రెండు ఖరీదైన మోటార్ సైకిళ్లను సిద్దం చేస్తున్న హీరో మోటోకార్ప్

ప్రపంచపు అతి పెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ దేశీయ విపణిలోకి రెండు ఖరీదైన ప్రీమియం మోటార్ సైకిళ్లను విడుదల చేయడానికి సిద్దమైంది. డీలర్ల నుండి తాజాగా అందిన సమాచారం మేరకు, హీరో మోటోకార్ప

By Anil Kumar

ప్రపంచపు అతి పెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ దేశీయ విపణిలోకి రెండు ఖరీదైన ప్రీమియం మోటార్ సైకిళ్లను విడుదల చేయడానికి సిద్దమైంది. డీలర్ల నుండి తాజాగా అందిన సమాచారం మేరకు, హీరో మోటోకార్ప్ అతి త్వరలో విపణిలోకి హీరో ఎక్స్‍ట్రీమ్ 200ఆర్ మరియు హీరో ఎక్స్‌పల్స్ 200 బైకులను లాంచ్ చేయనుంది. వీటితో అదనంగా మరో రెండు ప్రీమియం మోటార్ సైకిళ్లను అభివృద్ది చేస్తున్నట్లు తెలిసింది.

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్,

రెండు కొత్త బైకులను కూడా ఎక్స్‌పల్స్ 200 లేదా ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ బైకును నిర్మించడానికి ఉపయోగించిన ఫ్లాట్‌ఫామ్ మీద డెవలప్ చేసే అవకాశం ఉంది. అంటే రెండు బైకుల్లో కూడా 200సీసీ ఇంజన్ వచ్చే అవకాశం ఉంది.

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్,

ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ మరియు ఎక్స్‌పల్స్ 200 బైకులో ఉన్న 200సీసీ ఇంజన్ 18బిహెచ్‌పి పవర్ మరియు 17ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసధానం కలదు.

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్,

హీరో మోటోకార్ప్ ఇప్పటికే తమ ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ మరియు ఎక్స్‌పల్స్ 200 బైకులను రివీల్ చేసింది. రెండింటిలో సింగల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. వచ్చే ఏడాది నుండి 125సీసీ కంటే ఎక్కువ కెపాసిటి గల బైకుల్లో ఏబిఎస్ తప్పనిసరి చేసింది దీంతో హీరో సిద్దం చేస్తున్న మరో రెండు బైకుల్లో కూడా ఏబిఎస్ తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంది.

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్,

రెండు కొత్త బైకుల్లో ఒక్క ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ తరహాలో ఉండగా, మరొకటి విపణిలో ఉన్న బజాజ్ పల్సర్ ఆర్ఎస్200కు పోటీనిచ్చేలా ఫెయిరింగ్ వెర్షన్‌లో రానున్నట్లు తెలిసింది. ఈ రెండు కొత్త మోడళ్లకు సంబంధించిన టెక్నికల్, ఫీచర్లు మరియు విడుదలకు సంభందించి ఎలాంటి వివరాలు వెల్లడికాలేదు. అయితే, 2019లో వీటి లాంచ్ ఉండవచ్చు.

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్,

హీరో మోటోకార్ప్ దేశీయ ప్రీమియం మోటార్ సైకిళ్ల విభాగంలోకి ప్రవేశించేందుకు ఎంతగానో ప్రయత్నిస్తోంది. మార్కెట్లో ఉన్న ఇతర 200సీసీ మోటార్ సైకిళ్లను లక్ష్యంగా చేసుకుని ఒకేసారి పలు రకాల బైకులను ప్రీమియం బైకుల సెగ్మెంట్లోకి విడుదల చేసేందుకు ప్రయత్నిస్తోంది.

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్,

స్ల్పెండర్, ప్యాసన్ మరియు హెచ్ఎఫ్ డాన్ వంటి మోడళ్లతో హీరో మోటోకార్ప్ కమ్యూటర్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్‌ను శాసిస్తోంది. అయితే, ఇవన్నీ కూడా 100-110సీసీ సెగ్మెంటుకే పరిమితం అయ్యాయి. ప్రీమియం మోటార్ సైకిల్ విభాగంలో గుర్తింపు తెచ్చుకునేందుకు ఇప్పుడు 200సీసీ ఇంజన్ కెపాసిటి ఉన్న బైకులను అభివృద్ది చేస్తోంది.

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్,

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హీరో మోటోకార్ప్ ఇండియన్ మోటార్ సైకిల్ సెగ్మెంట్లోకి ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ బైకును లాంచ్ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. తాజాగా అందిన రిపోర్ట్స్ ప్రకారం అదనంగా మరో రెండు ప్రీమియం మోటార్ సైకిళ్లను కూడా సిద్దం చేస్తున్నట్లు తెలిసింది. హీరో ప్రవేశపెడుతున్న ఖరీదైన ప్రీమియం మోటార్ సైకిళ్లు ఎంత వరకు కస్టమర్లను ఆకట్టుకుంటాయో... లేదో... తెలియాలంటే వేచి చూడాల్సిందే...

More from DriveSpark

Article Published On: Thursday, May 24, 2018, 12:38 [IST]
English summary
Read In Telugu: Hero MotoCorp To Introduce Two New Premium Motorcycles
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+