హీరో ఎక్స్‌పల్స్ 200 అడ్వెంచర్ బైకు విడుదల ఖరారు

హీరో మోటోకార్ప్ ఈ ఏడాది ప్రారంభంలో ఫిబ్రవరిలో ఢిల్లీ వేదికగా జరిగిన ఆటో ఎక్స్ పో 2018లో ఎక్స్‌పల్స్ 200 అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించింది. తాజాగా అందిన రిపోర్ట్స్ మేరకు, హీరో మోటోకార్ప్ అతి

By Anil Kumar

ప్రపంచపు అతి పెద్ద మరియు దేశీయ దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఈ ఏడాది ప్రారంభంలో ఫిబ్రవరిలో ఢిల్లీ వేదికగా జరిగిన ఆటో ఎక్స్ పో 2018లో ఎక్స్‌పల్స్ 200 అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించింది. తాజాగా అందిన రిపోర్ట్స్ మేరకు, హీరో మోటోకార్ప్ అతి త్వరలో ఎక్స్‌పల్స్ 200 బైకును విడుదల చేస్తున్నట్లు తెలిసింది. దీని విడుదల గురించి వెల్లడైన మరిన్ని వివరాలు ఇవాళ్టి కథనంలో చూద్దాం రండి...

హీరో ఎక్స్‌పల్స్ 200 అడ్వెంచర్ బైకు

హీరో మోటోకార్ప్ తమ ఎక్స్‌‌పల్స్ 200 అడ్వెంచర్ బైకును ఈ ఏడాది మలిసగంలో విపణిలోకి లాంచ్ చేస్తున్నట్లు తెలిసింది. మరో మంచి వార్త ఏమిటంటే హీరో ఎక్స్‌పల్స్ 200 ధర లక్ష రుపాయలలోపే ఉండటం.

హీరో ఎక్స్‌పల్స్ 200 అడ్వెంచర్ బైకు

ఇది పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదలైతే, భారతదేశపు అత్యంత సరసమైన అడ్వెంచర్ బైకుగా హీరో ఎక్స్‌పల్స్ 200 మొదటి స్థానంలో నిలవనుంది. అయితే, ప్రస్తుతం రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఇండియా యొక్క చీపెస్ట్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌గా చెలామణీ అవుతోంది.

హీరో ఎక్స్‌పల్స్ 200 అడ్వెంచర్ బైకు

హీరో మోటోకార్ప్ ప్రొడక్ట్ ప్లానింగ్ గ్లోబల్ హెడ్, మాలో లీ మ్యాసన్ మాట్లాడుతూ, "70 శాతం మార్కెట్ లక్ష రుపాయలలోపు ధర ఉన్న ఉత్పత్తుల నుండే సాధ్యమవుతుంది. ఈ కారణం చేతనే తమ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ ఎక్స్‌పల్స్ 200 బైకును లక్ష రుపాయల కంటే తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపాడు."

హీరో ఎక్స్‌పల్స్ 200 అడ్వెంచర్ బైకు

సాంకేతికంగా హీరో ఎక్స్‌పల్స్ 200 బైకులో 200సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే ఫ్యూయల్ ఇంజెక్టెడ్ సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 18.1బిహెచ్‌పి పవర్ మరియు 17.2ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇదే ఇంజన్ హీరో ఎక్స్‌ట్రీమ్ బైకులో కూడా ఉంది. అయితే, ఎక్స్‌పల్స్ 200 అడ్వెంచర్ వెర్షన్ కావడంతో దీని పవర్ మరియు టార్క్ అధికంగా ఉండే అవకాశం ఉంది.

హీరో ఎక్స్‌పల్స్ 200 అడ్వెంచర్ బైకు

హీరో ఎక్స్‌పల్స్ 200 డిజైన్ విషయానికి వస్తే, ఎత్తైన రైడింగ్ పొజిషన్, అతి తక్కువ బాడీ ప్యానల్స్, మరియు పూర్తి స్థాయి ఎల్ఇడి హెడ్‌ల్యాంప్, ఎత్తైన విండ్ స్క్రీన్ మరియు ఎత్తైన ఫ్రంట్ మడ్ గార్డ్ వంటివి దీనికి అడ్వెంచర్ లుక్ తీసుకొచ్చాయి. అంతే కాకుండా హీరో ఎక్స్‌పల్స్ బైకులో నకుల్ గార్డ్స్ ఇంకా ఎన్నో అదనపు ఫీచర్లు ఉన్నాయి.

హీరో ఎక్స్‌పల్స్ 200 అడ్వెంచర్ బైకు

హీరో ఎక్స్‌పల్స్ 200 అడ్వెంచర్ బైకులోని ప్రధాన ఫీచర్ల విషయానికి వస్తే, ఆఫ్ రోడింగ్‌కు సంభందించిన ఇంజన్ స్కిడ్ ప్లేట్, ఎత్తైన ఎగ్జాస్ట్ పైపు ఉండటంతో నీటిలో వెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంది, ఆఫ్ రోడ్ మరియు ఆన్ రోడ్ అవసరాలకు ఉపయోగపడే టైర్లు మరియు స్పోక్ వీల్స్ ఉన్నాయి. ముందు వైపున 21-అంగుళాలు మరియు వెనుక వైపున 19-అంగుళాల పరిమాణంలో ఉన్న టైర్ల మీద ఎక్స్‌పల్స్ దూసుకెళుతుంది.

హీరో ఎక్స్‌పల్స్ 200 అడ్వెంచర్ బైకు

ఇతర ముఖ్యమైన ఫీచర్లలో ముందు వైపున లాంగ్ ట్రావెల్ గల టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక వైపున మోనోషాక్ అబ్జార్వర్, 220ఎమ్ఎమ్ గ్రౌండ్ క్లియరెన్స్ మరియు రెండు చక్రాలకు డిస్క్ బ్రేకులు ఉన్నాయి. భద్రత కోసం సింగల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. ఆఫ్ రోడింగ్ చేసేటపుడు ఏబిఎస్‌ను ఆఫ్ చేసుకునేందుకు ప్రత్యేక స్విచ్ కూడా ఉంది.

హీరో ఎక్స్‌పల్స్ 200 అడ్వెంచర్ బైకు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హీరో మోటోకార్ప్ ఎక్స్‌పల్స్ 200 అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌ను లాంచ్ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఇది 2017లో మార్కెట్ నుండి వైదొలగిన ఇంపల్స్ అడ్వెంచర్ బైకు స్థానాన్ని భర్తీ చేయనుంది. మోటార్‌సైకిల్ అడ్వెంచర్ రైడ్స్ మరియు టూరింగ్ అధికమవుతున్న నేపథ్యంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చిన అబ్బాలను టార్గెట్ చేసుకుని ఈ అడ్వెంచర్ బైకును రూపొందించింది. అత్యంత సరసమైన ధరతో, ప్రతి బైక్ ప్రియుడిని ఆకట్టుకునే ధరలో ప్రవేశపెట్టడానికి హీరో సన్నద్దమవుతోంది.

హీరో ఎక్స్‌పల్స్ 200 అడ్వెంచర్ బైకు

1.ఎట్టకేలకు రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల్లో ఏబిఎస్

2.నమ్మశక్యంగాని ధరతో హోండా సిబిఆర్250ఆర్ విడుదల

3.టాటా హెచ్5ఎక్స్‌ ఎస్‌యూవీకి మళ్లీ రహదారి పరీక్షలు: విడుదలకు సర్వం సిద్దం

4.బజాజ్ పల్సర్ ఎల్ఎస్135 బైక్‌కు శాస్వత వీడ్కోలు

5.ఇప్పుడు అవెంజర్ స్ట్రీట్ 150 వంతు వచ్చింది

Source: Autocar Professional

Most Read Articles

English summary
Read In Telugu: Hero XPulse 200 Launch Details Revealed; Expected Price, Specs, Features And More
Story first published: Monday, April 16, 2018, 20:15 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X