దేశవ్యాప్తంగా హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ విక్రయాలు ప్రారభించిన హీరో మోటోకార్ప్

హీరో మోటోకార్ప్ దేశవ్యాప్తంగా తమ సరికొత్త ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ మోటార్‌సైకిల్ విక్రయాలు ప్రారంభించింది. హీరో కంపెనీ యొక్క లేటెస్ట్ 200సీసీ మోటార్‌సైకిల్ హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ బైకును రూ. 89,900 ఎక్స్-

By Anil Kumar

హీరో మోటోకార్ప్ దేశవ్యాప్తంగా తమ సరికొత్త ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ మోటార్‌సైకిల్ విక్రయాలు ప్రారంభించింది. హీరో కంపెనీ యొక్క లేటెస్ట్ 200సీసీ మోటార్‌సైకిల్ హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ బైకును రూ. 89,900 ఎక్స్-షోరూమ్(ఢిల్లీ) ధరతో విడుదల చేసింది. తరువాత వారం నుండి హీరో ఫ్యాక్టరీ నుండి డీలర్లకు సరఫరా ప్రారంభించనుంది.

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ విడుదల

హీరో నుండి వచ్చిన అత్యాధునిక మరియు నూతన శ్రేణి 200సీసీ మోటార్‌సైకిల్ హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్. ఇటీవల విడుదలైన దీనిని తొలి దశ క్రింద ఈశాన్య భారతదేశ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చి, ఇప్పుడు దేశవ్యాప్తంగా విక్రయాలు ప్రారంభించింది.

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ విడుదల

సాంకేతికంగా హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్‌ ప్రీమియం పర్ఫామెన్స్ బైకులో 199సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే ఫోర్-స్ట్రోక్, సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 18బిహెచ్‌పి పవర్ మరియు 17.1ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ విడుదల

బ్రేకింగ్ విధులు నిర్వర్తించడానికి ముందు వైపున 276ఎమ్ఎమ్ మరియు వెనుక వైపున 220ఎమ్ఎమ్ డిస్క్ బ్రేకులు ఉన్నాయి. సేఫ్టీ కోసం సింగల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్‌ను ఆప్షనల్‌గా అందిస్తోంది. సస్పెన్షన్ పరంగా ముందు వైపున 37ఎమ్ఎమ్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్ మరియు వెనుక వైపున 7-దశలలో అడ్జెస్ట్ చేసుకునే అవకాశం ఉన్న మోనోషాక్ అబ్జార్వర్ కలదు.

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ విడుదల

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ బైకులో ఉన్న ఇతర ప్రధాన ఫీచర్లలో, ఎల్ఈడీ పైలెట్ ల్యాంప్స్ గల హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ టెయిల్ లైట్లు, డిజి-అనలాగ్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్ టోన్ గ్రాఫిక్స్ మరియు అత్యుత్తమ రైడింగ్ సౌకర్యాన్ని కల్పించే సీటు వంటివి ఉన్నాయి.

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ విడుదల

సరికొత్త హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ ఐదు విభిన్న డ్యూయల్ టోన్ రంగుల్లో లభ్యమవుతోంది. అవి, ఫ్యాంథర్ బ్లాక్-కూల్ సిల్వర్, బ్లాక్-రెడ్, స్పోర్ట్స్ రెడ్, చార్‌కోల్ గ్రే-ఆరేంజ్ మరియు టెక్నో బ్లూ.

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ విడుదల

హీరో మోటోకార్ప్ ఛైర్మెన్, మేనేజింగ్ డైరక్టర్ మరియు ముఖ్య కార్యనిర్వహణా అధికారి పవన్ ముంజాల్ మాట్లాడుతూ, "హీరో సంస్థకు ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ అత్యంత ముఖ్యమైన ఉత్పత్తి. దేశయ ప్రీమియం మోటార్‌సైకిళ్ల విపణిలో హీరో ఉనికిని చాటుకోవడంలో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ కీలకపాత్ర పోషిస్తుంది. అన్ని రకాల కస్టమర్లను చేరుకునేందుకు 200సీసీ ప్రీమియం బైకుల సెగ్మెంట్లో అత్యంత సరసమైన ఉత్పత్తిగా తీసుకొచ్చామని వివరించాడు."

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ విడుదల

అత్యాధునిక డిజైన్ మరియు అధునాతన ఫీచర్లతో వచ్చిన హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ కంపెనీ వృద్దిలో వీలైనంత ఎక్కువ వాటాను సొంతం చేసుకోనుంది. దీనికి తోడు అతి త్వరలో దీపావళితో పండుగ సీజన్ ప్రారంభం కానుండటంతో దేశవ్యాప్తంగా హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ బైక్‌కు మంచి ఆదరణ లభించే అవకాశం కూడా ఉంది.

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హీరో మోటోకార్ప్ ప్రవేశపెట్టిన అత్యంత సరసమైన 200సీసీ మోటార్‌సైకిల్ హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ ప్రస్తుతం విపణిలో ఉన్న బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్, కెటిఎమ్ డ్యూక్ 200 మరియు టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, August 13, 2018, 19:22 [IST]
English summary
Read In Telugu: Hero MotoCorp Announces Country-Wide Launch Of The Xtreme 200R; Priced at Rs 89,900
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+