డుకాటి స్క్రాంబ్లర్ 1100 విడుదల: ధర రూ. 10.91 లక్షలు
ఇటలీకి చెందిన దిగ్గజ సూపర్ బైకుల తయారీ దిగ్గజం డుకాటి నేడు ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త డుకాటి స్క్రాంబ్లర్ 1100 బైకును విడుదల చేసింది. డుకాటి స్క్రాంబ్లర్ 1100 ధర రూ. 10.91 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉం
ఇటలీకి చెందిన దిగ్గజ సూపర్ బైకుల తయారీ దిగ్గజం డుకాటి నేడు ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త డుకాటి స్క్రాంబ్లర్ 1100 బైకును విడుదల చేసింది. డుకాటి స్క్రాంబ్లర్ 1100 ధర రూ. 10.91 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉంది. స్క్రాంబ్లర్ 1100 ఇప్పుడు ఇండియన్ మార్కెట్లోని స్క్రాంబ్లర్ కుటుంబంలో హై ఎండ్ మోడల్. వీటి డెలివరీలు వచ్చే నెల నుండి ప్రారంభం కానున్నాయి.

డుకాటి స్క్రాంబ్లర్ 1100 మూడు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది. అవి, స్టాండర్డ్ స్క్రాంబ్లర్ 1100, స్క్రాంబ్లర్ 1100 స్పెషల్ మరియు స్క్రాంబ్లర్ 1100 స్పోర్ట్. వీటి ధరలు వరుసగా రూ. 10.91 లక్షలు, రూ. 11.12 లక్షలు మరియు హై ఎండ్ వేరియంట్ ధర రూ. 11.42 లక్షలు. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్‌గా ఇవ్వబడ్డాయి.

సరికొత్త డుకాటి స్క్రాంబ్లర్ 1100 బైకులో అత్యాధునిక సంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన భారీ పరిమాణంలో ఉన్న ఇంజన్ కలదు. 1,079సీసీ సామర్థ్యం గల ఇంజన్ 85బిహెచ్‌పి పవర్ మరియు 88ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది మరియు దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

డుకాటి స్క్రాంబ్లర్ 1100 బైకును రీడిజైన్ చేయబడిన ఫ్రేమ్ మీద నిర్మించారు. మరియు ఎన్నో అత్యాధునిక ఎలక్ట్రిక్ ఫీచర్లు దీని సొంతం. ప్రత్యేకించి ఇందులో రైడ్-బై-వైర్ థ్రోటిల్ మరియు యాక్టివ్, జర్నీ మరియు సిటీ అనే మూడు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. యాక్టివ్ మోడ్‍లో అత్యధికంగా 85బిహెచ్‌పి పవర్ అందుతుంది.

జర్నీ రైడింగ్ మోడ్‌లో కూడా 85బిహెచ్‌పి పవర్ అందుతుంది అయితే, యాక్సిలరేషన్ రెస్పాన్స్ చాలా స్మూత్‌గా ఉంటుంది. సిటీ రైడింగ్ మోడ్‌లో 75బిహెచ్‌పి మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది. నాలుగు దశలలో అడ్జెస్ట్ చేసుకునే వీలున్న ట్రాక్షన్ కంట్రోల్ మరియు బాష్ కార్నరింగ్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ టెక్నాలజీ ఉన్నాయి.

డుకాటి స్క్రాంబ్లర్ 1100 బైకులో పెద్ద పరిమాణంలో పిస్టన్ గల బ్రేక్ ప్యాడ్స్, సౌకర్యానికి అనుగుణంగా అడ్జెస్ట్ చేసుకునే సదుపాయం ఉన్న బ్లేక్ మరియు క్లచ్ లీవర్లు ఉన్నాయి. డిజైన్ పరంగా డుకాటి స్క్రాంబ్లర్ 1100 చూడటానికి కండలు తిరిగిన శరీరాకృతిని కలిగి ఉంటుంది. నూతన డిజైన్ ఎలిమెంట్లు మరియు డ్యూయల్ ఎగ్జాస్ట్ పైపులు ప్రధాన హైలెట్‌గా నిలిచాయి.

డుకాటి స్క్రాంబ్లర్ 1100 మొత్తం 60 యెల్లో మరియు షైనింగ్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తోంది. స్పోర్టివ్ వేరియంట్లోని ఫ్యూయల్ ట్యాంక్ మీద వైపర్ బ్లాక్ మరియు యెల్లో మేళవింపులను మరియు అదనపు గ్రే కలర్ సొబగులను చూడవచ్చు.

తెలుగు డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం!
డుకాటి ఇండియా ఎట్టకేలకు తమ స్క్రాంబ్లర్ 1100 బైకును పెద్ద ఇంజన్ మరియు అత్యాధునిక ఫీచర్లతో విపణిలోకి లాంచ్ చేసింది. స్క్రాంబ్లర్ 1100 చూడటానికి అచ్చం స్క్రాంబ్లర్ 800 మోడల్‌నే పోలి ఉంటుంది. ఎక్కువ సీసీ ఇంజన్ గల స్క్రాంబ్లర్ కావాలనుకుని, ధర ఏ మాత్రం మ్యాటర్ కాదనుకునే వారు స్క్రాంబ్లర్ 1100 టాప్ ఎండ్ మోడల్ ఎంచుకోవచ్చు.


Click it and Unblock the Notifications








