తప్పుడు మైలేజ్ ప్రకటన- హీరో కంపెనీని కోర్టుకు ఈడ్చి గెలిచిన కస్టమర్

ప్రకటనల్లో చెప్పిన మైలేజ్ రావడం లేదని హీరో టూ వీలర్ ఓనర్ హీరో మోటోకార్ప్ మీద కోర్టులో కేసు వేసి, తీర్పులో గెలుపొందాడు.

By Anil

Recommended Video

Ducati 959 Panigale Crashes Into Buffalo - DriveSpark

భారతీయులు మైలేజ్ ప్రియులు. దీనిని గుర్తించిన టూ వీలర్ల కంపెనీలు మైలేజ్‌ లక్ష్యంగా పలు రకాల ప్రకటనలు ఇస్తాయి. ప్రకటనలను టూ వీలర్లను కొనుగోలు చేసిన కస్టమర్లు కంపెనీలు చెప్పిన మైలేజ్ రాకపోయినప్పటికీ అలాగే వాడేస్తూ ఉంటారు.

హీరో మోటోకార్ప్ మైలేజ్ ప్రకటన

అయితే, ప్రకటనల్లో చెప్పిన మైలేజ్ రావడం లేదని ఓ హీరో టూ వీలర్ ఓనర్ హీరో మోటోకార్ప్ మీద కోర్టులో కేసు వేసి, తీర్పులో గెలుపొందాడు. బైకు మొత్తం ధరను కస్టమర్‌కు తిరిగి చెల్లించడమే కాకుండా... మరో రూ. 10,000 లను కస్టమర్‌కు ఇవ్వాలని హీరోమోటోకార్ప్‌‌కు కోర్టు సూచించింది.

హీరో మోటోకార్ప్ మైలేజ్ ప్రకటన

బెంగళూరుకు చెందిన మంజునాథ్ ఆర్ నారాగౌడ్ జనవరి 30, 2013లో హీరో ఇగ్నిటర్ 125సీసీ మోటార్ సైకిల్‌ను మెజిస్టిక్ మోబైక్స్ హీరో షోరూమ్‌ నుండి కొనుగోలు చేశాడు.

హీరో మోటోకార్ప్ మైలేజ్ ప్రకటన

బైకు కోసం అన్ని ట్యాక్సులతో కలుపుకొని మొత్తం రూ. 74,796 లు చెల్లించాడు. హీరో ఇగ్నిటర్ స్మూత్ రైడింగ్‌తో పాటు లీటర్‌కు 60కిమీల మైలేజ్ ఇస్తుందని సేల్స్ ఉద్యోగులుబైకు మాటిచ్చారు. ఈ విషయాన్ని హీరో ప్రకటనల్లో కూడా ప్రచారం చేసింది.

హీరో మోటోకార్ప్ మైలేజ్ ప్రకటన

అయితే, బైకు కొనుగోలు చేసిన కొన్ని రోజులకే కంపెనీ చెప్పిన మైలేజ్ కంటే చాలా తక్కువ వస్తున్నట్లు మంజునాథ్ గుర్తించాడు. అదే పనిగా తన హీరో ఇగ్నిటర్ ఎంత మైలేజ్ ఇస్తుందో అని తెలుసుకునేందుకు పరీక్షించి చూడగా లీటర్‌ పెట్రోల్‌కు కేవలం 35కిమీల మైలేజ్ మాత్రమే వచ్చింది.

హీరో మోటోకార్ప్ మైలేజ్ ప్రకటన

మంజునాథ్ ఈ విషయాన్ని షోరూమ్ టెక్నీషియన్స్ దృష్టికి తీసుకెళ్లాడు. కొనుగోలు చేసేటపుడు మరియు ప్రకటనల్లో చెప్పిన మైలేజ్ రావడం లేదని, అంతే కాకుండా మీరు చెప్పిన మైలేజ్‌లో సగం మాత్రమే ఇస్తోందని వివరించాడు. అయితే, సెకండ్ సర్వీస్ తరువాత ఖచ్చితమైన మైలేజ్ వస్తుందని చెప్పి పంపించేశారు.

హీరో మోటోకార్ప్ మైలేజ్ ప్రకటన

సెకండ్ సర్వీస్ తరువాత సమస్యను సరాసరిగా హీరో మోటోకార్ప్ దృష్టికి తీసుకెళ్లాడు. మైలేజ్ కాస్తంత మెరుగుపడినప్పటికీ, విపరీతమైన ఇంజన్ శబ్దం మరియు రైడింగ్ చాలా అసౌకర్యంగా ఉన్నట్లు వివరించాడు.

  • మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కోసం 2018లో విడుదలవుతున్న బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు
  • హీరో మోటోకార్ప్ మైలేజ్ ప్రకటన

    హీరో నుండి ఎలాంటి వివరణ మరియు సమస్య పరిష్కారం దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో విసిగిపోయిన మంజునాథ్ తాను చెల్లించి రూ. 74,796 లు తిరిగి చెల్లించి, తమ బైకును వాపసు తీసుకోవాలని డిసెంబర్ 04, 2014 న హీరోకు లేఖ రాయగా అందుకు హీరో మోటోకార్ప్ తిరస్కరించింది.

    హీరో మోటోకార్ప్ మైలేజ్ ప్రకటన

    ఫిబ్రవరి 22, 2014 న మంజునాథ్ నారాగౌడ్ హీరో మోటోకార్ప్ మరియు మెజిస్టిక్ మోబైక్స్ మీద రెండవ అదనపు జిల్లా వినియోగదారుల వివాద పరిష్కారాల కోర్టును ఆశ్రయించాడు. సమస్యాత్మకంగా ఉన్న మోటార్ సైకిల్ గురించి మరియు హీరో ప్రకటనల గురించి వివరించాడు.

    హీరో మోటోకార్ప్ మైలేజ్ ప్రకటన

    అయితే, హీరో ప్రతినిధి ఒకరు కస్టమర్‌కు రైడింగ్ సరిగ్గా తెలియదని, సిటీలో రహదారి పరిస్థితులు సరిగా లేవని అందుకే ఆశించిన మైలేజ్ రాలేదు. అయితే, హీరో ప్రకటనల్లో పేర్కొన్న ప్రకారం చెప్పిన మైలేజ్ ఇచ్చే సామర్థ్యం ఇగ్నిటర్ మోటార్ సైకిల్‌కు ఉందని వాదించింది.

    హీరో మోటోకార్ప్ మైలేజ్ ప్రకటన

    ఈ కేసు సుమారుగా 3 సంవత్సరాల 10 నెలల పాటు నడించింది. చివరికి హీరో పేర్కొన్న మైలేజ్ నిరూపించలేకపోయింది. డిసెంబర్ 21, 2017న జరిగిన చివరి తీర్పులో హీరో మోటోకార్ప్ మరియు మెజిస్టిక్ మోబైక్స్ కస్టమర్‌ చెల్లించిన రూ. 74,796 లు తిరిగి చెల్లించి. వ్యాజ్యం పరమైన ఖర్చులకు గాను అదనంగా మరో పది వేలు చెల్లించాలని కోర్టు సూచించింది.

    • మారుతి ఆధిపత్యానికి బ్రేకులు వేయనున్న ప్యూజో
    • తలక్రిందులైన టాటా నెక్సాన్: ప్రయాణికులంతా సేఫ్!!
    • హీరో మోటోకార్ప్ మైలేజ్ ప్రకటన

      డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

      చాలా వరకు కంపెనీలు వీలైనన్ని ఎక్కువ టూ వీలర్లను విక్రయించడానికి ప్రకటనల మీద పెద్ద పెద్ద అక్షరాలతో మైలేజ్ వివరాలు రాస్తారు. కానీ వాటి క్రింది కంటికి కనిపించని అతి చిన్న అక్షరాలతో కండీషన్స్ రాస్తారు. ఇవి గమనించని కస్టమర్లు గుడ్డిగా కొనేయడం తరువాత చెప్పిన మైలేజ్ రాకపోయినా... వచ్చినంతలోనే వాడుకుంటూ ఉంటారు.

      ఏదైనా స్కూటర్ లేదా బైక్ కొనే ముందు ఇతర ఓనర్లతో చెక్ చేసుకుని ఆ తరువాత బెస్ట్ మైలేజ్ ఇచ్చే టూ వీలర్లను ఎంచుకోండి...

      బెస్ట్ మైలేజ్ ఇచ్చే స్కూటర్లు, బైకులు మరియు కార్లు గురించి చదవండి...


      ఫలించిన ఎనిమేదళ్ల నిరీక్షణ: చేసిన తప్పుకు కస్టమర్‌కు పరిహారం చెల్లించిన మారుతి

      చేసిన తప్పుకు కస్టమర్‌కు పరిహారం చెల్లించిన మారుతి

      మారుతి సుజుకి అంటే నాణ్యమైన కార్లు, అత్యుత్తమ సర్వీసింగ్, అద్భుతమైన డీలర్ నెట్‌వర్క్ కలిగిన కార్ల కంపెనీగా ఇండియన్ కస్టమర్లలో ఓ చెరగని ముద్ర వేసుకుంది. కేవలం ఈ మూడు లక్షణాల కారణంగా చాలా మంది మారుతి సుజుకి కార్లను ఎంచుకుంటారు.

      చేసిన తప్పుకు కస్టమర్‌కు పరిహారం చెల్లించిన మారుతి

      అలాంటి వారిలో ఒకరు కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఎమ్ విజేత్. మారుతి సుజుకి సంస్థను అపారంగా నమ్మిన విజేత్ మారుతి నుండి ఆల్టో లోని ఎల్ఎక్స్ఐ వేరియంట్ కారును కొనుగోలు చేశాడు. కారు డెలివరీ తీసుకున్న మొదటి రోజు నుండే టార్చర్ ఏంటో తెలుసొచ్చింది.

      చేసిన తప్పుకు కస్టమర్‌కు పరిహారం చెల్లించిన మారుతి

      మారుతి షోరూమ్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా కారులోని సమస్యలు పరిష్కారం కాకపోవడంతో వినియోగదారుల కోర్టుకు మారుతి మీద ఫిర్యాదు చేశాడు. సుమారుగా 8 సంవత్సరాలు పాటు సాగిన కేసు ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. ఈ కేసులో కస్టమర్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది.

      చేసిన తప్పుకు కస్టమర్‌కు పరిహారం చెల్లించిన మారుతి

      అసలు ఏం జరిగిందో చూద్దాం రండి....

      కర్ణాటకలోని మండోవి మోటార్స్ వద్ద ఆగష్టు 22, 2009లో సరికొత్త మారుతి ఆల్టో ఎల్ఎక్స్ కారును కొనుగోలు చేశాడు. తన తండ్రి పేరు మీద తీసుకున్న ఈ కారును విజేత్ డ్రైవ్ చేసింది చాలా తక్కువే అయినప్పటికీ, ప్రతి రోజు కారులో ఉన్న సాంకేతిక లోపాలను గుర్తిస్తూ, షోరూమ్ చుట్టూ తిరిగిన సందర్భాలే ఎక్కువ.

      చేసిన తప్పుకు కస్టమర్‌కు పరిహారం చెల్లించిన మారుతి

      అనేక సమస్యలు, తీవ్ర సాంకేతిక లోపాలున్న కారుతో విజేత్ మారుతి సర్వీసింగ్ సెంటర్ చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయాడు. ఎన్నిసార్లు మారుతి సర్వీసింగ్ సెంటర్‌ను సంప్రదించినా ఏదో ఒక లోపం బయటపడేది. ఆయన తన సొంత అవసరాలకు వాడుకున్న దానికంటే, సర్వీసింగ్ సెంటర్‌ కోసం తిరిగిందే ఎక్కువ.

      చేసిన తప్పుకు కస్టమర్‌కు పరిహారం చెల్లించిన మారుతి

      మారుతి సుజుకి డీలర్‌తో విసిగిపోయిన కస్టమర్ విజేత్ జిల్లా వినియోగదారుల కోర్టులో మారుతి మీద ఫిర్యాదు చేశాడు. అక్టోబర్ 30, 2010లో ఈ కేసు తీర్పుకు వచ్చింది. కారులో సాంకేతిక లోపాలు మరియు సమస్యలు ఉండటంతో కారు మొత్తం ధర రూ. 2.95 లక్షలు మరియు వ్యాజ్యానికి ఖర్చయిన రూ. 10,000 లను అదనంగా చెల్లించాలని మారుతి మరియు డీలర్‌కు కోర్టు సూచించింది.

      చేసిన తప్పుకు కస్టమర్‌కు పరిహారం చెల్లించిన మారుతి

      దిగువ కోర్టు తీర్పుతో అంగీకరించని మారుతి సుజుకి మరియు డీలర్ రాష్ట్ర వినియోగదారుల కోర్టులో తీర్పుకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసింది. అయితే, నవంబర్ 2, 2011 వ తేదీన రాష్ట్ర వినియోగదారుల కోర్టు కేసును కొట్టివేసి, జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.

      చేసిన తప్పుకు కస్టమర్‌కు పరిహారం చెల్లించిన మారుతి

      జిల్లా మరియు రాష్ట వినియోగదారుల కోర్టులు ఇచ్చిన తీర్పుతో అసంతృప్తి చెందిన మారుతి సుజుకి మరియు మారుతి డీలర్ ఇదే విశయమై జాతీయ కోర్టును ఆశ్రయించారు. కారును కొనుగోలు చేసిన సుమారుగా 8 సంవత్సరాల అనంతరం ఆ కేసుకు సంభందించిన తీర్పు వచ్చింది.

      చేసిన తప్పుకు కస్టమర్‌కు పరిహారం చెల్లించిన మారుతి

      సాంకేతిక లోపం ఉన్న కారును రాంజేంద్ర అనే వ్యక్తికి విక్రయించినందుకు గాను, నష్టపరిహారం క్రింద రూ. 1.5 లక్షలు చెల్లించాలని మారుతి సుజుకి మరియు డీలర్‌కు సూచించింది. వ్యాజ్యపు ఖర్చుల పరిహారం క్రింద మరో రూ. 11,000 లను రాజేంద్రకు అందించాలని కోర్టు తీర్పునిచ్చింది.

      చేసిన తప్పుకు కస్టమర్‌కు పరిహారం చెల్లించిన మారుతి

      లోపాలున్న మారుతి ఆల్టో ఎల్ఎక్స్ కారును సుమారుగా 50,000 కిలోమీటర్ల నడిపాడు. 8 సంవత్సరాలుగా వినియోగిస్తూ వచ్చాడు. అయితే, నిరీక్షణకు ఫలితం దక్కింది. మారుతి డీలర్ నుండి నష్టపరిహారంగా కోర్టు తెలిపిన మొత్తాన్ని అందుకుని దేశీయ దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మీద నెగ్గాడు.

Source: Times Of India

Most Read Articles

English summary
Read In Telugu: Hero MotoCorp told to refund cost of bike which gave poor mileage
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X