ఆటో ఎక్స్‌పో 2018: ఎంఫ్లక్స్ వన్ ఎలక్ట్రిక్ బైక్ విడుదల

ఎంఫ్లక్స్ వన్ ఇండియన్ ఆటో ఎక్స్‌పో వేదికగా సరికొత్త ఎలక్ట్రిక్ సూపర్ బైకును విపణిలోకి విడుదల చేసింది. భారతదేశపు తొలి ఎలక్ట్రిక్ సూపర్ బైక్ ఎంఫ్లక్స్ వన్ ధర రూ. 11 లక్షలు

By Anil

Recommended Video

UM Renegade Commando, Classic, Renegade Sport S India First Look, Specs - DriveSpark

ఆటో ఎక్స్‌పో 2018: ఎంఫ్లక్స్ వన్ ఇండియన్ ఆటో ఎక్స్‌పో వేదికగా సరికొత్త ఎలక్ట్రిక్ సూపర్ బైకును విపణిలోకి విడుదల చేసింది. భారతదేశపు తొలి ఎలక్ట్రిక్ సూపర్ బైక్ ఎంఫ్లక్స్ వన్ ధర రూ. 11 లక్షలుగా ఉన్నట్లు ఎంఫ్లక్స్ ప్రతినిధులు వెల్లడించారు.

ఎంఫ్లక్స్ వన్ ఎలక్ట్రిక్ సూపర్ బైకులో ఉన్న ప్రత్యేకతలు మరియు ఫోటోల కోసం....

ఎంఫ్లక్స్ వన్ ఎలక్ట్రిక్ బైక్

ఎంఫ్లక్స్ విడుదల చేసిన వన్ ఎలక్ట్రిక్ బైకులోని ఖరీదైన వేరియంట్ ధర రూ. 11 లక్షలుగా ఉంది. అంటే, ఇందులో ఓహ్లిన్స్ సస్పెన్షన్ సిస్టమ్, ఫోర్జ్డ్ అల్లాయ్ వీల్స్ మరియు అల్ట్రా లైట్ కార్బన్ ఫైబర్ ప్యానల్స్ ఉన్నాయి.

ఎంఫ్లక్స్ వన్ ఎలక్ట్రిక్ బైక్

ఎంఫ్లక్స్ వన్ లోని ఖరీదైన వేరియంట్‌తో పాటు రెగ్యులర్ వేరియంట్‌ను కూడా విడుదల చేసింది. దీని ధర రూ. 6 లక్షలు ఎక్స్‌-షోరూమ్‌గా ఉంది.

ఎంఫ్లక్స్ వన్ ఎలక్ట్రిక్ బైక్

ఎంఫ్లక్స్ సంస్థ ఇండియన్ మార్కెట్లోకి కేవలం 199 యూనిట్ల వన్ ఎలక్ట్రిక్ సూపర్ బైకులను మాత్రమే విక్రయిస్తోంది. మరో 300 యూనిట్లను అంతర్జాతీయ విపణిలోకి విక్రయించనుంది.

ఎంఫ్లక్స్ వన్ ఎలక్ట్రిక్ బైక్

సరిగ్గా ఆరు నెలల తరువాత వన్ ఎలక్ట్రిక్ సూపర్ బైకు మీద బుకింగ్స్ ప్రారంభం అవుతాయని, టెస్ట్ రైడింగ్ కూడా అప్పటి నుండే ప్రారంభిస్తామని కంపెనీ ప్రతినిధలు తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుండి బుక్ చేసుకున్న కస్టమర్లకు డెలివరీ స్టార్ట్ చేస్తామని పేర్కొన్నారు.

ఎంఫ్లక్స్ వన్ ఎలక్ట్రిక్ బైక్

సాకేతికంగా ఎంఫ్లక్స్ వన్ ఎలక్ట్రిక్ బైకులో లిక్విడ్ కూల్డ్ 3 ఫేస్ ఏసి ఇండక్షన్ మోటార్ కలదు, దీనికి లిక్విడ్ కూల్డ్ 9.7కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ నుండి పవర్ అందుంతుంది. శాంమ్‌సంగ్ సెల్స్ జోడింపుతో అత్యుత్తమ పవర్ మోటార్‌కు అందుతుంది.

ఎంఫ్లక్స్ వన్ ఎలక్ట్రిక్ బైక్

ఎంఫ్లక్స్ వన్ బైకులోని శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటర్ 84 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే, ఎలక్ట్రికల్‌గా దీనికి 75ఎన్ఎమ్ టార్క్ వరకు మాత్రమే పరిమితి పెట్టారు. ఎలక్ట్రిక్ మోటార్ ఉత్పత్తి చేసే పవర్ మరియు టార్క్ సింగల్ స్పీడ్ గేర్‌బాక్స్ ద్వారా వెనుక చక్రానికి సరఫరా అవుతుంది.

ఎంఫ్లక్స్ వన్ ఎలక్ట్రిక్ బైక్

ఎంఫ్లక్స్ వన్ ఎలక్ట్రిక్ సూపర్ బైకు కేవలం 3.0 సెకండ్లలోనే గంటకు 0 నుండి 100కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటంది. మరియు దీని గరిష్ట వేగం గంటకు 200కిలోమీటర్లుగా ఉంది.

ఎంఫ్లక్స్ వన్ ఎలక్ట్రిక్ బైక్

ఎంఫ్లక్స్ వన్ బైక్ సింగల్ ఛార్జింగ్‌తో సిటీ రోడ్ల మీద 200కిలోమీటర్లు మరియు హైవే మీద గంటకు 80కిలోమీటర్ల వేగం వెళితే 150కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది. కేవలం 30 నిమిషాల్లో 85శాతం బ్యాటరీ ఛార్జింగ్ చేయవచ్చు.

ఎంఫ్లక్స్ వన్ ఎలక్ట్రిక్ బైక్

ఖరీదైన ఎంఫ్లక్స్ వన్ వేరియంట్లో ముందు వైపున అడ్జస్టబుల్ ప్రిలోడ్, డ్యాంపింగ్ మరియు రీబౌండ్ ఫీచర్లు గల ఓహ్లిన్స్ రేస్ అండ్ ట్రాక్ అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున అడ్జస్టబుల్ ప్రిలోడ్, డ్యాంపింగ్ మరియు రీబౌండ్ ఫీచర్లు గల 46ఎమ్ఎమ్ ఓహ్లిన్స్ మోనోట్యూబ్ గ్యాస్‌షాక్ అబ్జార్వర్ ఉంది.

ఎంఫ్లక్స్ వన్ ఎలక్ట్రిక్ బైక్

ఎంఫ్లక్స్ వన్ ఎలక్ట్రిక్ బైక్ రెగ్యులర్ వేరియంట్లో 43ఎమ్ఎమ్ అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున 46ఎమ్ఎమ్ గ్యాస్ షాక్ అబ్జార్వర్ కలదు. బ్రేకింగ్ విధుల కోసం ముందు వైపున నాలుగు పిస్టన్ కాలిపర్లు ఉన్న 300ఎమ్ఎమ్ చుట్టుకొలతలో ఉన్న రెండు బ్రెంబో డిస్క్ బ్రేకులు మరియు వెనుక వైపున 220ఎమ్ఎమ్ బ్రెంబో డిస్క్ బ్రేక్ కలదు.

ఎంఫ్లక్స్ వన్ ఎలక్ట్రిక్ బైక్

ఎంఫ్లక్స్ వన్ ఎలక్ట్రిక్ బైకులో బాడీ మొత్తం గ్లాస్ ఫైబర్ ప్యానల్స్ ఉన్నాయి వీటి స్థానంలో కార్బన్ ఫైబర్ ప్యానల్స్ కూడా అప్‌గ్రేడ్‌ చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ బైక్ మొత్తం బరువు 169కిలోలు మరియు సీటు ఎత్తు 810ఎమ్ఎమ్‌గా ఉంది.

ఎంఫ్లక్స్ వన్ ఎలక్ట్రిక్ బైక్

ఎంఫ్లక్స్ వన్ డిజైన్‌లో నిలువుటాకారంలో ఉన్న హెడ్ ల్యాంప్ మరియు వెనుక వైపున ఉన్న సింగల్ టెయిల్ ల్యాంప్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పెద్ద పరిమాణంలో ఉన్న ఫ్రంట్ మరియు సైడ్ డీకాల్స్ బైకు మొత్తానికి అగ్రెసివ్ లుక్ మరియు ఫ్యూచర్ డిజైన్ తీసుకొచ్చాయి.

ఎంఫ్లక్స్ వన్ ఎలక్ట్రిక్ బైక్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఎంఫ్లక్స్ వన్ భారతదేశపు తొలి ఎలక్ట్రిక్ సూపర్‌బైక్. ధర మరియు పవర్ పరంగా ఈ సూపర్ బైకు సంప్రదాయ పెట్రోల్ ఇంజన్ గల స్పోర్ట్స్ బైకులతో పోటీపడుతోంది. ఏదేమైనప్పటికీ ఛార్జింగ్ స్టేషన్లు విరివిగా లేకపోవడం మరియు ధర అధికంగా ఉండటం ఎంఫ్లక్స్ వన్ ఎలక్ట్రిక్ బైకుల సేల్స్ కాస్త కష్టమనే చెప్పాలి.

Most Read Articles

English summary
Read In Telugu: Auto Expo 2018: Emflux One Electric Superbike Launched In India At Rs 6 Lakh - Specs, Range & Images
Story first published: Saturday, February 10, 2018, 16:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X