హీరోతో జతకడుతున్న డుకాటి

డుకాటి ఇండియన్ మార్కెట్లోకి 300సీసీ ఇంజన్ సామర్థ్యం గల స్పోర్ట్స్ బైకును ప్రవేశపెట్టాలని భావిస్తోంది. అయితే, ఈ బైకును నూతన ఫ్లాట్‌ఫామ్ మీద అభివృద్ది చేసేందుకు దేశీయ దిగ్గజం హీరో మోటోకార్ప్‌తో భాగస్వామ

By Anil Kumar

ఇటాలియన్‌కు చెందిన దిగ్గజ సూపర్ బైకుల తయారీ దిగ్గజం డుకాటి ఇండియన్ మార్కెట్లోకి 300సీసీ ఇంజన్ సామర్థ్యం గల స్పోర్ట్స్ బైకును ప్రవేశపెట్టాలని భావిస్తోంది. అయితే, ఈ బైకును నూతన ఫ్లాట్‌ఫామ్ మీద అభివృద్ది చేసేందుకు దేశీయ దిగ్గజం హీరో మోటోకార్ప్‌తో భాగస్వామ్యపు ఒప్పందం కుదుర్చుకునే ఆలోచనలో ఉంది.

హీరో నుండి సూపర్ బైకులు

దేశీయ దిగ్గజాలైన బజాజ్ ఆటో మరియు టీవీఎస్ మోటోకార్ప్ వరుసగా కెటిఎమ్ మరియు బిఎమ్‌డబ్ల్యూ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. కాబట్టి, ఎలాంటి ఒప్పందాలు లేకుండా ఒంటరిగా రాణిస్తున్న ఏకైక దేశీయ టూ వీలర్ల తయారీ దిగ్గజం హీరో కావడంతో డుకాటి హీరో మోటోకార్ప్ సంస్థతో చేతులు కలపాలని భావిస్తున్నట్లు తెలిసింది.

హీరో నుండి సూపర్ బైకులు

హ్యార్లీడేవిడ్సన్ వద్ద ఉన్న తక్కువ ఇంజన్ కెపాసిటి గల బైకుల కోసం హీరో మోటోకార్ప్ కూడా ఇటీవల అమెరికాకు చెందిన హ్యార్లీడేవిడ్సన్ సంస్థతో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకునేందుకు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే, అనుకోకుండా హీరో మోటోకార్ప్ ఈ భాగస్వామ్యాన్ని తిరస్కరించింది.

హీరో నుండి సూపర్ బైకులు

డుకాటి-హీరో ఉమ్మడి భాగస్వామ్యంతో హీరో మోటోకార్ప్ తక్కువ ధరలో, అత్యంత నాణ్యమైన ఉత్పత్తులను తయారీ చేపట్టనుంది. అదే విధంగా, డుకాటి తమ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు అనుభవజ్ఞులైన మోటోజీపీ ఇంజనీర్లను తీసుకురానుంది.

హీరో నుండి సూపర్ బైకులు

హీరో మోటోకార్ప్ తయారీ కేంద్రం ఎంట్రీ లెవల్ 300సీసీ డుకాటి స్పోర్ట్స్ మోటార్‌సైకిల్‌కు ప్రపంచ ఉత్పత్తి కేంద్రంగా నిలవనుంది. అంతే కాకుండా, ఉమ్మడి భాగస్వామ్యం క్రింద డెవలప్ చేసే ఈ బైకును హీరో కూడా తన బ్రాండ్ పేరుతో విక్రయించనుంది.

హీరో నుండి సూపర్ బైకులు

ప్రపంచ అతి పెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థగా రాణిస్తున్న హీరో మోటోకార్ప్ ఇప్పటి వరకు కమ్యూటర్ మోటార్ సైకిల్ సెగ్మెంట్లో మాత్రమే దృష్టిసారించింది. హీరో బ్రాండ్ ఇప్పటి వరకు ప్రీమియం మోటార్ సైకిళ్ల సెగ్మెంట్లో రాణించలేకపోయింది. ఏదేమైనప్పటికీ, ఈ భాగస్వామ్యంతో డుకాటి ప్రీమియం బైకులు హీరో బ్రాండ్ పేరుతో రావడంతో హీరో కల తీరడం ఖాయం.

హీరో నుండి సూపర్ బైకులు

డుకాటి-హీరో భాగస్వామ్యంతో తయారీ ఖర్చులు తగ్గడం మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న హీరో విసృతమైన డీలర్‌షిప్ నెట్‌వర్క్ ద్వారా డుకాటి ఎంట్రీ లెవల్ పర్ఫామెన్స్ మోడళ్లతో ఎంతో మంది కస్టమర్లకు చేరువయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు, డుకాటి 300సీసీ ఇంజన్‌తో రెండు విభిన్న ఉత్పత్తులను అభివృద్ది చేయనుంది.

హీరో నుండి సూపర్ బైకులు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ప్రస్తుతం, ఇండియన్ మార్కెట్లోని 300సీసీ సెగ్మెంట్లో బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్ మరియు జి 310 జిఎస్, కెటిఎమ్ డ్యూక్ 390 మరియు ఆర్సీ 390 అదే విధంగా టీవీఎస్ ఆపాచే ఆర్ఆర్310 మరియు బజాజ్ డామినర్ 400 బైకులు ఉన్నాయి.

హీరో నుండి సూపర్ బైకులు

డుకాటి-హీరో భాగస్వామ్యం అన్ని అంశాల పరంగా పైన పేర్కొన్న 300సీసీ సెగ్మెంట్లో ఉన్న బైకులకు అత్యంత కఠినమైన పోటీని ప్రవేశపెట్టడం ఖాయం. మరిన్ని తాజా ఆటోమొబైల్ వార్తల కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి.

Source: Bikewale

Most Read Articles

English summary
Read In Telugu: Ducati And Hero MotoCorp Partnership — Another 300cc Sportsbike In The Works?
Story first published: Friday, August 17, 2018, 12:05 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X