ఇండియాలో విడుదలైన ఈ బైకు ధర వింటే అంబానీ కూడా షాక్ అవ్వాల్సిందే!!

బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ దేశీయ టూ వీలర్ల మార్కెట్లోకి రూ. 85 లక్షల ఖరీదైన బిఎఎమ్‌డబ్ల్యూ హెచ్‌పి4 రేస్ బైకును విడుదల చేసింది. ఇది కేవలం ఎక్స్-షోరూమ్ ధర మాత్రమే, ఆన్-రోడ్ ధర ఏకంగా కోటి రుపాయల పైమాటే...!

By Anil Kumar

కోట్లు విలువ చేసే కార్లు మార్కెట్లోకి విడుదలవుతున్నాయంటే నమ్మొచ్చు... కానీ దాదాపు కోటి రుపాయలు ఖరీదైన బైకు ఇండియాలో లాంచ్ అయ్యిందంటే చాలా మందికి నమ్మబుద్ది కాదు. అయిన్పపటికీ, ఇది నిజమేనండోయ్...!! బిఎమ్‌డబ్ల్యూ తాజాగా విడుదల చేసిన బైకు ధర చూస్తే... అంబానీ సైతం నోరెళ్లబెట్టాల్సిందే..!!

ఇండియాలో విడుదలైన ఈ బైకు ధర వింటే అంబానీ కూడా షాక్ అవ్వాల్సిందే!!

మీరు చదివింది అక్షరాల నిజమే... బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ దేశీయ టూ వీలర్ల మార్కెట్లోకి రూ. 85 లక్షల ఖరీదైన బిఎఎమ్‌డబ్ల్యూ హెచ్‌పి4 రేస్ బైకును విడుదల చేసింది. ఇది కేవలం ఎక్స్-షోరూమ్ ధర మాత్రమే, ఆన్-రోడ్ ధర ఏకంగా కోటి రుపాయల పైమాటే...!!

ఇండియాలో విడుదలైన ఈ బైకు ధర వింటే అంబానీ కూడా షాక్ అవ్వాల్సిందే!!

రహదారుల మీద తిరగడానికి పర్మిట్ లేని ట్రాక్-ఫోకస్డ్ మోటార్ సైకిల్‌ను బిఎమ్‌డబ్ల్యూ గత ఏడాది అంతర్జాతీయంగా ఆవిష్కరించింది. అయితే, ప్రపంచ వ్యాప్తంగా బిఎమ్‌డబ్ల్యూ హెచ్‌పి రేస్ బైకులను కేవలం 750 యూనిట్లుగా పరిమిత సంఖ్యలో మాత్రమే విక్రయించనుంది.

ఇండియాలో విడుదలైన ఈ బైకు ధర వింటే అంబానీ కూడా షాక్ అవ్వాల్సిందే!!

కార్బన్-ఫైబర్ మెటీరియల్ మెయిన్ ఫ్రేమ్‌తో వచ్చిన ప్రపంచపు మొట్టమొదటి బైకు ఇదే. సాధారణంగా మెటల్ ఫ్రేమ్ మీద కార్బన్ -ఫైబర్ డీకాల్స్ మరియు ఫెయిరింగ్ ఉంటుంది. కానీ ఇందులో మెయిన్ ఫ్రే‌మ్‌ను పూర్తిగా కార్బన్ ఫైబర్‌తో నిర్మించారు. ఈ ఫ్రేమ్ బరువు కేవలం 7.8 కిలోలు మాత్రమే.

ఇండియాలో విడుదలైన ఈ బైకు ధర వింటే అంబానీ కూడా షాక్ అవ్వాల్సిందే!!

అంతే కాకుండా బిఎమ్‌డబ్ల్యూ హెచ్‌పి4 రేస్ బైకులో ముందు మరియు వెనుక చక్రాలను కూడా పూర్తిగా కార్భన్-ఫైబర్‌తో రూపొందించారు. సాధారణమైన తేలికపాటి అల్లాయ్-ఫోర్జ్‌డ్ వీల్స్‌తో పోల్చుకుంటే మొత్తం బరువు 30 శాతం వరకు తగ్గించబడింది. బిఎమ్‌డబ్ల్యూ హెచ్‌పి4 రేస్ మోటార్‌సైకిల్ మొత్తం బరువు 171 కిలోలుగా ఉంది. సాధారణ మోటార్ సైకిల్‌తో పోల్చుకుంటే దీని బరువు 37 కిలోల వరకు తగ్గిపోయింది.

ఇండియాలో విడుదలైన ఈ బైకు ధర వింటే అంబానీ కూడా షాక్ అవ్వాల్సిందే!!

బిఎమ్‌డబ్ల్యూ హెచ్‌పి4 రేస్ బైకులో 999సీసీ కెపాసిటిగల నాలుగు సిలిండర్ల, ఇన్-లైన్, లిక్విడ్-కూల్డ్ పెట్రోల్ ఇంజన్ కలదు. స్ట్రైట్ కట్ గేర్లు గల 6-స్పీడ్ రేసింగ్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం ఉన్న ఇంజన్ 215బిహెచ్‌పి పవర్ మరియు 120ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ఇండియాలో విడుదలైన ఈ బైకు ధర వింటే అంబానీ కూడా షాక్ అవ్వాల్సిందే!!

సస్పెన్షన్ పరంగా ఇందులో ముందు వైపున ఓహ్లిన్స్ ఎఫ్‌జిఆర్ 300 అప్-సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున ఓహ్లిన్స్ టిటిఎక్స్ 36 జీపీ మోనోషాక్ అబ్జార్వర్ ఉంది. బిఎమ్‌డబ్ల్యూ హెచ్‌పి4 రేస్ బైకు 17-అంగుళాల చక్రాలు గల పిరెల్లీ డియాబ్లో సూపర్‌బైక్్ స్లిక్ ఎస్‌సి2 టైర్ల మీద పరుగులు పెడుతుంది.

ఇండియాలో విడుదలైన ఈ బైకు ధర వింటే అంబానీ కూడా షాక్ అవ్వాల్సిందే!!

బ్రేకింగ్ విధుల నిర్వర్తించడానికి ముందు వైపున బ్రెంబో 320x6.75mm (6.75mm డిస్క్ యొక్క మందం) డ్యూయల్ ఫ్లోటింగ్ డిస్క్ బ్రేకులు మరియు వెనుక వైపున 220x4.0mm డిస్క్ బ్రేకులు ఉన్నాయి.

ఇండియాలో విడుదలైన ఈ బైకు ధర వింటే అంబానీ కూడా షాక్ అవ్వాల్సిందే!!

బిఎమ్‌డబ్ల్యూ హెచ్‌‌పి4 రేస్ బైకులో ప్రపంచ స్థాయి విడి పరికరాలు ఉన్నాయి. అందులో కార్బన్ ఫైబర్ ఫెయిరింగ్, టైటానియంతో తయారు చేసిన అక్రపోవిక్ ఎగ్జాస్ట్ సిస్టమ్, అల్యూమినియం డబ్ల్యూఎస్‌బికె స్వింగ్ఆర్మ్, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ రీజనరేషన్, వీలీ కంట్రోల్, పిట్ లేన్ లిమిటర్, యాంటీ-హోపింగ్ క్లచ్ మరియు లాంచ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Most Read Articles

English summary
Read In Telugu: BMW HP4 Race Launched In India At Rs 85 Lakh — Limited To Just 750 Units Worldwide
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X