రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు కొనేవారికి మేలుకొలుపు

Written By:

చరిత్రలో దివాళా తీసి, మళ్లీ పుంజుకున్న ఆటోమొబైల్ కంపెనీల్లో రాయల్ ఎన్ఫీల్డ్ ఒకటి. కొన్ని సంవత్సరాల పాటు మార్కెట్ దూరమై, మళ్లీ వచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్ మరే కంపెనీకి సాధ్యంకాని విధంగా భారీ సక్సెస్ అందుకుంది. ఏదేమైనప్పటికీ, ప్రతి వస్తువులో మంచి అంశాలు ఉన్నట్లే... చెడు అంశాలు కూడా ఉంటాయి. అయితే, రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల్లో ఎన్నో చెడు అంశాలు ఉన్నప్పటికీ అవేవీ దాని సక్సెస్‌ను అడ్డుకోలేకపోయాయి.

అన్ని తెలిసి కొనుగోలు చేసే కస్టమర్లే నష్టపోతున్నారు. ఇటు కస్టమర్లను, అటు కంపెనీని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల్లోని ఐదు అప్రయోజనాల గురించి ఇవాళ్టి కథనంలో చూద్దాం రండి...

రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు ఎందుకు కొనకూడదు

తక్కువ నిర్మాణ నాణ్యత

డిమాండ్ ఎక్కువగా ఉంటే నాణ్యత కథ కంచికే. రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల్లోనే కాదు ఏ ఉత్పత్తికైనా మార్కెట్లో డిమాండ్ ఉంటే... నాణ్యత నూటికి నూరు శాతం లేకున్నా కూడా వాటికి వచ్చే ఆదరణ ఏ మాత్రం తగ్గదు.

Recommended Video - Watch Now!
UM Renegade Thor Electric Cruiser Bike India Launch Details, Price, Specifications - DriveSpark
రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు ఎందుకు కొనకూడదు

పెద్ద పరిమాణంలో ఉన్న బైక్ విడి భాగాలను అత్యుత్తమ నాణ్యతతో నిర్మించడంలో రాయల్ ఎన్ఫీల్డ్ విఫలమవుతూనే ఉంది. ఇండియన్ రోడ్ల మీద ఎక్కడిపడితే అక్కడ ఆగిపోతున్న రాయల్ ఎన్ఫీల్డ్ బైకులతో కస్టమర్లు దీని ప్రతిఫలాలను అనుభవిస్తున్నారు.

రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు ఎందుకు కొనకూడదు

అస్థిరమైన సర్వీసింగ్

రాయల్ ఎన్ఫీల్డ్ బైకు కొనేటప్పుడు కస్టమర్లలో ఉండే ఉత్సాహం, తొలి సర్వీసింగ్‌తోనే తీరిపోతుంది. సేల్స్ తరువాత రాయల్ ఎన్ఫీల్డ్ అందించే సర్వీస్‌తో కస్టమర్లు విసిగిపోతున్నారు.

రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు ఎందుకు కొనకూడదు

ప్రత్యేకించి, కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను కొనుగోలు చేసిన కస్టమర్ల భాదలు వర్ణనాతీతం. పాత బైకులు అయితే, ఏ టూ వీలర్ మెకానిక్ వద్దనైనా సర్వీసింగ్ చేయించుకోవచ్చు. కానీ బ్రాండ్ న్యూ బైకులు అయితే ఉచిత సర్వీసింగ్ మరియు వారంటీ కోసం తప్పనిసరిగా రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్లనే సంప్రదించాలి.

రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు ఎందుకు కొనకూడదు

విపరీతమైన వైబ్రేషన్స్

రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు వైబ్రేషన్స్‌కు కేరాఫ్ అడ్రస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయాన్ని స్వయానా రాయల్ ఎన్ఫీల్డ్ కస్టమర్లే ఒప్పుకుంటున్నారు. అధిక బరువు మరియు అనవసరంగా వచ్చే అదుర్లు, కుదుపుల కారణంగా రాయల్ ఎన్ఫీల్డ్ క్రూయిజర్ బైకులను ఎక్కువ దూరం రైడింగ్ చేయలేకపోతున్నారు.

రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు ఎందుకు కొనకూడదు

అన్నింటింకి తెగించి అధిక వేగంతో రైడింగ్ చేయాలనుకుంటే కనీసం రియర్ వ్యూవ్ మిర్రర్స్‌ను క్లియర్‌గా చూడలేము. ఒక పరిమిత వేగాన్ని అందుకున్నాక మిర్రర్లు విపరీతమైన వైబ్రేషన్స్‌కు గురవుతాయి.

రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు ఎందుకు కొనకూడదు

దీర్ఘకాలిక వెయిటింగ్ పీరియడ్

రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను అవసరాలను ఉద్దేశించి కాకుండా, ఒక ప్యాసన్‌గా ఎంచుకుంటున్నారు. స్టైల్ మరియు స్టేటస్ కోసం ఔత్సాహికులు రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను అధికంగా కొనుగోలు చేస్తున్నారు.

రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు ఎందుకు కొనకూడదు

రాయల్ ఎన్ఫీల్డ్ 350 మరియు 500సీసీ బైకులకు డిమాండ్ అధికంగా వస్తుండటంతో వెయిటింగ్ పీరియడ్ ఎక్కువగా ఉంది. ప్రత్యేకించి క్లాసిక్ మరియు థండర్‌బర్డ్ బైకులు ఎనలేని ఆదరణ లభిస్తోంది. దీంతో చేసేది లేక డీలర్ ఎప్పుడు డెలివరీ ఇస్తే అప్పుడు తీసుకుంటున్నారు.

రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు ఎందుకు కొనకూడదు

ప్రత్యామ్నాయాలు

రోజు వారి అవసరాలకు మాత్రమే కాకుండా, లాంగ్ రైడ్ కోసం రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను అధికంగా ఎంచుకుంటున్నారు. లాంగ్ డ్రైవ్‌లో రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను రైడ్ చేసే వారి మీద విపరీతమైన ఒత్తిడి ఏర్పడుతుంది. కాబట్టి రోజు వారి అవసరాలకు ఇవి బెస్ట్.

రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు ఎందుకు కొనకూడదు

అయితే, లాంగ్ డ్రైవ్ కోసం రాయల్ ఎన్ఫీల్డ్ బైకులకు ప్రత్యామ్నాయంగా ఇతర మోడళ్లను ఎంచుకోవచ్చు. మహీంద్రా మోజో, డామినర్ 400 మరియు సిబిఆర్ 250ఆర్ వంటి బైకులను ఎన్ఫీల్డ్ బైకులకు ప్రత్యామ్నాయం అని చెప్పుకోవచ్చు.

రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు కొనేవారికి మేలుకొలుపు

అర్జున్ రెడ్డి మూవీలో ఉపయోగించిన బైకు గురించి

తన హిమాలయన్ బైకులో 40 తయారీ లోపాలను కనుగొన్న కస్టమర్

మీరు రాయల్ ఎన్ఫీల్డ్ ప్రేమికులా...? అయితే వీటి గురించి మీరు తెలుసుకోవాల్సిందే!!

English summary
Read In Telugu: Five SOLID reasons why you should not buy a Royal Enfield
Story first published: Thursday, February 15, 2018, 16:16 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark