విపణిలోకి బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్ మరియు జి310 జిఎస్ బైకులు విడుదల

బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ నేడు ఇండియన్ మార్కెట్లోకి తమ అత్యంత సరసమైన రెండు మోటార్ సైకిళ్లను లాంచ్ చేసింది. సుమారుగా రెండేళ్ల పాటు ఊరించిన బిఎమ్‌డబ్ల్యూ ఎట్టకేలకు సరికొత్త జి310 ఆర్ మరియు జి310 జిఎస్ బైకు

By Anil Kumar

బిఎమ్‌డబ్ల్యూ టూ వీలర్ల్ విభాగం బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ నేడు ఇండియన్ మార్కెట్లోకి తమ అత్యంత సరసమైన రెండు మోటార్ సైకిళ్లను లాంచ్ చేసింది. సుమారుగా రెండేళ్ల పాటు ఊరించిన బిఎమ్‌డబ్ల్యూ ఎట్టకేలకు సరికొత్త జి310 ఆర్ మరియు జి310 జిఎస్ బైకులను విపణిలోకి పూర్తి స్థాయిలో విడుదల చేసింది.

బిఎమ్‌డబ్ల్యూ యొక్క చీపెస్ట్ మోటార్ సైకిళ్లు అయిన జి310 ట్విన్ బైకుల ధర, ఇంజన్, ఫీచర్లు మరియు వీటికిగా పోటీగా ఉన్న మోడళ్ల గురించి పూర్తి వివరాలు..

బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్ మరియు జి310 జిఎస్

బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్ మరియు జి310 జిఎస్ రెండు బైకులను కూడా ఏడాది ప్రారంభంలో ఢిల్లీ వేదికగా జరిగిన ఆటో ఎక్స్‌పో 2018లో ఆవిష్కరించింది. ఇండియన్ మోటార్ సైకిల్ ఔత్సాహికులు వీటి విడుదల కోసం ఎంతో కాలంగా ఎదురు చూశారు.

బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్ మరియు జి310 జిఎస్

ఎదురు చూపులకు ముగింపు పలుకుతూ విడుదలైన వీటి ధరలు..

  • బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్ - రూ. 2.99 లక్షలు
  • బిఎమ్‌డబ్ల్యూ జి310 జిఎస్ - రూ. 3.49 లక్షలు
  • ఈ రెండు బైకుల మీద ఇప్పటికే జూన్ 2018లో రూ. 50,000 లతో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.
    బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్ మరియు జి310 జిఎస్

    బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్ గురించి...

    బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ ఇండియన్ మార్కెట్లోకి తీసుకొచ్చిన అత్యంత సరసమైన నేక్ట్ మోటార్ సైకిల్ జి310 ఆర్. జి310 ఆర్ అదే విభిన్నమైన బిఎమ్‌డబ్ల్యూ డిజైన్ లక్షణాలను కలిగి ఉంది. బైకు ఓవరాల్ డిజైన్ బిఎమ్‌డబ్ల్యూ ఎస్ 1000ఆర్ ప్రేరణతో రూపొందించారు.

    బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్ మరియు జి310 జిఎస్

    బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్ బైకులో ముందు వైపున 41 ఎమ్ఎమ్ గోల్డెన్ అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్, 17-అంగుళాల 5-స్పోక్ క్యాస్ట్ అల్యూమినియం వీల్స్ మరియు అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ వంటివి ఉన్నాయి.

    బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్ మరియు జి310 జిఎస్

    ఫ్రంట్ అండ్ రియర్ సస్పెన్షన్ వరుసగా 140ఎమ్ఎమ్ మరియు 131ఎమ్ఎమ్ ట్రావెల్ కలిగి ఉన్నాయి. ముందు చక్రానికి 110/70 ఆర్17 మరియు వెనుక చక్రానికి 150/60 ఆర్17 కొలతల్లో ఉన్న టైర్లు ఉన్నాయి. బైకు మొత్తం బరువు 158.5కిలోలుగా ఉంది.

    బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్ మరియు జి310 జిఎస్

    బ్రేకింగ్ డ్యూటీ కోసం ఇందులో ముందు చక్రానికి 300ఎమ్ఎమ్ మరియు వెనుక చక్రానికి 200ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ అందించారు. మెరుగైన బ్రేకింగ్ వ్యవస్థ కోసం డ్యూయల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను స్టాండర్డ్ ఫీచర్‌గా అందివ్వడం జరిగింది.

    బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్ మరియు జి310 జిఎస్

    బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్ నేక్డ్ స్ట్రీట్ ఫైటర్ మూడు విభిన్న రంగుల్లో లభ్యమవుతోంది. అవి,

    • స్టైల్ HP (పర్ల్ వైట్ + HP అక్షరాలు),
    • కాస్మిక్ బ్లాక్,
    • రేసింగ్ రెడ్.
    • బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్ మరియు జి310 జిఎస్

      బిఎమ్‌డబ్ల్యూ జి310 జిఎస్ గురించి...

      ఇండియాలో అత్యంత సరసమైన ధరలో లభించే బ్రాండెడ్ అడ్వెంచర్ బిఎమ్‌డబ్ల్యూ జి310 జఎస్ అడ్వెంచర్ మోటార్ సైకిల్. జి310 జిఎస్ ఇంజన్, ఫీచర్లు మరెన్నో సాంకేతిక అంశాలను జి310 ఆర్ నుండి పంచుకుంది. కానీ అడ్వెంచర్ శైలిలో కనిపించేందుకు బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1200 జిఎస్ డిజైన్ శైలిలో ఆఫ్ రోడింగ్ లక్షణాలతో వచ్చింది.

      బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్ మరియు జి310 జిఎస్

      జి310 ఆర్ బైకుతో పోల్చుకుంటే బిఎమ్‌డబ్ల్యూ జి310 జిఎస్‌లో పొడవాటి బాడీ ఫెండర్స్ ఉన్నాయి. ఇంజన్‌ను రక్షించేందుకు బాష్ ప్లేట్, పై వైపుకు మళ్లించిన ఎగ్జాస్ట్ సిస్టమ్ మరియు పలు అడ్వెంచర్ డిజైన్ అంశాలు ఇందులో ఉన్నాయి.

      బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్ మరియు జి310 జిఎస్

      ఆఫ్ రోడింగ్ అవసరాల కోసం లగేజ్ ట్రాక్ జోడించారు. అదే విధంగా టాప్ బ్యాక్ బాక్స్‌ను ఆప్షనల్ ఫీచర్‌గా అందిస్తున్నారు. ముందు మరియు వెనుక వైపునున్న టైర్లు వరుసగా 110/80 మరియు 150/70 కొలతల్లో ఉన్నాయి.

      బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్ మరియు జి310 జిఎస్

      జి310 జిఎస్ బైకులో వీల్స్ కూడా పెద్దగానే ఉన్నాయి. ఫ్రంట్ వీల్ 19-అంగుళాల మరియు రియర్ 17-అంగుళాల కొలతల్లో ఉంది. ఇరువైపులా 180ఎమ్ఎమ్ ట్రావెల్ గల సస్పెన్షన్ సిస్టమ్ ఉంది జి310 జిఎస్ బరువు 169.5 కిలోలు, ఇది జి310 ఆర్ కంటే ఎక్కువ.

      బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్ మరియు జి310 జిఎస్

      బిఎమ్‌డబ్ల్యూ జి 310 జిఎస్ కూడా మూడు విభిన్న కలర్ ఆప్షన్‌లలో లభ్యమవుతాయి. అవి,

      • రేసింగ్ రెడ్,
      • పర్ల్ వైట్ మెటాలిక్,
      • కాస్మిక్ బ్లూ.
      • బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్ మరియు జి310 జిఎస్

        ఇంజన్ స్పెసిఫికేషన్స్

        బిఎమ్‌‌డబ్ల్యూ జి310 ఆర్ మరియు జి310 జిఎస్ రెండు బైకుల్లో కూడా 313సీసీ కెపాసిటి గల రివర్స్-ఇంక్లైన్డ్ సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. టీవీఎస్ అపాచే ఆర్ఆర్310 బైకులో కూడా ఇదే ఇంజన్ ఉంది. శక్తివంతమైన ఈ ఇంజన్ 9500ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 354బిహెచ్‌పి పవర్ మరియు 7500ఆర్‌పిఎమ్ వద్ద 28ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

        బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్ మరియు జి310 జిఎస్

        డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

        ముగింపుకు ఎట్టకేలకు తెర పడిందని బిఎమ్‌బ్ల్యూ మోటారాడ్ ఇండియా విభాగం పేర్కొంది. అవును, ఎంతగానో ఎదురు చూసిన బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్ మరియు జి310 జిఎస్ మోటార్ సైకిళ్లు ఎట్టకేలకు ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించాయి.

        మరి ఈ రెండింటిలో మీకు నచ్చిన మోడల్ ఏది...?

        జి310 ఆర్ (లేదా) జి310 జిఎస్

        ఈ బైకుల గురించి సందేహాలను క్రింది కామెంట్ బాక్సులో మాకు వ్రాయండి...

More from DriveSpark

Article Published On: Wednesday, July 18, 2018, 16:00 [IST]
English summary
Read In Telugu: BMW G 310 R And G 310 GS Launched In India; Prices Start At Rs 2.99 Lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+