎమ్‌డ‌బ్ల్యూ జి310 జిఎస్ బైకులో ముందు వైపున అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స మరియు వెనుక వైపున మోనోషాక్ అబ్జార్వర్ కలదు. బ్రేకింగ్ విధుల కోసం ఇరువైపులా డిస్క్ బ్రేకులు ఉన్నాయి. డ్యూయల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్‌ ఇందులో తప్పనిసరిగా వచ్చింది. ఈ రెండు బైకుల్లో కూడా స్పోక్ వీల్స్ కూడా అల్లాయ్ వీల్స్ వచ్చాయి.

అడ్డంగా దొరికిపోయిన బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్: ఎంట్రీ లైవల్ బైకుల విడుదలకు సర్వం సిద్దం

సాంకేతికంగా జిఎమ్‌డబ్ల్యూ జి310 జిఎస్‌లో ఉన్న అదే ఇంజన్ మరియు ఇతర విడి భాగాలను నేక్డ్ వెర్షన్ జి310 ఆర్ పంచుకుంది. అయితే, అడ్వెంచర్ వెర్షన్ కావడంతో ఆఫ్ రోడింగ్ కోసం సాఫ్టర్ సెటప్ ఉన్న పొడవాటి ట్రావెల్ గల సస్పెన్షన్ సిస్టమ్ ఉంది. జి310 ఆర్ మరియు జి310 జిఎస్ బైకులను పూర్తి స్థాయిలో దేశీయంగానే ఉత్పత్తి చేస్తోంది కాబట్టి ధరలను అత్యంత పోటీతత్వంగా నిర్ణయించనుంది.

అడ్డంగా దొరికిపోయిన బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్: ఎంట్రీ లైవల్ బైకుల విడుదలకు సర్వం సిద్దం

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ మార్కెట్లోకి బిఎమ్‌డబ్ల్యూ జి310 జిఎస్ మోటార్ సైకిల్ రాక అత్యంత కీలకంగా మారింది. 300సీసీ సెగ్మెంట్లో ఇప్పటి వరకు పెద్దగా చెప్పుకోదగిన అడ్వెంచర్ మోటార్ సైకిల్ రాలేదు. ఇప్పుడిప్పుడే రైడింగ్ నేర్చుకున్న మరియు ఖరీదైన మోటార్ సైకిళ్లను ఎంచుకోవాలనుకునే రైడర్లకు జి310 జిఎస్ సరైన ఎంపిక అని చెప్పవచ్చు. బిఎమ్‌డబ్ల్యూ జి310 జిఎస్ ధర సుమారుగా రూ. 3 లక్షల నుండి రూ. 3.5 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్ మధ్య ఉండే అవకాశం ఉంది.

Source: xBhp

Article Published On: Monday, May 14, 2018, 12:58 [IST]
English summary
Read In Telugu: BMW G 310 GS Spotted In India — Launch Imminent?
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+