మళ్లీ విడుదలైన హీరో కరిజ్మా జడ్ఎమ్ఆర్: ధర రూ. 1.08 లక్షలు

2018 హీరో కరిజ్మా జడ్ఎమ్ఆర్ (Hero Karizma ZMR) ఇండియన్ మార్కెట్లోకి విడుదలయ్యింది. దేశీయ అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తమ పాపులర్ కరిజ్మా జడ్ఎమ్ఆర్ బైకును సుమారుగా ఒకటిన్నర సంవత్స

By Anil Kumar

2018 హీరో కరిజ్మా జడ్ఎమ్ఆర్ (Hero Karizma ZMR) ఇండియన్ మార్కెట్లోకి విడుదలయ్యింది. దేశీయ అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తమ పాపులర్ కరిజ్మా జడ్ఎమ్ఆర్ బైకును సుమారుగా ఏడాదిన్నర తరువాత నిశ్శబ్దంగా లాంచ్ చేసింది.

2018 హీరో కరిజ్మా జడ్ఎమ్ఆర్ గురించి మరిన్ని వివరాలు మరియు ఫోటోల కోసం...

హీరో కరిజ్మా జడ్ఎమ్ఆర్ రీలాంచ్

ఇప్పటి వరకు 2018 హీరో కరిజ్మా జడ్ఎమ్ఆర్ బైకులు ఇంకా డీలర్లను చేరలేదు. అయితే, హీరో మోటోకార్ప్ తమ అఫీషియల్ వెబ్‌సైట్లో ఉన్న బైకుల జాబితాలో చేర్చింది. 2018 హీరో కరిజ్మా జడ్ఎమ్ఆర్ రెండు వేరియంట్లలో లభ్యమవుతోంది. అవి,

  • కరిజ్మా జడ్ఎమ్ఆర్ స్టాండర్డ్ ధర రూ. 1.08 లక్షలు
  • కరిజ్మా జడ్ఎమ్ఆర్ డ్యూయల్ టోన్ ధర రూ. 1.10 లక్షలు
  • రెండు ధరలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఇవ్వబడ్డాయి.
    హీరో కరిజ్మా జడ్ఎమ్ఆర్ రీలాంచ్

    హీరో మోటోకార్ప్ ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ వేదికగా జరిగిన 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పో వేదిక మీద సరికొత్త 2018 హీరో కరిజ్మా జడ్ఎమ్ఆర్ బైకును ఆవిష్కరించింది. దేశవ్యాప్తంగా ఉన్న హీరో మోటోకార్ప్ డీలర్లు ఇప్పటికే 2018 హీరో కరిజ్మా జడ్ఎమ్ఆర్ మీద బుకింగ్స్ ప్రారంభించారు.

    హీరో కరిజ్మా జడ్ఎమ్ఆర్ రీలాంచ్

    సరికొత్త హీరో కరిజ్మా జడ్ఎమ్ఆర్ బైకులో మెకానికల్‌గా ఎలాంటి మార్పులు సంభవించలేదు, అయితే పలు కాస్మొటిక్ అప్‌డేట్స్ జరిగాయి. సాంకేతికంగా ఇందులో 223సీసీ సామర్థ్యం గల ఆయిల్-కూల్డ్ సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు.

    హీరో కరిజ్మా జడ్ఎమ్ఆర్ రీలాంచ్

    బిఎస్-4 ఉద్గార ప్రమాణాలను పాటించే ఈ ఫ్యూయల్-ఇంజెక్షన్ ఇంజన్‌ గరిష్టంగా20బిహెచ్‌పి పవర్ మరియు 19.7ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 5-మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

    హీరో కరిజ్మా జడ్ఎమ్ఆర్ రీలాంచ్

    హీరో కథనం మేరకు, హీరో కరిజ్మా జడ్ఎమ్ఆర్ టాప్ స్పీడ్ గంటకు 129కిలోమీటర్లుగా ఉంది. కరిజ్మా జడ్ఎమ్ఆర్ బైకులో ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున ట్విన్-షాక్ అబ్జార్వర్లు ఉన్నాయి. ఇరు వైపులా డిస్క్ బ్రేకులు ఉన్నాయి. ఏబిఎస్ ఫీచర్ ఇంకా పరిచయం చేయాల్సి ఉంది.

    హీరో కరిజ్మా జడ్ఎమ్ఆర్ రీలాంచ్

    హీరో కరిజ్మా సరిగ్గా 2003లో తొలిసారి ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ అయ్యింది. కంపెనీకి కరిజ్మా మోటార్ సైకిల్ బ్రాండ్ అత్యంత కీలకమైన ఉత్పత్తిగా నిలిచింది. కస్టమర్ల ఇష్టానికి తగ్గట్లుగా డిజైన్, మెకానికల్ మరియు ఫీచర్ల పరంగా ఎలాంటి అప్‌డేట్స్ జరగనందు వలన కరిజ్మా సేల్స్ క్రమంగా తగ్గిపోయాయి.

    హీరో కరిజ్మా జడ్ఎమ్ఆర్ రీలాంచ్

    2018 ఎడిషన్‌లో సరికొత్త హీరో కరిజ్మా జడ్ఎమ్ఆర్ విడుదలైనప్పటికీ, మంచి స్పందన వస్తుందా లేదా అనే అనుమానాలు ఉన్నాయి. కరిజ్మా జడ్ఎమ్ఆర్ బైకు లాంగ్ రైడ్ చేయడానికి అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది. మెరుగైన సస్పెన్షన్ మరియు అద్భుతమైన ఇంజన్ కరిజ్మా బైకును సెగ్మెంట్ లీడర్ చేశాయి. అయితే, ఊహించని విధంగా 2016లో మార్కెట్ నుండి వైదొలగింది.

    హీరో కరిజ్మా జడ్ఎమ్ఆర్ రీలాంచ్

    ప్రస్తుతం ఉన్న ధరతో హీరో కరిజ్మా జడ్ఎమ్ఆర్ విపణిలో ఉన్న బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 మరియు సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

    హీరో కరిజ్మా జడ్ఎమ్ఆర్ రీలాంచ్

    డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

    అత్యంత సరసమైన పర్ఫామెన్స్ బైకుల సెగ్మెంట్లో కరిజ్మా అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్. ఏదేమైనప్పటి మునుపటి కరిజ్మా మోడల్‌కు ఆశించిన మేర సేల్స్ లభించలేదు. సుమారుగా ఏడాదిన్నర తరువాత 2018 ఎడిషన్‌లో విడుదలైన కరిజ్మా జడ్ఎమ్ఆర్ ఎలాంటి ఫలితాలు కనబరుస్తోంది వేచి చూడాలి మరి.

    2018 హీరో కరిజ్మా జడ్ఎమ్ఆర్ బైకు గురించి మీ అభిప్రాయాన్ని క్రింది కామెంట్ బాక్సు ద్వారా మాతో పంచుకోండి...

More from DriveSpark

Article Published On: Monday, July 30, 2018, 14:39 [IST]
English summary
Read In Telugu: Hero Karizma ZMR 2018 Launched In India — Prices Start At Rs 1.08 lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+