డుకాటి మల్టీస్ట్రాడా 1260 విడుదల: ఇంజన్, ఫీచర్లు, వేరియంట్లు, ధర మరియు ఫోటోలు

డుకాటి ఇండియా విపణిలోకి సరికొత్త ఫ్లాగ్‌షిప్ వెర్షన్ అడ్వెంచర్ టూరర్ మోటార్ సైకిల్ - మల్టీస్ట్రాడా 1260 ను లాంచ్ చేసింది. ఇది స్టాండర్ట్ 1260 మరియు 1260 ఎస్ అనే రెండు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది.

By Anil Kumar

డుకాటి ఇండియా విపణిలోకి సరికొత్త ఫ్లాగ్‌షిప్ వెర్షన్ అడ్వెంచర్ టూరర్ మోటార్ సైకిల్ - మల్టీస్ట్రాడా 1260 ను లాంచ్ చేసింది. ఇది స్టాండర్ట్ 1260 మరియు 1260 ఎస్ అనే రెండు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది. వీటి ధరలు వరుసగా రూ. 15.99 లక్షలు మరియు రూ. 18.06 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉన్నాయి.

డుకాటి మల్టీస్ట్రాడా 1260 విడుదల

సరికొత్త డుకాటి మల్టీస్ట్రాడా 1260 అధునాతన ఫీచర్లు మరియు మరెన్నో అప్‌డేట్స్‌తో వచ్చింది. ఈ నూతన అడ్వెంచర్ టూరర్ బైకులో సరికొత్త ఇంజన్, ఛాసిస్, పొడవాటి స్వింగ్ఆర్మ్ మరియు అధునాతన ఎలక్ట్రానిక్స్ వచ్చాయి.

డుకాటి మల్టీస్ట్రాడా 1260 విడుదల

మల్టీస్ట్రాడా 1260 గతంలో ఉన్న 1200 బైకు స్థానాన్ని భర్తీ చేస్తుంది. మల్టీస్ట్రాడా సిరీస్‌లోని ఇతర వేరియంట్లను కూడా దశల వారీగా విడుదల చేయడానికి డుకాటి సన్నద్దమవుతోంది. ఇందులో డి-ఎయిర్ మరియు పైక్స్ పీక్ వేరియంట్లు కూడా ఉన్నాయి.

డుకాటి మల్టీస్ట్రాడా 1260 విడుదల

డుకాటి మల్టీస్ట్రాడా 1260 అడ్వెంచర్ టూరర్ బైకులో అత్యంత శక్తివంతమైన 1,262సీసీ కెపాసిటి గల ఎల్-ట్విన్, డివిటి టెస్టాస్ట్రెట్టా పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 158బిహెచ్‌పి పవర్ మరియు 129.5ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

డుకాటి మల్టీస్ట్రాడా 1260 విడుదల

డుకాటి మల్టీస్ట్రాడా 1260 మరియు 1260 ఎస్ రెండు వేరియంట్లలో ఎన్నో ఎలక్ట్రానిక్ ఫీచర్లు ఉన్నాయి. 1260 బైకులో, వెహికల్ హోల్డ్ కంట్రోల్, కార్నరింగ్ ఏబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్, డుకాటి వీలీ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ మరియు బ్యాక్‌లిట్ హ్యాండిల్‌బార్ స్విచ్చులు ఉన్నాయి.

డుకాటి మల్టీస్ట్రాడా 1260 విడుదల

డుకాటి మల్టీస్ట్రాడా 1260 ఎస్ వేరియంట్లో పైన పేర్కొన్న ఫీచర్లతో పాటు అదనంగా ఫుల్-కలర్ టిఎఫ్‌టి ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ ప్యానల్, క్విక్ షిఫ్టర్ మరియు కార్నరింగ్ హెడ్‌లైట్లు ఉన్నాయి.

డుకాటి మల్టీస్ట్రాడా 1260 విడుదల

మల్టీస్ట్రాడా 1260 రెండు వేరియంట్లలో కూడా స్పోర్ట్, టూరింగ్, అర్బన్ మరియు ఎండ్యూరో రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. స్పోర్ట్ మరియు టూరింగ్ మోడ్‌లలో 158బిహెచ్‌పి పవర్ అందుతుంది. అయితే, అర్బన్ మరియు ఎండ్యురో మోడ్‌లలో 100బిహెచ్‌పి పవర్ మాత్రమే అందుతుంది.

డుకాటి మల్టీస్ట్రాడా 1260 విడుదల

డుకాటి మల్టీస్ట్రాడా 1260 బైకులో ఎలక్ట్రికల్‌గా అడ్జెస్ట్ చేసుకునే వీలున్న అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున సెమీ-యాక్టివ్ డుకాటి స్కైహుక్ సస్పెన్షన్ సిస్టమ్ ఉంది. బ్రేకింగ్ విధుల కోసం ఫ్రంట్ వీల్‌కు 330ఎమ్ఎమ్ డ్యూయల్ డిస్క్ మరియు రియర్ వీల్‌కు 265ఎమ్ఎమ్ సింగల్ డిస్క్ బ్రేకులు ఉన్నాయి.

డుకాటి మల్టీస్ట్రాడా 1260 విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

అత్యంత ఖరీదైన ఇలాంటి బైకులు మార్కెట్లోకి విడుదలైనప్పుడు, వీటి ధరలు చూసి ఔరా... అశ్చరపోతాం. కానీ, ఇలాంటి మోటార్ సైకిళ్లకు విపణిలో డిమాండ్ లభిస్తూనే ఉంది. డుకాటి మల్టీస్ట్రాడా 1260 మీద ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. జూన్ 2018 చివరి నుండి డెలివరీలు కూడ ప్రారంభం అవుతాయి.

డుకాటి మల్టీస్ట్రాడా 1260 విడుదల

డుకాటి మల్టీస్ట్రాడా 1260 మరియు 1260 ఎస్ రెండు వేరియంట్లు కూడా అడ్వెంచర్ టూరర్ మోటార్ సైకిల్ విభాగంలో ఉన్న ట్రయంప్ టైగర్ 1200 ఎక్స్‌సిఎక్స్ మరియు బిఎమ్‌డబ్ల్యూ ఆర్1200 జిఎస్ మోడళ్లకు గట్టిపోటీనిస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, June 19, 2018, 17:44 [IST]
English summary
Read In Telugu: Ducati Multistrada 1260 Launched In India — Prices Start At Rs 15.99 Lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+