హీరో నుండి సరికొత్త డెస్టిని 125 స్కూటర్

హీరో మోటోకార్ప్ దేశీయ ద్విచక్ర వాహన పరిశ్రమలో అత్యధిక విక్రయాలతో అగ్రగామి టూ వీలర్ల తయారీ సంస్థగా రాణిస్తోంది. అయితే, స్కూటర్ల విభాగంలో హోండా ఆక్టివా స్కూటర్‌ను ఢీకొనలేకపోతోంది. ఈ నేపథ్యంలో, హీరో మోటో

By Anil Kumar

ప్రపంచపు అతి పెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ దేశీయ ద్విచక్ర వాహన పరిశ్రమలో అత్యధిక విక్రయాలతో అగ్రగామి టూ వీలర్ల తయారీ సంస్థగా రాణిస్తోంది. అయితే, స్కూటర్ల విభాగంలో హోండా ఆక్టివా స్కూటర్‌ను ఢీకొనలేకపోతోంది.

ఈ నేపథ్యంలో, హీరో మోటోకార్ప్ ఇండియన్ స్కూటర్ మార్కెట్ కోసం సరికొత్త డెస్టిని 125 స్కూటర్‌ను సిద్దం చేసింది. హీరో డెస్టిని 125 స్కూటర్ గురించి మరిన్ని వివరాలు...

హీరో నుండి సరికొత్త డెస్టిని 125 స్కూటర్

హీరో మోటోకార్ప్ ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ వేదికగా జరిగిన 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పో వేదికగా మీద సరికొత్త డ్యూయట్ 125 మరియు మాయెస్ట్రో 125 స్కూటర్లను ఆవిష్కరించింది. అయితే, తాజాగా అందిన సమాచారం మేరకు, హీరో తమ డ్యూయెట్ 125 స్కూటర్‌ను డెస్టిని 125 పేరుతో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

హీరో నుండి సరికొత్త డెస్టిని 125 స్కూటర్

అంతే కాకుండా, హీరో డెస్టిని 125 మరియు హీరో మాయెస్ట్రో 125 స్కూటర్ల ఇటీవల డీలర్ల వద్ద పట్టుబడ్డాయని కొన్ని కథనాలు వెలువడ్డాయి. ఏదేమైనప్పటికీ, హీరో డెస్టిని ఖచ్చితంగా 125సీసీ విభాగానికి ఒక కొత్త రూపాన్ని ఇవ్వనుంది.

హీరో నుండి సరికొత్త డెస్టిని 125 స్కూటర్

హీరో డెస్టిని 125 ప్రీమియం మరియు సింపుల్ డిజైన్ అంశాలతో చాలా కొత్తగా ఉంది. హీరో డెస్టిని 125 ఫ్రంట్ డిజైన్‌లో సిల్వర్ సొబగులు మరియు ఫ్రంట్ ఏప్రాన్‌లో ఇమిడిపోయిన ఇండికేటర్స్, డ్యూయల్ టోన్ సీట్, పదునైన టెయిల్ సెక్షెన్, సిల్వర్ గ్రాబ్ రెయిల్, సిల్వర్ ఫినిషింగ్‌లో ఉన్న ఎగ్జాస్ట్ మఫ్లర్ వంటివి ఉన్నాయి.

హీరో నుండి సరికొత్త డెస్టిని 125 స్కూటర్

సాంకేతికంగా హీరో డెస్టిని 125 స్కూటర్‌లో 124.6సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు, సీవీటీ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 8.7బిహెచ్‌పి పవర్ మరియు 10.2ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

హీరో నుండి సరికొత్త డెస్టిని 125 స్కూటర్

అంతే కాకుండా, ఇందులో అత్యంత కీలకమైన ఐ3ఎస్ టెక్నాలజీ కూడా వస్తోంది. హీరో డెస్టిని 125లో డిజిటల్-అనలాగ్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ఈడీ టెయిల్ లైట్, బ్యాహ వైపున ఇచ్చిన ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్, బాడీ-కలర్ రియర్ వ్యూవ్ మిర్రర్స్, మొబైల్ ఛార్జింగ్ పోర్ట్, బూట్ లైట్ ఇంకా ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.

హీరో నుండి సరికొత్త డెస్టిని 125 స్కూటర్

ఇందులో ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున హైడ్రాలిక్ షాక్ అబ్జార్వర్లు ఉన్నాయి. బ్రేకింగ్ విధులు నిర్వర్తించడం కోసం ఇరు వైపులా డ్రమ్ బ్రేకులు ఉన్నాయి. అదే విధంగా ఇరువైపులా ట్యూబ్ లెస్ టైర్లను అందివ్వడం జరిగింది. విడుదలయ్యే నాటికి ఆప్షనల్ రియర్ డిస్క్ బ్రేక్ పరిచయం చేసే అవకాశం ఉంది.

హీరో నుండి సరికొత్త డెస్టిని 125 స్కూటర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హీరో మోటోకార్ప్ కమ్యూటర్ మోటార్ సైకిళ్ల విభాగంలో అగ్రగామిగా రాణిస్తోంది. అయితే, స్కూటర్ల విభాగంలో ఆశించిన ఫలితాలు సాధించలేకపోతోంది. ప్రత్యేకించి అత్యంత ఆదరణ లభిస్తున్న 125సీసీ సెగ్మెంట్లో చెప్పుకోదగిన మోడల్ ఒక్కటి కూడా లేదు. ఈ నేపథ్యంలో హీరో మోటోకార్ప్ సరికొత్త హీరో డెస్టిని 125 స్కూటర్‌తో ముందుకొచ్చింది.

హీరో నుండి సరికొత్త డెస్టిని 125 స్కూటర్

హీరో డెస్టిని 125 పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదలైతే, మార్కెట్లో ఉన్న హోండా ఆక్టివా 125, హోండా గ్రాజియా, టీవీఎస్ ఎన్‌టార్క్ 125, సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ మరియు అప్రిలియా ఎస్ఆర్ 125 వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

Source: GaadiWaadi

Most Read Articles

English summary
Read In Telugu: Hero Duet 125 Renamed As Destini 125 — Launch Soon
Story first published: Tuesday, August 14, 2018, 19:14 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X