బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్ & జి310 జిఎస్ విడుదల మరియు బుకింగ్ వివరాలు

By Anil Kumar

జర్మనీకి చెందిన ఖరీదైన మోటార్ సైకిళ్ల తయారీ దిగ్గజం బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ ఇండియాలో విడుదలకు ఎంతగానో ఎదుచూస్తున్న జి310 ఆర్ మరియు జి310 జిఎస్ మోటార్ సైకిళ్ల విడుదలను ఖరారు చేసింది.

బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్ & జి310 జిఎస్

తాజాగా అందిన సమాచారం మేరకు, బిఎమ్‌డబ్ల్యూ ఈ రెండు ఎంట్రీ లెవల్ బైకులను జూలై 18, 2018న అధికారికంగా లాంచ్ చేయనుంది మరియు జూన్ 8, 2018 నుండి బుకింగ్స్ ప్రారంభిస్తున్నట్లు సమాచారం.

బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్ & జి310 జిఎస్

ఒకే విధమైన ఇంజన్ విడి భాగాలు మరియు ఒకే ఫ్లాట్‌ఫామ్ మీద జి310 ఆర్ నేక్డ్ మోటార్ సైకిల్ మరియు జి310 జిఎస్ అడ్వెంచర్ మోటార్ సైకిళ్లను నిర్మించింది. జి310 ఆర్ బైకును తొలుత 2016 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించగా, జి310 జిఎస్ బైకును ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 2018 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించారు.

బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్ & జి310 జిఎస్

సుమారుగా రెండు మూడేళ్ల నిరీక్షణ అనంతరం ఈ రెండు బైకుల విడుదలకు మార్గం సుగమం అయ్యింది. వీటి విడుదల ఆలస్యమవడానికి గల ప్రధాన కారణం డీలర్‌షిప్ నెట్‌వర్క్ అని తెలిసింది. అవును, 310సీస ఇంజన్‌తో వచ్చిన ఈ రెండు బైకులను లాంచ్ చేయడానికి విసృతమైన డీలర్ల సామ్రాజ్యం ఉండాలని బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ భావించింది.

బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్ & జి310 జిఎస్

బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్ మరియు జి310 జిఎస్ రెండు బైకుల్లో కూడా 313సీసీ కెపాసిటి గల సింగల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 33.5బిహెచ్‌పి పవర్ మరియు 28ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. టీవీఎస్ మోటార్ కంపెనీ లాంచ్ చేసిన అపాచే ఆర్ఆర్310 బైకులో ఈ ఇంజన్ గుర్తించవచ్చు.

బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్ & జి310 జిఎస్

బిఎమ్‌డబ్ల్యూ మరియు టీవీఎస్ ఉమ్మడి భాగస్వామ్యంతో అభివృద్ది చేసిన జి310 ఆర్ మరియు జి310 జిఎస్ రెండు బైకులను కూడా హోసూర్‌లోని టీవీఎస్ ప్రొడక్షన్ ప్లాంటులో ఉత్పత్తి చేస్తున్నారు. ఇండియాలో బిఎమ్‌డబ్ల్యూ బ్రాండు పేరుతో తయారవుతున్న ఈ రెండు బైకులు కూడా ఇప్పటికే పలు అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి అవుతున్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్ & జి310 జిఎస్

బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్ మరియు జి310 జిఎస్ రెండింటిలో కూడా అత్యంత ఖరీదైన విడి పరికరాలను అందించారు. ముందు వైపున అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనోషాక్ సస్పెన్షన్ కలదు.

బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్ & జి310 జిఎస్

బ్రేకింగ్ డ్యూటీ కోసం ఇరు వైపులా డిస్క్ బ్రేకులు అందించారు, సురక్షితమైన బ్రేకింగ్ కోసం యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను తప్పనిసరి ఫీచర్‌గా అందివ్వడం జరిగింది. రెండు బైకుల్లోని ఇంజన్ మరియు సస్పెన్షన్ సిస్టమ్‌ను ఆయా బైకుల లక్షణాలకు అనుగుణంగా తీర్చిదిద్దారు.

బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్ & జి310 జిఎస్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్ మరియు జి310 జిఎస్ బైకులు ఇండియాలో విడుదలకు ఎంతగానో ఎదురుచూస్తున్నాయి. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఎట్టకేలకు వీటి విడుదలకు బిఎమ్‌డబ్ల్యూ సిద్దమైంది. అయితే, అత్యంత కీలకమైన ధరలను ఎలా నిర్ణయిస్తుందో వేచి చూడాలి మరి.

బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్ & జి310 జిఎస్

మా అంచనా ప్రకారం, బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్ ధర రూ. 2.8 లక్షలు మరియు జి310 జిఎస్ ధర రూ. 3.5 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఖరారు చేసే అవకాశం ఉంది. వీటిలో జి310 ఆర్ కెటిఎమ్ డ్యూక్ 390 మరియు జి310 జిఎస్ కెటిఎమ్ 390 అడ్వెంచర్ బైకులకు గట్టి పోటీనివ్వనుంది.

Source: CarandBike

Most Read Articles

English summary
Read In Telugu: BMW G 310 R And G 310 GS India Launch Date Revealed
Story first published: Wednesday, June 27, 2018, 9:43 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X