ఇక మీదట బైకులకు కూడా ఫ్యాన్సీ నెంబర్లు: ప్రారంభ ధర రూ. 15,000 లు

ఇక మీదట టూ వీలర్ ఓనర్లు తమకు నచ్చిన వీఐపి నెంబర్ ఎంచుకునే అవకాశం కల్పించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఒక కొత్త ప్రతిపాదనను సిద్దం చేసింది.

By Anil Kumar

ఇక మీదట టూ వీలర్ ఓనర్లు తమకు నచ్చిన వీఐపి నెంబర్ ఎంచుకునే అవకాశం కల్పించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఒక కొత్త ప్రతిపాదనను సిద్దం చేసింది.

టూ వీలర్లకు ఫ్యాన్సీ నెంబర్లు

కేంద్ర రాజధాని పరిధిలో టూ వీలర్ కస్టమర్లు తమకు నచ్చిన రిజిస్ట్రేన్ నెంబర్ ఎంచుకునే అవకాశాన్ని కల్పించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2017లోనే ఈ నియమాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రతిపాదనలు చేసింది.

టూ వీలర్లకు ఫ్యాన్సీ నెంబర్లు

ఈ ప్రతిపాదనలో భాగంగా, కొత్తగా టూ వీలర్‌ను కొనుగోలు చేసే కస్టమర్లు తమ టూ వీలర్‌కు కావాల్సిన వీఐపి రిజిస్ట్రేషన్ నెంబర్‌ను డీలర్ల వద్దే ఎంచుకునే అవకాశాన్ని కల్పించనుంది. ఈ పద్దతి పూర్తిగా అమల్లోకి వస్తే, కస్టమర్లు తమకు నచ్చిన ఫ్యాన్సీ నెంబరును అత్యంత సులభంగా ఎంచుకోవచ్చు.

టూ వీలర్లకు ఫ్యాన్సీ నెంబర్లు

కస్టమర్లు మే 2018 నుండి తమ వీఐపీ నెంబర్ ప్లేట్లను కొనుగోలు చేయవచ్చు. ముందుగా వచ్చిన వారికి, మొదటి అవకాశం క్రింద ఆన్‌లైన్ వేలం ప్రక్రియ ద్వారా నెంబర్లను విక్రయించనున్నారు. అతి త్వరలో వేలం విధానాన్ని కూడా ప్రారంభించనున్నారు.

టూ వీలర్లకు ఫ్యాన్సీ నెంబర్లు

టూ వీలర్స్ కోసం కేటాయించిన ప్రతి ఫ్యాన్సీ నెంబర్ కనీస ధరను రూ. 15,000 లుగా నిర్ణయించారు. 0001 వంటి నెంబర్లు యభైవేల రుపాయల ప్రారంభ ధరతో లభ్యమవుతాయి. అదే విధంగా 002 నుండి 0009 వరకు సుమారుగా 30 వేల ధరతో లభిస్తాయి.

టూ వీలర్లకు ఫ్యాన్సీ నెంబర్లు

అంతే కాకుండా కస్టమర్లు 1111, 9999, 7777, 0786, 8888 వంటి ఎన్నో నెంబర్లను రూ. 15,000 నుండి రూ. 20,000 మధ్య ధరతో ఎంచుకోవచ్చు. ఫ్యాన్సీ నెంబర్ ధరలను వేలం ప్రక్రియ ద్వారా మాత్రమే విక్రయిస్తారు. కాబట్టి, ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ల ధరలు పోటీని బట్టి ఇంకా పెరిగే అవకాశం ఉంది.

టూ వీలర్లకు ఫ్యాన్సీ నెంబర్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నెంబర్ కోసం వేలం ప్రక్రియలో పాల్గొనడం పెద్ద రిస్క్‌తో కూడుకున్నది, చాలా మంది కస్టమర్లు ఫ్యాన్సీ నెంబర్లను ఎంచుకోవడానికి పెద్దగా ఆసక్తికనబరచరు. అయితే, తమకు నచ్చిన వాహనాలకు అత్యంత అరుదైన నెంబర్ కోసం ఎంత డబ్బు అయినా వెచ్చించి దక్కించుకోవడానికి సిద్దంగా ఉన్నారు.

టూ వీలర్లకు ఫ్యాన్సీ నెంబర్లు

ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం టూ వీలర్లకు ఫ్యాన్సీ నెంబర్లను విక్రయించే పద్దతిని చట్టపరంగా అమల్లోకి తీసుకొచ్చింది. ఖరీదైన టూ వీలర్లను కొనే కస్టమర్లు మరియు సంఖ్యా బలాన్ని నమ్మే వ్యక్తులు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారు. ఈ టూ వీలర్లకు వేలం ద్వారా ఫ్యాన్సీ నెంబర్లను కేటాయించే విధానం సక్సెస్ అయితే, మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విధానాన్ని అమలు చేసే అవకాశం ఉంది.

టూ వీలర్లకు ఫ్యాన్సీ నెంబర్లు

1. మారుతి జిప్సీ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్ళతో పెకిలించిన టాటా సఫారీ స్టార్మ్

2.మారుతి సుజుకి తరువాత విడుదల చేసే కారు ఇదే

3.క్రెటాకు పోటీని సిద్దం చేసిన మహీంద్రా

4.హీరో ఎక్స్‌పల్స్ 200 అడ్వెంచర్ బైకు విడుదల ఖరారు

5.2018 ఇండియన్ స్కౌంట్ బాబర్ రివ్యూ: క్రూయిజర్ బైకులో గుడ్ ఏంటి? బ్యాడ్ ఏంటి?

Most Read Articles

English summary
Read In Telugu: Delhi To Offer Fancy Number Plates For Two-Wheelers — Prices Start From Rs 15,000
Story first published: Wednesday, April 18, 2018, 20:56 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X