డుకాటి మోన్‌స్టర్ 797+ విడుదల: ధర రూ. 8.03 లక్షలు

డుకాటి ఇండియా విపణిలోకి సరికొత్త మోన్‌స్టర్ 797+ బైకును లాంచ్ చేసింది. డుకాటి మోన్‌స్టర్ 797+ బైకు నిజానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న 797 యొక్క అప్‌డేటెడ్ వెర్షన్. డుకాటి మోన్‌స్టర్ 797+ ప్రారంభ ధర రూ

By Anil Kumar

డుకాటి ఇండియా విపణిలోకి సరికొత్త మోన్‌స్టర్ 797+ బైకును లాంచ్ చేసింది. డుకాటి మోన్‌స్టర్ 797+ బైకు నిజానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న 797 యొక్క అప్‌డేటెడ్ వెర్షన్. అయితే, అప్‌డేటెడ్ వెర్షన్ అదే మునుపటి స్టాండర్డ్ వెర్షన్ ధరలోనే వచ్చింది. డుకాటి మోన్‌స్టర్ 797+ ప్రారంభ ధర రూ. 8.03 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది.

డుకాటి మోన్‌స్టర్ 797+ విడుదల

డుకాటి మోన్‌స్టర్ 797+ చూడటానికి అచ్చం స్టాండర్డ్ 797 మోడల్‌నే పోలి ఉంటుంది. అయితే, 797+ బైకులో ఫ్రంట్ ఫెయిరింగ్ మరియు రియర్ ప్యాసింజర్ సీట్ కవర్ ఉన్నాయి. రెండు ఫీచర్లు కూడా బాడీ కలర్ మ్యాచింగ్‌తో వచ్చాయి.

డుకాటి మోన్‌స్టర్ 797+ విడుదల

మోన్‌స్టర్ మోడల్‌ను ప్రపంచ విపణిలోకి ప్రవేశపెట్టి 25 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని డుకాటి ఈ మోన్‌స్టర్ 797+ బైకును లాంచ్ చేసింది. డుకాటి ఇండియా లైనప్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న బైకులు మోన్‌స్టర్ సిరీస్.

డుకాటి మోన్‌స్టర్ 797+ విడుదల

డుకాటి మోన్‌స్టర్ 797+ బైకులో అదే 803సీసీ కెపాసిటి గల ఎల్-ట్విన్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 72బిహెచ్‌పి పవర్ మరియు 67ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

డుకాటి మోన్‌స్టర్ 797+ విడుదల

మోన్‌స్టర్ 797 మరియు మోన్‌స్టర్ 797+ బైకుల్లో అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, పిరెల్లీ టైర్లు, ఫ్రంట్ మరియు రియర్ డిస్క్ బ్రేకులతో పాటు వెనుక వైపున మోనోషాక్ అబ్జార్వర్ వంటి ఎన్నో ఫీచర్లు తప్పనిసరిగా లభిస్తున్నాయి.

డుకాటి మోన్‌స్టర్ 797+ విడుదల

మోన్‌స్టర్ 797+ విడుదలతో పాటు తమ 821 మోడల్ డెలివరీ ప్రారంభించినట్లు డుకాటి ప్రకటించింది. డుకాటి మోన్‌స్టర్ 821 ప్రారంభ ధర రూ. 9.51 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది.

డుకాటి మోన్‌స్టర్ 797+ విడుదల

డుకాటి ఇండియా మేనేజింగ్ డైరక్టర్ మాట్లాడుతూ, "ఇండియన్ కస్టమర్లకు నిరంతరం నూతన్వంతో కొత్త మోడళ్లను పరిచయం చేయడానికి ఎల్లవేళలా ప్రయత్నిస్తుంటాం. దేశీయ విపణిలోకి మోన్‌స్టర్ కుటుంబాన్ని పరిచయం చేసిన దశాబ్దం కాలంగా ఎన్నో మైలురాళ్లను మరెన్నో లక్ష్యాలను చేధించినట్లు చెప్పుకొచ్చాడు."

డుకాటి మోన్‌స్టర్ 797+ విడుదల

అంతే కాకుండా, "డుకాటి ఇండియా లైనప్‌లో మోన్‌స్టర్ అతి ముఖ్యమైన కుటుంబం. మోన్‌స్టర్ ఔత్సాహికుల కోసం తాజాగా మోన్‌స్టర్ 821 మరియు 797+ మోడళ్లను ప్రవేశపెట్టినట్లు వివరించాడు."

డుకాటి మోన్‌స్టర్ 797+ విడుదల

డుకాటి ఇండియా దేశీయంగా విక్రయించే అన్ని మోడళ్లను కూడా కంప్లీట్లి బిల్ట్ యూనిట్లుగా దిగుమతి చేసుకుని విక్రయిస్తోంది. డుకాటి మోన్‌స్టర్ ప్రస్తుతం నాలుగు విభిన్న వెర్షన్‌లలో లభ్యమవుతోంది. అవి, 797, 797+, 821 మరియు 1100. మోన్‌స్టర్ 797+ మరియు 821 మోడళ్లు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని డీలర్ల వద్ద లభ్యమవుతోంది.

డుకాటి మోన్‌స్టర్ 797+ విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

డుకాటి మోన్‌స్టర్ 25 ఏళ్ల వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా మోన్‌స్టర్ 797+ ఎడిషన్ బైకును లాంచ్ చేసింది. 797+ మోడల్ ప్రస్తుతం విపణిలో ఉన్న కవాసకి జడ్900 మరియు ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, June 11, 2018, 13:55 [IST]
English summary
Read In Telugu: Ducati Monster 797+ Launched In India — Priced At Rs 8.03 Lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+