ఎథర్ ఎనర్జీలో హీరో మోటోకార్ప్ భారీ పెట్టుబడి

బెంగళూరు ఆధారిత ఎలక్ట్రిక్ టూ వీలర్ల తయారీ సంస్థలో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు సన్నద్దమవుతోంది. నూతన ఆవిష్కరణలతో శరవేగంగా పాపులారిటీ దక్కించుకుంటున్న ఎథర్ ఎనర్జీ సంస్థలో హీరో దిగ్గజం ఏకంగా 1

By Anil Kumar

ప్రపంచపు అతి పెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్, బెంగళూరు ఆధారిత ఎలక్ట్రిక్ టూ వీలర్ల తయారీ సంస్థలో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు సన్నద్దమవుతోంది. నూతన ఆవిష్కరణలతో శరవేగంగా పాపులారిటీ దక్కించుకుంటున్న ఎథర్ ఎనర్జీ సంస్థలో హీరో దిగ్గజం ఏకంగా 130 కోట్ల రుపాయలు పెట్టుబడి పెట్టడానికి సిద్దమైంది.

ఎథర్ ఎనర్జీలో హీరో మోటోకార్ప్ భారీ పెట్టుబడి

ఎలక్ట్రిక్ టూ వీలర్ల తయారీ కంపెనీలలో అనతి కాలంలో మంచి విజయాన్ని అందుకున్న అంకుర సంస్థలలో ఎథర్ ఎనర్జీ ఒకటి. కంపెనీ ఇటీవల ఎథర్ 340 మరియు ఎథర్ 450 అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసింది.

ఎథర్ ఎనర్జీలో హీరో మోటోకార్ప్ భారీ పెట్టుబడి

ఎథర్ ఎనర్జీ ఏర్పాటైన చాలా కాలం తర్వాత తమ ఉత్పత్తులను పరిచయం చేసింది. అత్యంత కఠినమైన పరీక్షలు మరియు ఆవిష్కరణల అనంతరం పూర్తి స్థాయిలో లాంచ్ చేసింది. ఈ మధ్యలోనే ఛార్జింగ్ స్టేషన్ల వ్యవస్థ మీద కూడా పనిచేసింది. అన్ని అంశాలను ఒక క్రమంలో పూర్తి చేసుకుంటూ ముందుకెళ్లడంతో భారీ సక్సెస్ అందుకుంది.

ఎథర్ ఎనర్జీలో హీరో మోటోకార్ప్ భారీ పెట్టుబడి

సక్సెస్ బాట పట్టిన అంకుర సంస్థలో పెద్ద పెద్ద దిగ్గజాలు పెట్టుబడులు పెట్టడం సహజమే. గతంలో 2016లో హీరో మోటోకార్ప్ సుమారుగా రూ. 205 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఇప్పుడు ఎథర్ ఎనర్జీలో 32.31 శాతం వాటాను కలిగి ఉంది. అదనంగా మరో 130 కోట్లు పెట్టుబడిపెడితే ఎథర్ ఎనర్జీలో సగానికి పైగా వాటా హీరో సొంతం అవ్వడం ఖాయం.

ఎథర్ ఎనర్జీలో హీరో మోటోకార్ప్ భారీ పెట్టుబడి

ఎథర్ ఎనర్జీ ఇప్పటి వరకు 425 కోట్ల రుపాయల నిధులు సమకూర్చుకుంది. హీరో మోటోకార్ప్, టైగర్ గ్లోబల్ మరియు ఫ్లిప్‌కార్ట్ ఉప-వ్యవస్థాపకులు సచిన్ బన్సల్ మరియు బిన్సీ బన్సల్ వంటి పెద్ద పెద్ద వ్యక్తులు ఎథర్‌కు నిధులు సమకూర్చారు.

ఎథర్ ఎనర్జీలో హీరో మోటోకార్ప్ భారీ పెట్టుబడి

ఐఐటి మద్రాసులో డిగ్రీ పట్టా పుచ్చుకున్న తరుణ్ మెహ్తా మరియు స్వప్నిల్ జైన్ ఇద్దరూ 2013లో ఎథర్ ఎనర్జీ సంస్థను ఏర్పాటు చేశారు. భవిష్యత్ రవాణా ఎలక్ట్రిక్ మయం అవుతుందని బలంగా విశ్వసించిన ఈ ఇద్దరు యువ శాస్త్రవేత్తలు అనుకున్నదే తడవుగా ఎథర్ ఎనర్జీకి ప్రాణం పోశారు.

ఎథర్ ఎనర్జీలో హీరో మోటోకార్ప్ భారీ పెట్టుబడి

2016లో ఎథర్ ఎనర్జీ సంస్థ ఎస్340 ఎలక్ట్రిక్ స్మార్ట్ స్కూటర్‌ను ఆవిష్కరించింది. ఎలక్ట్రిక్ ఛార్జింగ్ వ్యవస్థను విస్తరించుకుంటూనే, మరో ప్రక్కను స్కూటర్‌ను మరింత అభివృద్ది చేసింది. ఎట్టకేలకు పూర్తి స్థాయిలో లాంచ్ చేసింది.

ఎథర్ ఎనర్జీలో హీరో మోటోకార్ప్ భారీ పెట్టుబడి

ఎథర్ మొదటి ఎలక్ట్రిక్ స్మార్ట్ స్కూటర్ విడుదల వేదికలో ఎథర్ 340 మరియు 450 స్కూటర్లను ఆవిష్కరించి ప్రపంచాన్నే అశ్చర్యానికి గురి చేసింది. వీటి ధరలను వరుసగా రూ. 1,09,750 లు మరియు రూ. 1,24,750 లుగా ఖరారు చేసింది.

ఎథర్ ఎనర్జీలో హీరో మోటోకార్ప్ భారీ పెట్టుబడి

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

దేశీయ వాహన పరిశ్రమలో టూ వీలర్ల విభాగం కీలక భూమిక పోషిస్తోంది. ఎలక్ట్రిక్ టూ వీలర్ల విభాగంలో రాణించేందుకు ఏర్పాటైన ఎథర్ ఎనర్జీ తమ స్వదేశీ పరిజ్ఞానంతో ప్రపంచ శ్రేణి ఉత్పత్తులను ఆవిష్కరించింది. ధర కాస్త ఎక్కువనే అనిపించినప్పటికీ, నాణ్యత ముందు ధర మ్యాటర్ కాదని చెప్పవచ్చు. తాజాగా హీరో మోటోకార్ప్ మరోసారి భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడంతో ఎథర్ ఎనర్జీ భారతదేశపు దిగ్గజ ఎలక్ట్రిక్ టూ వీలర్ల తయారీ సంస్థగా రాణించడం ఖాయం.

More from DriveSpark

Article Published On: Friday, July 27, 2018, 16:45 [IST]
English summary
Read In Telugu: EV Development Gets A Boost — Hero MotoCorp To Invest Rs 130 Crore In Ather Energy
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+