హీరో టూ వీలర్లు ఇప్పుడు మరింత ప్రియం

హీరో మోటోకార్ప్ తమ అన్ని స్కూటర్లు మరియు మోటార్ సైకిళ్ల మీద ధరలు పెంచింది. కంపెనీ దేశవ్యాప్తంగా విక్రయిస్తున్న అన్ని టూ వీలర్ల ఎక్స్-షోరూమ్ ధరల మీద రూ. 500 పెంపు చేపట్టింది.

By Anil Kumar

భారతదేశపు అతి పెద్ద దిచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తమ అన్ని స్కూటర్లు మరియు మోటార్ సైకిళ్ల మీద ధరలు పెంచింది. కంపెనీ దేశవ్యాప్తంగా విక్రయిస్తున్న అన్ని టూ వీలర్ల ఎక్స్-షోరూమ్ ధరల మీద రూ. 500 పెంపు చేపట్టింది.

అన్ని టూ వీలర్ల మీద ధరలు పెంచిన హీరో

హీరో మోటోకార్ప్ టూ వీలర్ల శ్రేణి మీద పెంచిన ధరలు వెంటనే అమల్లోకి అమల్లోకి వచ్చినట్లు కంపెనీ పేర్కొంది. పెట్టుబడి ఖర్చులు క్రమంగా పెరగడం, విడి భాగాల ధరల పెంపు మరియు కరెన్సీ మారకం రేటు వంటి అంశాల కారణంగా ధరలు పెంపు అనివార్యమైనట్లు వివరించింది.

హీరో టూ వీలర్ల మీద పెరిగిన ధరలు

వివిధ వేరియంట్ల మీద చేపట్టిన ధరల పెంపు అనంతరం ఏ మోడల్ మీద ఎంత వరకు ధర పెరిగిందనే విషయాన్ని స్పష్టంగా వివరించలేము. అయితే, సగటున ఒక్కో మోడల్ మీద 500 రుపాయల వరకు పెంచినట్లు హీరో మోటోకార్ప్ ఓ ప్రకనలో వెల్లడించింది.

హీరో టూ వీలర్ల మీద పెరిగిన ధరలు

హీరో మోటోకార్ప్ భారతదేశపు మరియు ప్రపంచపు అతి పెద్ద టూ వీలర్ల కంపెనీ. జూన్ నెలలో హీరో జరిపిన విక్రయాలు మార్కెట్లో తమ వాటాను మరింత పటిష్టం చేసింది. హీరో మోటోకార్ప్ జూన్ 2018 నెలలో 7,04,562 యూనిట్ల బైకులు మరియు స్కూటర్లను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో జరిపిన విక్రయాలు 6,24,185 యూనిట్లతో పోల్చుకుంటే 13 శాతం వృద్దని నమోదు చేసుకుంది.

హీరో టూ వీలర్ల మీద పెరిగిన ధరలు

ఇటీవల హీరో మోటోకార్ప్ మరో అరుదైన రికార్డును నెలకొల్పింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-మే-జూన్) ఏకంగా 21 లక్షల యూనిట్ల స్కూటర్లు మరియు మోటార్ సైకిళ్లను విక్రయించింది.

హీరో టూ వీలర్ల మీద పెరిగిన ధరలు

హీరో మోటోకార్ప్ ఈ వర్షాకాలం సీజన్‌లో సేల్స్ మరింత పెరుగుతాయని భావిస్తోంది. ఈ యేడు వర్షాకాలం సీజన్ మంచి ఫలితాలను ఇస్తుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో విక్రయాలు ఊపందుకుంటాయని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

హీరో టూ వీలర్ల మీద పెరిగిన ధరలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హీరో మోటోకార్ప్ భవిష్యత్తులో పర్ఫామెన్స్ మోటార్ సైకిళ్ల విభాగంలోకి నూతన ఉత్పత్తులతో పాటు కమ్యూటర్ సెగ్మెంట్లోకి కూడా కొత్త స్కూటర్లు మరియు టూ వీలర్లను విడుదల చేసి ద్విచక్ర వాహన పరిశ్రమలో తమ ఏకఛత్రాధిపత్యాన్ని కొనసాగించాలని భావిస్తోంది.

హీరో టూ వీలర్ల మీద పెరిగిన ధరలు

హీరో మోటోకార్ప్ తొలుత ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ బైకును విడుదల చేసి, ఆ తరువాత 125సీసీ డ్యూయెట్ మరియు మాయెస్ట్రో ఎడ్జ్ స్కూటర్లతో పాటు ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ ఆధారిత ఎక్స్‌పల్స్ ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ మోటార్ సైకిల్ విడుదలకు సిద్దమవుతోంది.

More from DriveSpark

Article Published On: Tuesday, July 10, 2018, 10:27 [IST]
English summary
Read In Telugu: Hero MotoCorp Increases Prices Across Their Range
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+