బిఎమ్‌డబ్ల్యూ జి310 బైకుల మీద బుకింగ్స్ ప్రారంభం

By Anil Kumar

బిఎమ్‍‌డబ్ల్యూ మోటోరాడ్ ఇండియా యొక్క అత్యంత సరసమైన మోటార్‌సైకిళ్లు విడుదలకు సిద్దమయ్యాయి. 300సీసీ సెగ్మెంట్లోకి విడుదల కానున్న బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్ మరియు బిఎమ్‌డబ్ల్యూ జి310 జిఎస్ బైకుల మీద జూన్ 08, 2018 నుండి ముందస్తు బుకింగ్స్ ప్రారంభించనుంది.

బిఎమ్‌డబ్ల్యూ జి310 బైకుల మీద బుకింగ్స్ ప్రారంభం

బిఎమ్‌డబ్ల్యూ ఇండియన్ మార్కెట్లోకి తమ అత్యంత సరసమైన 310సీసీ కెపాసిటి గల మోటార్ సైకిళ్లను పరిచయం చేయనున్నట్లు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. 300సీసీ విభాగంలోకి వస్తుండటంతో దేశవ్యాప్తంగా ఎంతో మంది ఔత్సాహికులకు ఈ బైకుల విడుదల ఎప్పుడెప్పుడా అని ఎదురు చూశారు. అయితే, ఎట్టకేలకు బిఎమ్‌డబ్ల్యూ 310 బైకుల విడుదల ఖరారు చేసి శుభవార్తను ప్రకటించింది.

బిఎమ్‌డబ్ల్యూ జి310 బైకుల మీద బుకింగ్స్ ప్రారంభం

ప్రస్తుతానికి జి 310ఆర్ మరియు జి310 జిఎస్ బైకుల విడుదలకు సంభందించి ఖచ్చితమైన వివరాలను బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ ఇంకా ప్రకటించలేదు. కానీ వీటి కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న మరియు ఔత్సాహిక కొనుగోలుదారుల కోసం వీటి మీద ముందస్తు బుకింగ్స్ శురు చేసింది.

బిఎమ్‌డబ్ల్యూ జి310 బైకుల మీద బుకింగ్స్ ప్రారంభం

బిఎమ్‌డబ్ల్యూ జి 310ఆర్ అడ్వెంచర్ మోటార్ సైకిల్ మరియు బిఎమ్‌డబ్ల్యూ జి310 జిఎస్ నేక్డ్ స్ట్రీట్ ఫైటర్ మోటార్ సైకిల్. అయితే, రెండింటిని ఒకే ఫ్లాట్‌ఫామ్ మీదా ఒకే సాంకేతిక అంశాలతో నిర్మించింది.

బిఎమ్‌డబ్ల్యూ జి310 బైకుల మీద బుకింగ్స్ ప్రారంభం

సాంకేతికంగా బిఎమ్‌డబ్ల్యూ 310 సిరీస్ బైకుల్లో 313సీసీ కెపాసిటి గల లిక్విడ్-కూల్డ్ సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 33.5బిహెచ్‍‌‌‌పి పవర్ మరియు 28ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

బిఎమ్‌డబ్ల్యూ జి310 బైకుల మీద బుకింగ్స్ ప్రారంభం

బిఎమ్‌డబ్ల్యూ తొలుత జి310 ఆర్ బైకును 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ఆవిష్కరించింది. అప్పుడే దీని విడుదల కావాల్సి ఉండగా, రెండేళ్ల ఆలస్యం తరువాత ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 2018 ఆటో ఎక్స్ పోలో జి310 జిఎస్ బైకును ఆవిష్కరించింది. అయితే ఈ రెండింటి విడుదల మరికొన్ని నెలల్లోనే ఉంటుందని బిఎమ్‌డబ్ల్యూ మాటిచ్చింది.

బిఎమ్‌డబ్ల్యూ జి310 బైకుల మీద బుకింగ్స్ ప్రారంభం

బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పవా మాట్లాడుతూ, "ఎంతగానో ఎదురుచూస్తున్న బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్ మరియు జి310 జిఎస్ బైకులు విడుదలవ్వడమే కాకుండా, ఈ సెగ్మెంట్‌కు ఒక కొత్త నిర్వచనాన్నిస్తుందని చెప్పుకొచ్చాడు. అదే విధంగా ఇండియన్ రోడ్లకు అనుగుణంగా ధరకు తగ్గ విలువలతో అత్యంత పోటీతత్వమున్న ధరలతో వస్తున్నట్లు తెలిపాడు."

బిఎమ్‌డబ్ల్యూ జి310 బైకుల మీద బుకింగ్స్ ప్రారంభం

"ఇక మీదట నిరీక్షణ స్వస్తి పలికి, ఔత్సాహిక కస్టమర్లు తమకు నచ్చిన మోడల్‌ను ముందస్తు బుకింగ్స్ ద్వారా ఎంచుకునే అవకాశాన్ని కల్పించాము. ప్రపంచలో మరే కంపెనీకి సాధ్యం కాని విధంగా ఇండియన్ టూ వీలర్ల మార్కెట్లో బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్ మరియు జి310 జిఎస్ మోటార్ సైకిళ్ల సక్సెస్ ఒక కొత్త అధ్యయనాన్ని లిఖిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశాడు."

బిఎమ్‌డబ్ల్యూ జి310 బైకుల మీద బుకింగ్స్ ప్రారంభం

బిఎమ్‌డబ్ల్యూ తమ రెండు జి310 బైకులను హోసూర్ లోని టీవీఎస్ మోటార్ కంపెనీ ప్లాంటులో ఉత్పత్తి చేస్తుంది. ఇప్పటికే, విదేశీ మార్కెట్లకు ఎగుమతవుతున్న బిఎమ్‌డబ్ల్యూ జి310 సిరీస్ బైకులనే ఇక్కడే ఉత్పత్తి చేస్తోంది.

బిఎమ్‌డబ్ల్యూ జి310 బైకుల మీద బుకింగ్స్ ప్రారంభం

బిఎమ్‌డబ్ల్యూ తమ జి310 సిరీస్ బైకుల ధరల వివరాలను వెల్లడించలేదు. కానీ, ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు, జి310 ఆర్ ధర రూ. 3 లక్షలు మరియు జి310 జిఎస్ ధర రూ. 3.5 లక్షలు ఉండే అవకాశం ఉంది.

బిఎమ్‌డబ్ల్యూ జి310 బైకుల మీద బుకింగ్స్ ప్రారంభం

బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్ మరియు జి310 జిఎస్ బైకులు పూర్తి స్థాయిలో మార్కెట్లోకి విడుదలైతే, విపణిలో ఉన్న కెటిఎమ్ డ్యూక్ 390 మరియు యమహా వైజడ్ఎఫ్ ఆర్3 మరియు టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310 మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది.

బిఎమ్‌డబ్ల్యూ జి310 బైకుల మీద బుకింగ్స్ ప్రారంభం

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ ఎట్టకేలకు తమ జి310 ఆర్ మరియు జి310 జిఎస్ బైకుల మీద బుకింగ్స్ ప్రారంభించి కస్టమర్ల నిరీక్షణకు తెరదించింది. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీలేకుండా ఉన్నతమైన విలువలతో తమ ఉత్పత్తులను తయారు చేసే సంస్థగా పేరుగాంచిన బిఎమ్‌డబ్ల్యూ ఈ రెండు బైకులను ఎలాంటి ధరలతో లాంచ్ చేస్తుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

బిఎమ్‌డబ్ల్యూ జి310 బైకుల మీద బుకింగ్స్ ప్రారంభం

ఈ రెండు మోటర్ సైకిళ్లు కూడా అంతర్జాతీయ విపణిలో లభిస్తున్నాయి. బిఎమ్‌‌డబ్ల్యూ వీటిని అత్యుత్తమ ప్రమణాలతో నిర్మిస్తోంది. కాబట్టి, దేశీయంగా ఈ సెగ్మెంట్లో ఉన్న పోటీని ఎదుర్కునే సత్తా వీటికి ఉంది. కానీ ఇదంతా బిఎమ్‌డబ్ల్యూ తమ రెండు మోటార్ సైకిళ్ల మీద నిర్ణయించే ధరల మీద ఆధారపడి ఉంది.

Most Read Articles

English summary
Read In Telugu: BMW G 310 R and G 310 GS Bookings Open - The Much-Awaited Motorcycles Are Finally Here
Story first published: Thursday, June 7, 2018, 13:02 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X