డుకాటి మోన్‌స్టర్ 821 విడుదల: ధర, ఇంజన్, ఫీచర్లు మరియు ఫోటోలు

2018 డుకాటి మోన్‌స్టర్ 821 (Ducati Monster 821) ఇండియన్ మార్కెట్లోకి విడుదలయ్యింది. సరికొత్త 2018 డుకాటి మోన్‌స్టర్ 821 ప్రారంభ ధర రూ. 9.51 లక్షలు ఎక్స్-షోరూమ్‌‌గా ఉంది.

By Anil Kumar

2018 డుకాటి మోన్‌స్టర్ 821 ఇండియన్ మార్కెట్లోకి విడుదలయ్యింది. సరికొత్త 2018 డుకాటి మోన్‌స్టర్ 821 ప్రారంభ ధర రూ. 9.51 లక్షలు ఎక్స్-షోరూమ్‌‌గా ఉంది. ఈ నూతన డుకాటి మోన్‌స్టర్ 821 గతంలో బిఎస్-4 ఉద్గార ప్రమాణాలను పాటించలేదనే కారణంతో మార్కెట్ నుండి వైదొలగిన 2016 మోడల్ స్థానాన్ని ఇది భర్తీ చేస్తుంది.

2018 డుకాటి మోన్‌స్టర్ 821

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ నేక్డ్ వెర్షన్ బైకుల్లో డుకాటి మోన్‌స్టర్ ఒకటి. మునుపటి మోడళ్లతో పోల్చితే మోన్‌స్టర్ 821 మోడల్‌లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. డిజైన్, టెక్నికల్ మరియు ఫీచర్ల పరంగా భారీ మార్పులు జరిగాయి.

2018 డుకాటి మోన్‌స్టర్ 821

సాంకేతికంగా సరికొత్త డుకాటి మోన్‌స్టర్ 821 బైకులో 821సీసీ కెపాసిటి గల డెస్మోడ్రామిక్ టెస్టాట్రెట్టా ఎల్-ట్విన్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 108బిహెచ్‌పి పవర్ మరియు 86ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మరియు ఇది ప్రస్తుతం ఉన్న బిఎస్-4 ఉద్గార ప్రమాణాలను పాటిస్తుంది.

2018 డుకాటి మోన్‌స్టర్ 821

డిజైన్ పరంగా తొలి చూపులో ఈ 2018 డుకాటి మోన్‌స్టర్ 821 చూడటానికి అచ్చం మునుపటి మోడల్‌నే పోలి ఉంటుంది. కానీ మోన్‌స్టర్ శ్రేణిలో పెద్ద మోడల్ మోన్‌స్టర్ 1200 నుండి సేకరించిన హెడ్ ల్యాంప్ వంటి వాటిలో స్వల్ప మార్పులు సంభవించాయి. 1993 కాలం నాటి ఎమ్900 మోడల్ ఆధారంగా రీడిజైన్ చేయబడిన యెల్లో కలర్ ఫ్యూయల్ ట్యాంక్ ఇందులో అందివ్వడం జరిగింది.

2018 డుకాటి మోన్‌స్టర్ 821

సైడ్ మరియు రియర్ ప్రొఫైల్ కూడా చూడటానికి అచ్చం మునుపటి మోడల్ తరహాలోనే ఉంటుంది. సరికొత్త డుకాటి మోన్‌స్టర్ 821 రియర్ డిజైన్‌లో స్లిమ్ముగా ఉన్న టెయిల్ సెక్షన్ మరియు డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి.

2018 డుకాటి మోన్‌స్టర్ 821

డుకాటి మోన్‌స్టర్ 821 నేక్డ్ బైకులో అర్బన్, స్పోర్ట్ మరియు టూరింగ్ అనే మూడు విభిన్న రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. మూడు విభిన్న రైడింగ్ అనుభవాలిచ్చేందుకు ప్రతి మోడ్‌లో కూడా అవసరానికి తగినంత ఫ్యూయల్ తీసుకోవడం మరియు అందుకు అనుగుణమైన టార్క్‌ను కంట్రోల్ చేస్తుంది. ఇందులో డుకాటి క్విక్ షిఫ్ట్ నుండి సేకరించిన క్విక్ షిఫ్టర్స్ ఉన్నాయి.

2018 డుకాటి మోన్‌స్టర్ 821

డుకాటి మోన్‌స్టర్ 821 బైకులోని టిఎఫ్‌టి ఇంస్ట్రుమెంట్ క్లస్టర్‌‌లో ఎన్నో ఫంక్షన్స్ ఉన్నాయి. మునుపటి మోడల్ కంటే ఇందులో యూజర్ ఇంటర్‌ఫేస్ సిస్టమ్‌ను మరింత మెరుగుపరిచారు. డుకాటి మోన్‌స్టర్ 821 మోడల్ మూడు విభిన్న రంగుల్లో లభిస్తుంది. అవి, రెడ్, యెల్లో మరియు బ్లాక్.

2018 డుకాటి మోన్‌స్టర్ 821

భద్రత పరంగా సరికొత్త డుకాటి మోన్‌స్టర్ 821లో డుకాటి బ్రాండ్ సేఫ్టీ ప్యాక్ ఉంది. ఈ సేఫ్టీ ప్యాక్‌లో త్రీ-లెవల్ బాష్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎనిమిది లెవల్స్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఇంకా ఎన్నో ఉన్నాయి.

2018 డుకాటి మోన్‌స్టర్ 821

డుకాటి మోన్‌స్టర్ 821 విపణిలో ఉన్న సుజుకి జిఎస్ఎక్స్-ఎస్750, ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఎస్ మరియు యమహా ఎమ్‌టి-09 వంటి హై పర్ఫామెన్స్ నేక్డ్ మోటార్ సైకిళ్లకు గట్టి పోటీనిస్తుంది. ప్రస్తుతం డుకాటి మోన్‌స్టర్ పరిచయాత్మక ధర అయినప్పటికీ, ఇతర మోడళ్లతో పోల్చుకుంటే కాస్త ఎక్కువగానే అనిపిస్తుంది.

2018 డుకాటి మోన్‌స్టర్ 821

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

డుకాటి మోన్‌స్టర్ లైనప్‌లో ఉన్న 797 మరియు 1200 మోడళ్ల మధ్య ఉన్న స్థానాన్ని సరికొత్త మోన్‌స్టర్ 821 భర్తీ చేస్తుంది. డుకాటి మోన్‌స్టర్ బైకులకు ప్రపంచ వ్యాప్తంగా నమ్మకమైన కస్టమర్లు ఉన్నారు. అందుకు ఇండియా మినహాయింపు కాదు. డుకాటి మోన్‌స్టర్ 1200 మోడల్‌ను ఎంచుకునే స్థోమత లేనటువంటి కస్టమర్లకు మోన్‌స్టర్ 821 బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

ఏదేమైనప్పటికీ, రూ. 9.51 లక్షల ధర సామాన్యులకు భారమనే చెప్పాలి. ఇదే సెగ్మెంట్లో ఉన్న ఇతర మోడళ్లతో ధర పరంగా పోల్చుకుంటే డుకాటి మోన్‌‌స్టర్ 821 ధర పోటీదారుల కంటే అధికంగానే ఉంది.

Most Read Articles

English summary
Read In Telugu: 2018 Ducati Monster 821 Launched In India At Rs 9.51 Lakh — BS-IV Compliant Now
Story first published: Tuesday, May 1, 2018, 18:57 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X