అమెరికాను వీడుతున్న హ్యార్లీ-డేవిడ్సన్

హ్యార్లీ-డేవిడ్సన్ మెల్లమెల్లగా అమెరికాను వీడేందుకు ప్రయత్నిస్తోంది. దిగుమతి సుంకాల పెంపు అంశాన్ని లేవనెత్తిన ట్రంప్, పలు దేశాల నుండి దిగుమతి చేసుకునే ఉత్పత్తుల మీద ట్యాక్స్ విపరీతంగా పెంచేశాడు.

By Anil Kumar

ప్రపంచ దిగ్గజ దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ద నేపథ్యంలో పలు అంతర్జాతీయ కంపెనీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వివిధ దేశాల మధ్య ఉన్న వాణిజ్య పరమైన అనిశ్చిత కారణంగా పలు కంపెనీలు లాభదాయకమైన మార్కెట్ల వైపుకు అడుగులు వేస్తున్నాయి.

ట్రంపు చర్యలకు ఆవిరవుతున్న ఆశలు

తాజాగా అమెరికా, చైనా మరియు యూరోపియన్ యూనియన్ వంటి దేశాలు తమ దేశాలకు దిగుమతి అయ్యే ఉత్పత్తుల మీద పోటీపోటీగా దిగుమతి సుంకాలను పెంచేశాయి. ఈ తరుణంలో గిరాకీ ఎక్కువగా ఉన్న ఉత్పత్తుల ధరలు దిగుమతి అనంతరం విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇది కంపెనీల మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.

ట్రంపు చర్యలకు ఆవిరవుతున్న ఆశలు

దిగుమతి సుంకాల పెంపు అంశాన్ని లేవనెత్తిన ట్రంప్, పలు దేశాల నుండి దిగుమతి చేసుకునే ఉత్పత్తుల మీద ట్యాక్స్ విపరీతంగా పెంచేశాడు. దీనికి ప్రతిచర్యగా, ఏయే దేశాల ఉత్పత్తుల మీదనైతే ట్యాక్స్ పెంచాడో... ఆ దేశాధికారులు కూడా అమెరికా ఉత్పత్తుల దిగుమతి మీద ట్యాక్స్ పెంచేశారు.

ట్రంపు చర్యలకు ఆవిరవుతున్న ఆశలు

ఈ క్రమంలో యూరోపియన్ యూనియన్ ప్రతీకారంగా 6 శాతం ఉన్న ట్యాక్స్‌ను 31 శాతానికి పెంచేసింది. ఈ నిర్ణయం అమెరికాకు చెందిన దిగ్గజ లగ్జరీ బైకుల తయారీ సంస్థ హ్యార్లీ-డేవిడ్సన్ తీవ్ర నష్టాలను మిగల్చనుంది.

ట్రంపు చర్యలకు ఆవిరవుతున్న ఆశలు

ఈ చర్యలతో హ్యార్లీ-డేవిడ్సన్ తమ ఉత్పత్తిని కొంత మేర యూరప్‌కు మళ్లించాలని భావిస్తోంది. నిజానికి యూరోపియన్ మార్కెట్ హ్యార్లీకి రెండవ అతి పెద్దది. ఇక్కడ ప్రతి ఏటా సగటున 40 వేల కొత్త హ్యార్లీ బైకులు అమ్ముడవుతున్నాయి.

ట్రంపు చర్యలకు ఆవిరవుతున్న ఆశలు

యూరోపియన్ మార్కెట్‌కు కావాల్సిన బైకులను అమెరికా నుండి హ్యార్లీ ఎగుమతి చేస్తోంది. అయితే, యూరప్‌లో దిగుమతయ్యే బైకుల మీద ట్యాక్స్ 6 నుండి 31 శాతానికి పెరగడంతో హ్యార్లీ బిజినెస్ మీద తీవ్ర ప్రభావం చూపునుంది.

ట్రంపు చర్యలకు ఆవిరవుతున్న ఆశలు

తమ అతి పెద్ద మార్కెట్‌ను వదులుకునే ఉద్దేశ్యం లేక అమెరికా నుండి ప్రొడక్షన్‌ను యూరోపియన్ కంట్రీస్‌కు తరలించాలని భావిస్తోంది. ఏదేమైనప్పటికీ, ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో ఎట్టకేలకు అమెరికాకే నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొంది. హ్యార్లీతో పాటు మరిన్ని కంపెనీలు కూడా అమెరికాను వీడనున్నాయి.

అగ్రరాజ్య అధినేతలు తీసుకునే నిర్ణయాలు ఆ దేశ సంపదను పెంచడానికి ఉపయోగపడుతున్నప్పటికీ విదేశీ మార్కెట్ల మీద ఆధారపడిన చిన్న చిన్న కంపెనీలు విలవిల్లాడిపోతున్నాయి. మొత్తానికి హ్యార్లీ-డేవిడ్సన్ తీసుకున్న నిర్ణయం డొనాల్డ్ ట్రంపును ఆశ్చర్యానికి గురి చేసింది.

ట్రంపు చర్యలకు ఆవిరవుతున్న ఆశలు

గతంలో నెలకొన్న వాణిజ్య యుద్ద పరిణామాలను చూస్తే, చైనా నుండి దిగుమతి అయ్యే ఉత్పత్తుల మీద అమెరికా ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచితే, దీనికి ప్రతికార చర్యగా చైనా కూడా అమెరికా ఉత్పత్తుల మీద పన్ను శాతం పెంచేసింది. దీంతో ఇరు దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేసే కంపెనీల మీద తీవ్ర ప్రభావం చూపుతోంది.

ట్రంపు చర్యలకు ఆవిరవుతున్న ఆశలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఏదేమైనప్పటికీ, ఇది దేశీయ షేర్ మార్కెట్ల మీద ప్రభావం చూపినా... ఇండియన్ ఆటో ఇండస్ట్రీ మీద ఎలాంటి ప్రభావం చూపదు. చాలా వరకు కంపెనీలు దేశీయంగానే తమ ఉత్పత్తులను తయారు చేసుకుంటున్నాయి. అంతే కాకుండా విదేశీ మార్కెట్లకు కూడా ఎగుమతి చేస్తున్నాయి. ప్రపంచ దేశాల మధ్య చిచ్చు రేపుతున్న ఈ ప్రతీకార ట్యాక్స్ విధానంతో చాలా వరకు కంపెనీలు ఇండియాలో తమ ఉత్పత్తులను తయారు చేయడానికి మొగ్గుచూపుతున్నాయి.

Most Read Articles

English summary
Read In Telugu: Harley-Davidson moving some production overseas
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X